BigTV English

Manchu Manoj: రీ రిలీజ్ లతో కొత్త సినిమాలను చంపొద్దు.. భైరవం పై ఖలేజా ఎఫెక్ట్..

Manchu Manoj: రీ రిలీజ్ లతో కొత్త సినిమాలను చంపొద్దు.. భైరవం పై ఖలేజా ఎఫెక్ట్..

Manchu Manoj: భైరవం(Bhairavam) సినిమా ద్వారా మంచు మనోజ్ ,నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మే 30వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. విజయ్ కనకమెడల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం గరుడన్ సినిమాకు రీమేక్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే .ఇక ఈ సినిమా తెలుగుకు అనుగుణంగా మార్పులు చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అన్ని ప్రాంతాలలో ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.


కొత్త సినిమాలపై రీ రిలీజ్ ఎఫెక్ట్…

ఈ సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మీడియా సమావేశంలో పాల్గొంటూ మీడియా వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్ నిర్మాతను ప్రశ్నిస్తూ… ప్రస్తుతం భైరవం సినిమాతో పాటు ఖలేజా(Khaleja) సినిమాను కూడా తిరిగి విడుదల చేశారు… ఖలేజా సినిమా భైరవం కలెక్షన్ల పై ప్రభావం చూపించిందని మీరు భావిస్తున్నారా? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు నిర్మాత సమాధానం కచ్చితంగా ఉంటుందని తెలిపారు. ఒక కొత్త సినిమా విడుదలైనప్పుడు పోటీగా మరొక సినిమా విడుదలైతే ఖచ్చితంగా కొత్త సినిమాపై ప్రభావం చూపుతోందని సమాధానం ఇచ్చారు. మరి ఈ విషయం గురించి ఫిలిం ఛాంబర్ లో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు కదా అంటూ మరొక ప్రశ్న వేశారు.


వీకెండ్ లో వద్దు….

ఇప్పటివరకు ఈ విషయం గురించి ఫిలిం చాంబర్లో చర్చించాలనే ఆలోచన మాకైతే రాలేదు మీరు ఇచ్చిన సలహా కారణంగా ఈ విషయం గురించి అందరూ చర్చిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్(Manchu Manoj) ఈ విషయంపై స్పందిస్తూ తన నిర్ణయాన్ని కూడా తాను తెలియజేస్తానని తెలిపారు. ఇలా ఒక కొత్త సినిమా విడుదల అవుతున్నప్పుడు పాత సినిమాలను రీ రిలీజ్ చేయటం వల్ల కొత్త సినిమా కలెక్షన్లపై ఆ ప్రభావం చూపుతుందని దయచేసి కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు పాత సినిమాలను రీ రిలీజ్ చేసి కొత్త సినిమాలను చంపొద్దని కోరారు.

ఒకవేళ పాత సినిమాలను తిరిగి రీలీజ్ చేయాలి అనుకుంటే వీకెండ్ కాకుండా వీక్ డేస్ లో విడుదల చేస్తే బాగుంటుందనేది నా సొంత అభిప్రాయం అని మనోజ్ ఈ సందర్భంగా రీ రిలీజ్ సినిమాల విడుదల గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మనోజ్ చేసిన ఈ వ్యాఖ్యలు న్యాయబద్ధంగానే ఉన్నాయని చెప్పాలి. ఒక సినిమా కోసం ఎంతోమంది కష్టపడి పనిచేస్తారు. అలాంటిది సినిమా విడుదలైనప్పుడు ఇదివరకే విడుదలైన బ్లాక్ బాస్టర్ సినిమాలు తిరిగి విడుదల అయితే కచ్చితంగా కొత్త సినిమాలపై ఆ ప్రభావం చూపించి కలెక్షన్లు తగ్గే అవకాశాలు ఉంటాయి. మరి ఈ విషయంపై ఫిలిం ఛాంబర్ లో చర్చించి ఈ సమస్యకు చెక్ పెడతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×