BigTV English

Amazon Quick ommerce : ఇకపై 15 నిమిషాల్లోనే అమెజాన్ డెలివరీ.. ఏ నగరాల్లో అంటే!

Amazon Quick ommerce : ఇకపై 15 నిమిషాల్లోనే అమెజాన్ డెలివరీ.. ఏ నగరాల్లో అంటే!

Amazon Quick ommerce : ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. ఈ నెలాఖరులోనే తన క్విక్‌ కామర్స్‌ సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ స్వయంగా వెల్లడించారు. లుత బెంగళూరు నగర వాసులు ఈ సర్వీసులు వినియోగించుకోనున్నారని తెలిపారు.


టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో ఫాస్టెస్ట్ సేవలు సైతం అంతే అవసరం అవుతున్నాయి. ఇందుకు అనుగుణంగా ఈ కామర్స్ సంస్థలన్నీ తమ సేవలను మరింత విసృతం చేస్తున్నాయి. దీంతో ప్రతీ వస్తువు నిమిషాల్లో కళ్ల ముందు చేరిపోతుంది. ఇక ఈ రోజుల్లో  క్విక్‌ కామర్స్‌ (quick commerce)కు విపరీతంగా ఆదరణ పెరుగుతుండడంతో అనేక సంస్థలు ఈ తరహా సేవల్ని అందించేందుకు సైతం సిద్ధమవుతున్నాయి.

ప్రముఖ ఇ కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ (Amazon) సైతం క్విక్‌ కామర్స్‌ సేవలను కస్టమర్స్ కు అందుబాటులోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఇదే విషయంపై కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ అగర్వాల్‌ (Amit Agarwal) క్లారిటీ ఇచ్చారు. ఈ నెలాఖరులోనే ఈ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.


ఓ ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో అగర్వాల్‌ డిసెంబర్‌ నెలాఖరులోగా తన క్విక్‌ కామర్స్‌ సేవల్ని అందుబాటులోకి తేనున్నట్లు స్పష్టం చేశారు. అయితే తొలుత బెంగళూరు నగర వాసులు ఈ సర్వీసులు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఈ క్విక్‌ కామర్స్‌ సేవల్లో భాగంగా 1,000 2,000 ఉత్పత్తులు డెలివరీలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.

ఇక ఈ ఫైలట్‌ ప్రాజెక్ట్‌ విజయవంతమైతే రానున్న రోజుల్లో ఈ సేవల్ని మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ క్విక్ కామర్స్ సేవలతో కేవలం 15 నిమిషాల్లో డెలివరీ కస్టమర్ ను చేరుతుంది. ఇప్పటికే పలు సంస్థలు ఈ సేవలను ప్రారంభించినప్పటీకీ.. ఈ క్విక్‌ కామర్స్‌ విభాగంలో అమెజాన్‌ ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి.

ఇక అమెజాన్ ఈ సేవలను మరింత విస్తరించాలని ఎప్పటినుంచో ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా 2025లో ఈ సేవలను ప్రారంభించాలని తొలుత భావించింది. అయితే, రోజు రోజుకూ కొత్త కంపెనీలు వచ్చి చేరుతుండటంతో తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది. ఈ ఏడాదే ఈ సేవలను ప్రారంభించటానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ సేవల్ని కస్టమర్స్ కు పరిచయం చేసేందుకు నడుంబిగించింది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఇప్పటికే ప్రత్యేకమైన రిక్రూట్‌మెంట్‌ను సైతం అమెజాన్‌ చేపట్టినట్లు సమాచారం.

ఇప్పటికే పలు ఈ కామర్స్ సంస్థలు ఈ సేవలను ముమ్మరం చేశాయి. ప్రస్తుతం బ్లింకిట్‌, స్విగ్గీతో పాటు జెప్టో సైతం ఈ సేవలను అందిస్తుంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్‌ సైతం ‘మినిట్స్‌’ పేరిట క్విక్‌ కామర్స్‌ సేవలకు ప్రత్యేకంగా శ్రీకారం చుట్టింది. ఈ సర్వీసెస్ లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టాటా గ్రూపు సైతం ఎంట్రీ ఇవ్వనున్నాయి. మరి అమెజాన్ ప్రారంభించే ఈ సేవలు భిన్నంగా ఉండనున్నాయో లేదో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

ALSO READ : చీప్ స్మార్ట్ ఫోన్స్ అదిరే ఫీచర్స్ తో! ఈ నాలుగే బెస్ట్ ఆఫ్షన్

Related News

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Samsung Galaxy Z Fold 7: శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 రిపేర్ చేయడం చాలా కష్టం.. iFixitలో అతి తక్కువ స్కోర్

Big Stories

×