BigTV English

Manoj VS Vishnu: విష్ణు పర్సనల్ విషయాలు బయటపెడుతున్న మనోజ్..ఇంతకు తెగించారేంట్రా..?

Manoj VS Vishnu: విష్ణు పర్సనల్ విషయాలు బయటపెడుతున్న మనోజ్..ఇంతకు తెగించారేంట్రా..?

Manoj VS Vishnu:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా మంచు కుటుంబం (Manchu Family) లో గొడవలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీ(MBU)లో అవకతవకలు జరుగుతున్నాయని, పలు రకాల ఫీజుల పేరిట విద్యార్థులపై రుద్దుతున్నారని, అటు ఫీజులు కట్టలేక ఆర్థిక భారంతో విద్యార్థులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా బాధపడుతున్నారని, తనతో వారు ఈ విషయాలు చెప్పుకున్నారని, మనోజ్ గత కొన్ని రోజులుగా మీడియాతో చెప్పుకొస్తున్నారు. మరొకవైపు మంచు మోహన్ బాబు(Manchu Mohan babu) ఆస్తి విషయాల వల్లే గొడవ పడుతున్నాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


చంద్రగిరిలో ఇరు వర్గాలపై కేస్ ఫైల్..

ఇదిలా ఉండగా సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి మంచు ఫ్యామిలీ తిరుపతి వెళ్ళిన విషయం తెలిసిందే. మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ బాబు,ఆయన పెద్ద కొడుకు మంచు విష్ణు(Manchu Vishnu) ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. మనోజ్ కూడా తనకు కూతురు పుట్టిన తర్వాత మొదటి సంక్రాంతి కావడంతో తిరుపతిలోని తన నివాసంలో సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. కానీ తమపై దాడికి వస్తున్నారని మంచు మోహన్ బాబు పిఏ చంద్రగిరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఆ తర్వాత డెయిరీ ఫార్మ్ వద్ద ఇరు వర్గాల వారు గొడవపడడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ఇరు వర్గాల వారు కూడా పరస్పర కంప్లైంట్ ఇచ్చుకోవడంతో ఇద్దరిపై కూడా కేసులు నమోదు చేశారు.


కూర్చొని మాట్లాడుకుందాం అంటున్న మంచు మనోజ్..

ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ (Manchu Manoj) తాజాగా ఒక పోస్ట్ షేర్ చేయడంతో ఇది చూసిన ప్రతి ఒక్కరు తన అన్నయ్య మంచు విష్ణు (Manchu Vishnu) పర్సనల్ విషయాలను కూడా బయటపెడుతున్నాడు అంటూ ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా తన ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెడుతూ.. ” కలిసి కూర్చుని మాట్లాడుకుందాం.. నాన్న, ఇంట్లోని మహిళలు, ఉద్యోగులు, మిగిలిన వాళ్ళను పక్కనపెట్టి, కేవలం మనిద్దరమే చర్చించుకుందాం. ఏమంటావ్.. నేను ఒంటరిగానే వస్తానని మాట ఇస్తున్నాను. కానీ నువ్వు నీకు నచ్చిన వాళ్లను తీసుకురావచ్చు. లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం.. మీ కరెంటు తీగ” అంటూ రాసుకు వచ్చారు. మంచు మనోజ్.

నానా అర్థాలు తీసున్న నెటిజెన్స్..

అయితే ఇదంతా బాగానే ఉంది కానీ కింద దీనికి జతచేసిన ఫోటో మాత్రం పలు అర్థాలకు దారితీస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ (Pawan kalyan), సమంత (Samantha) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం “అత్తారింటికి దారేది”. ఈ సినిమాలోని ఒక క్లిప్పును ఈయన జత చేశారు. అందులో బ్రహ్మానందం (Brahmandam), నటి హేమా బుగ్గ గిల్లుతూ ఉండగా.. వెనుక ప్రదీప్ షాక్ అయినట్టు వుండే ఫోటోను ఆయన షేర్ చేయడంతో మనోజ్.. విష్ణు యొక్క పర్సనల్ విషయాలను బయటకు తీస్తున్నాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా వీళ్ళిద్దరూ కూడా ఇలా ఒకరి పరువు ఇంకొకరు తీసుకోవడంతో నెటిజన్స్ సైతం ఇంతకు తెగించారేంట్రా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా మనోజ్ పెట్టిన పోస్ట్ కి, షేర్ చేసిన ఫోటోకి పలు రకాల అర్థాలను వెతుకుతున్నారు నెటిజన్స్. మరి మనోజ్ తన అన్నయ్య విష్ణు గురించి ఏ విషయాన్ని బయట పెట్టాలనుకుంటున్నారో తెలియదు కానీ నెటిజెన్స్ మాత్రం పలు రకాల అర్థాలను వెతికేస్తున్నారు అనడంలో సందేహం లేదు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×