Gautham Tinnanuri On Naveen Nooli : ఒక సినిమా ప్రేక్షకులు ముందుకు రావాలంటే చాలామంది టెక్నీషియన్స్ కష్టం వెనుక ఉంటుంది. ముఖ్యంగా ఒక సినిమా కోసం డైరెక్టర్ ఎంత కష్టపడతాడో దాదాపు అదే స్థాయిలో కష్టపడే ఒక టెక్నీషియన్ ఎడిటర్. ఒక సినిమా జాతకాన్ని డిసైడ్ చేయగలిగే శక్తి ఎడిటర్ చేతిలో ఉంటుంది. అయితే ఎడిటర్స్ కి సరైన గుర్తింపు ఉండదు. ఆడియో ఫంక్షన్ లో కూడా ఎక్కువగా ఎడిటర్స్ కనిపించరు. కేవలం ఎడిట్ రూమ్ కి మాత్రమే పరిమితం అయిపోయి సినిమాను అద్భుతంగా చెక్కుతారు. దర్శకుడి ఆలోచనను అర్థం చేసుకొని అది ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీర్చిదిద్దడంలో ఎడిటర్ కీలకపాత్రను వహిస్తాడు. అయితే ఒకప్పుడు ఎడిటర్స్ కి సరైన గుర్తింపు లేదు అనేది వాస్తవం కానీ ఇప్పుడిప్పుడే ఎడిటర్ ను కూడా గుర్తించడం మొదలుపెట్టారు కొంతమంది సినీ ఫైల్స్.
బ్లాక్ బస్టర్ ఎడిటర్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఎడిటర్లు ఉన్నారు. అయితే వారిలో దాదాపు ఎక్కువ సినిమాలకి ఇప్పుడు ఉన్న జనరేషన్ చూసిన పేరంటే మార్తాండ కే వెంకటేష్. పూరి జగన్నాథ్ చేసిన ఎన్నో సినిమాలుకు ఈయన ఎడిటింగ్ చేశారు. అలానే దిల్ రాజ్ బ్యానర్ లో వచ్చే చాలా సినిమాలకు ఈయనే ఎడిటర్. ఎడిట్ టేబుల్ మీద సినిమా జాతకాన్ని చెప్పగలిగే మంచి ఎడిటర్ ఈయన. చాలా సినిమాలకు సంబంధించి ముందే వాటి రిజల్ట్ ను చెప్పేసేవారు. ప్రస్తుత కాలంలో నవీన్ నులి ఎడిటర్ గా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలకు కీలకపాత్ర వహించాడు. రంగస్థలం, జెర్సీ, అలవైకుంఠపురంలో, అరవింద సమేత వీర రాఘవ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు నవీన్ నూలి ఎడిటర్ గా పని చేశాడు. ప్రస్తుతం చాలా పాన్ ఇండియా ప్రాజెక్టులు ఈయన చేతిలో ఉన్నాయి.
నా దృష్టిలో నువ్వు అండర్ రేటెడ్
తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మళ్ళీ రావా సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు గౌతం తిన్ననూరి. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత నాని హీరోగా చేసిన జెర్సీ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. నేషనల్ అవార్డు కూడా ఈ సినిమాకు వచ్చింది. ఈ సినిమాను ఎడిట్ చేశాడు నవీన్ నూలి, నవీన్ కు గౌతం కు మధ్య మంచి బాండింగ్ ఉంది. బహుశా అందుకే నవీన్ కు బెస్ట్ ఎడిటర్ అవార్డు వచ్చినా కూడా, దానిపై కీలకమైన వ్యాఖ్యలు చేశాడు దర్శకుడు గౌతమ్. ట్విట్టర్ వేదికగా గౌతమ్ స్పందిస్తూ నా దృష్టిలో నీకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా కూడా నువ్వు మోస్ట్ అండర్ రేటెడ్ ఎడిటర్ అంటూ నవీన్ పై తన ప్రేమను తెలియజేశాడు గౌతం.