BigTV English

This Week OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లంటే?

This Week OTT Movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడే సందడి.. మొత్తం ఎన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లంటే?


This Week OTT And  Theater Release Movies: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లలో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ సారి థియేటర్లలో చిన్న సినిమాలదే హవా. ఏకంగా 10కి పైగా సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీగా ఉన్నాయి. అంతేకాకుండా మరోవైపు ఓటీటీలో కూడా పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్, ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

వెయ్‌ దరువెయ్‌:


సాయిరాం శంకర్‌, యషా శివకుమార్‌ హీరో హీరోయిన్‌గా నటిస్తోన్న కొత్త సినిమా ‘వెయ్ దరువెయ్’. నవీన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ మార్చి 15 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సునీల్, సత్యం రాజేష్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

రజాకార్‌:

యాటా సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘రజాకార్’. బాబీ సింహా, వేదిక, ప్రేమ, ఇంద్రజ, అనుష్య త్రిపాఠి, అనసూయ, మకరంద్ దేశ్ పాండే ఈ మూవీలో నటీ నటులుగా ఉన్నారు. భీమ్స్‌ సిసిరిలియో అందిస్తున్న ఈ చిత్రాన్ని గూడురు నారాయణరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ మార్చి 15న రిలీజ్ కానుంది.

తంత్ర:

శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకత్వంలో అనన్య నాగళ్ల, ధనుష్‌, సలోని తదితరులు కీలక పాత్ర పోషిస్తోన్న కొత్త సినిమా తంత్ర. ఈ సినిమా మార్చి 15న రిలీజ్ కానుంది.

ఈ చిత్రాలతో పాటు షరతులు వర్తిస్తాయి!, లైన్‌మ్యాన్‌, రవికుల రఘురామ, లంబసింగి, యోధ, ప్రేమలో ఇద్దరు, కుంగ్‌ఫూ పాండా4, మాయ 2024 వంటి సినిమాలు కూడా థియేటర్‌లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి.

ఈ వారం ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయ్యే చిత్రాలు/సిరీస్‌లు

జియో సినిమా:

హనుమాన్‌ (హిందీ) మార్చి16

ట్రాల్స్‌బ్యాండ్ టుగెదర్(ఇంగ్లీష్ మూవీ) – మార్చి17

నెట్‌ఫ్లిక్స్‌

టూ కిల్‌ ఏ టైగర్‌(హిందీ) మార్చి10

యంగ్‌ రాయల్స్ సీజన్3(స్వీడిష్ సిరీస్) మార్చి11

జీసస్ రివల్యూషన్(ఇంగ్లీష్ సినిమా) మార్చి12

టర్నింగ్ పాయింట్(ఇంగ్లీష్ సిరీస్) మార్చి12

బండిడోష్(స్పానిష్ సిరీస్) మార్చి13

24హవర్స్ విత్ గాస్పర్(ఇంగ్లీష్ సినిమా) మార్చి14

గర్ల్స్ 5ఎవా: సీజన్3(ఇంగ్లీష్ సిరీస్) మార్చి 14

లాల్‌ సలామ్‌(తమిళ) మార్చి 15

చికెన్ నగ్గెట్(కొరియన్ సిరీస్) మార్చి15

ఐరిష్‌విష్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి15

ఐరన్ రియన్(స్పానిష్ సిరీస్) – మార్చి 15

మర్డర్ ముబారక్ (హిందీ సినిమా) – మార్చి 15

అమెజాన్‌ ప్రైమ్‌

లవ్ అదురా(హిందీ సిరీస్) – మార్చి13

ఇన్విన్సబుల్ సీజన్2 పార్ట్2 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి14

బిగ్‌‌గర్ల్స్‌ డోంట్‌ క్రై (హిందీ సిరీస్) మార్చి14

ఫ్రిడా(ఇంగ్లీష్ మూవీ) – మార్చి15

డిస్నీ+హాట్‌స్టార్‌

లవర్‌(తమిళ చిత్రం) మార్చి15

సేవ్‌‌ది టైగర్స్‌2 (తెలుగు సిరీస్‌) మార్చి15

గ్రేస్ అనాటమీ: సీజన్20 (ఇంగ్లీష్ సిరీస్) – మార్చి15

టేలర్ స్విఫ్ట్: ద ఎరాస్‌టూర్ (ఇంగ్లీష్ మూవీ) – మార్చి15

సోనీలివ్‌

భ్రమయుగం(మలయాళం/తెలుగు) మార్చి15

లయన్స్‌ గేట్‌‌ప్లే

నో వే అప్‌(తెలుగు వెర్షన్‌) మార్చి15

జీ5

మే అటల్‌ హూ(హిందీ) మార్చి14

ఆపిల్ ప్లస్ టీవీ

మ్యాన్ హంట్(ఇంగ్లీష్ సిరీస్) – మార్చి15

బుక్ మై షో

ద డెవిల్ కాన్స్‌పరసీ(ఇంగ్లీష్ సినిమా) – మార్చి15

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×