Tirumala News: తిరుమల కొండలు నిత్యం గోవింద గోవింద అనే నామస్మరణతో మార్మోగుతాయి. వేసే అడుగు.. తీసే అడుగు నిత్యం వెంకటేశ్వరుడు స్మరణలో ఉంటారు. చివరకు చెడు మాటలు ఆడటానికి భక్తులు ఇష్టపడరు. ఏడు కొండలపై కొలువైన శ్రీవారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తి ముసుగులో అన్యమత ప్రచారానికి పాల్పడినవారు కొందరైతే.. అపవిత్రం చేసేవారు మరికొందరు.
తాజాగా తమిళనాడుకి చెందిన కొందరు భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. తిరుపతిలో దిగిపోయారు. అక్కడి నుంచి మెట్ల మార్గంలో తిరుమలపైకి నడిచి వెళ్లారు. అయితే వస్తూ వస్తూ ఆ భక్తుల టీమ్.. కోడి గుడ్లు, పలావ్‌తో అక్కడికి చేరుకుంది. రాంభగిచా బస్టాండ్ ఆవరణలో కోడిగుడ్డు, పలావ్ ఆరగించడాన్ని గుర్తించారు కొందరు శ్రీవారి భక్తులు.
ఈ విషయాన్ని వెంటనే పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, వెంటనే వారు తింటున్న ఆహారాన్ని సీజ్ చేశారు. తిరుమలలో మాంసాహారం తినడం నిషేధించామని, ఇకపై ఈ విధంగా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయం తెలియగానే టీటీడీ అధికారులు అలర్ట్ అయ్యారు.
దీనికి సంబంధించి వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. అసలు దేవాలయాలకు వెళ్లేటప్పుడు నియమాలు, నిష్టతో వెళ్తారు. ఏకంగా కోడి గుడ్లు, పలావ్‌తో వచ్చారంటే.. కావాలనే ఎవరో చేసి ఉంటారనే వాదనలు తిరుమల కొండపై లేకపోలేదు. తిరుమల అపవిత్రను దెబ్బతీసేందుకు ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలని భక్తులు కోరుతున్నారు.
ALSO READ: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్, దేనికి?
BREAKING NEWS
తిరుమల కొండపై అపచారం.
కొండపైకి తీసుకొచ్చిన కోడిగుడ్ల కూర, పలావ్ అన్నం. pic.twitter.com/UhNuhRJaxc
— 𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠 (@YSJ2024) January 18, 2025