BigTV English

Thandel Movie Business : పేరుకే పెద్ద సినిమా… బిజినెస్ మాత్రం చాలా చిన్నది

Thandel Movie Business : పేరుకే పెద్ద సినిమా… బిజినెస్ మాత్రం చాలా చిన్నది
Advertisement

Thandel Movie Business : తండేల్… నాగ చైతన్య కెరీర్‌లో ఇదో పెద్ద సినిమా. అంతే కాదు… ఈ మూవీని నిర్మిస్తున్న గీతా ఆర్ట్స్‌ కూడా ఇప్పటి వరకు ఏ సినిమాకు పెట్టనంత బడ్జెట్ దీనిపై పెట్టలేదు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక మూవీకి, ఇంత పెద్ద మూవీకి బిజినెస్ మాత్రం చాలా తక్కువ జరిగిందట. పేరుకే పెద్ద మూవీ… బిజినెస్ పరంగా చూస్తే మాత్రం చాలా చిన్న సినిమా అని అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆ బిజినెస్ డీటైల్స్ ఏంటో ఇప్పుడు చూద్ధాం…


నాగ చైతన్య కెరీర్ స్టార్ట్ అయి దాదాపు 16 ఏళ్లు అవుతుంది. కానీ, ఆయన ఫిల్మోగ్రఫీలో చెప్పుకోవడానికి ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ మూవీ కూడా లేదు. కనీసం భారీ బడ్జెట్ మూవీ కూడా లేదు. ఇప్పుడ ఆ లోటును తీర్చడానికి వస్తుంది తండేల్. దాదాపు 80 నుంచి 90 కోట్ల భారీ బడ్జెట్‌తో, నాగ చైతన్య కెరీర్‌లోనే భారీ మూవీగా ఈ తండెల్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం జోరుగా ప్రమోషన్స్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తండేల్‌ మూవీకి సంబంధించిన బిజినెస్ డీటైల్స్ బయటికి వచ్చాయి.


దాదాపు 90 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీని ఆంధ్ర ఏరియాలో 11 కోట్ల బిజినెస్ జరిగిందట. నైజాం ఏరియాలో 7 కోట్లు, సీడెడ్ 3.5 కోట్ల బిజినెస్ జరిగినట్టు సమాచారం. అలాగే ఇతర రాష్ట్రాల్లో దాదాపు 4 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగిందట. ఇక ఓవర్సీస్‌లో అయితే 5 కోట్ల వరకు బిజినెస్ అయినట్టు సమాచారం.

మొత్తంగా ఈ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ 31 కోట్ల వరకు అయిందని సమాచారం.

90 కోట్ల భారీ బడ్జెట్‌తో వచ్చే మూవీకి ఇంత తక్కువ బిజినెస్ జరగడం ఏంటి అని అక్కినేని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

నాన్ థియేట్రికల్‌ బిజినెస్… 

థియేట్రికల్ బిజినెస్ ఈ పెద్ద మూవీకి చాలా తక్కువ అయింది. కానీ, నాన్ థియేట్రికల్ బిజినెస్ మాత్రం పర్లేదు అనిపించేలా ఉంది. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ దాదాపు 35 కోట్లకు దక్కించుకుందట. హిందీ వెర్షన్ రైట్స్‌కి 8 కోట్లు వచ్చాయట. అలాగే ఆడియో రైట్స్ 7 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం. తండేల్ శాటిలైట్ రైట్స్ కి కూడా భారీగానే వచ్చినట్టు తెలుస్తుంది. జీ తెలుగు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను దాదాపు 10 కోట్లు పెట్టి తీసుకుందట.

అంటే ఈ మూవీకి నాన్ థియేట్రికల్‌ వల్ల దాదాపు 60 కోట్లు వచ్చాయి. అలాగే థియేట్రికల్ బిజినెస్ వల్ల 31 కోట్లు వచ్చాయి. ఈ తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ 90 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. ప్రీ బిజినెస్ వల్ల దాదాపు 91 కోట్లు నిర్మాతకు వచ్చాయి. అంటే కలెక్షన్లు రాకముందే అల్లు అరవింద్ సేఫ్ సైడ్ అయిపోయారు అన్నమాట.

కాగా, నాగ చైతన్య – సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. కార్తికేయ 2తో మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు.

Related News

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Mouli: పోలీస్ గెటప్ లో అదరగొట్టేసిన లిటిల్ హార్ట్స్ హీరో.. ఇదిగో వీడియో!

Sree Leela: శ్రీలీల 150 కోట్ల యాడ్ ఫిలిం టీజర్ చూశారా..ఏంటి స్వామీ ఈ అరాచకం!

Influencer Bhavani Ram : కన్నీళ్లు తెప్పిస్తున్న ఇన్‌ఫ్లుయెన్సర్ భవాని స్టోరీ… అప్పుడు ట్రోల్ చేశారు.. ఇప్పుడు సంపాదన ఎంతంటే?

Lazawal Ishq Show: పాక్‌‌లో డేటింగ్ రియాల్టీ షో.. వెంటనే ఆపాలంటూ గోలగోల, ఎందుకంటే?

Venu Swamy: శత్రువుల నాశనం కోసం వేణు స్వామి పూజలు…నీటిపై తేలియాడుతూ అలా!

Big Stories

×