BigTV English
Advertisement

Rajeev shukla: అందరి షర్ట్స్ విప్పి తిరగమన్నాడు.. గంగూలీపై రాజీవ్ శుక్లా సంచలనం!

Rajeev shukla: అందరి షర్ట్స్ విప్పి తిరగమన్నాడు.. గంగూలీపై రాజీవ్ శుక్లా సంచలనం!

Rajeev shukla: అంతర్జాతీయ క్రికెట్ లో ఎన్నో మ్యాచ్ లు గుర్తుండేలా చేస్తాయి. సరికొత్త చరిత్రను నెలకొల్పుతాయి. ఇలా భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాట్ వెస్ట్ సిరీస్ లోని ఫైనల్ మ్యాచ్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది. ఈ మ్యాచ్ జరిగి దాదాపు 24 ఏళ్లు కావస్తున్నా.. ఈ మ్యాచ్ ని క్రీడాభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఫైనల్ మ్యాచ్ క్రీడాభిమానులతో పాటు కెప్టెన్ గంగూలికి కూడా ఎంతో సంతోషాన్ని అందించింది.


Also Read: Gukesh: ఆటలో ఓటమి.. గుక్కపెట్టి ఏడ్చేసిన గుకేశ్

2002 ఛాంపియన్స్ ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా నాట్ వెస్ట్ ట్రై సిరీస్ లో తెలపడేందుకు ఇంగ్లాండ్ కి వెళ్ళింది. ఈ సిరీస్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ తో పాటు భారత్, శ్రీలంక జట్లు భాగమయ్యాయి. అయితే ఈ సిరీస్ లో శ్రీలంక కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి ఇంటి ముఖం పట్టింది. దీంతో భారత్ – ఇంగ్లాండ్ జట్లు అద్భుత ప్రదర్శనతో ఫైనల్ కీ చేరాయి. క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ మైదానంలో 2002 జూలై 13న ఈ ఫైనల్ పోరులో భారత్ – ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి.


ఈ ఫైనల్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. ఇక భారత బౌలర్లలో జహీర్ 3 మినహా.. మిగతా బౌలర్లందరూ విఫలమయ్యారు. 326 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ (45), సౌరవ్ గంగూలీ (60) పరుగులకి అవుట్ అయ్యారు. అనంతరం వెంట వెంటనే దినేష్ మొంగియా, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వికెట్లను కోల్పోయింది భారత జట్టు.

146 పరుగుల వద్ద ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. దీంతో టీమ్ ఇండియా ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అదే సమయంలో అసలు కథ మొదలైంది. అప్పుడు క్రీజ్ లోకి అడుగుపెట్టిన యువ క్రికెటర్లు యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ మ్యాచ్ ని మలుపు తిప్పారు. ఈ ఇద్దరు వారి వీరోచిత పోరాటంతో ఓటమి కోరల్లో ఉన్న భారత్ ని విజయం వైపు నడిపించారు. వీరిద్దరూ కలిసి ఆరవ వికెట్ కి 121 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

యువరాజ్ సింగ్ (69) పరుగులు చేసి అవుట్ అవ్వగా.. మహమ్మద్ కైఫ్ (87*), ఆఖరిలో జహీర్ ఖాన్ విన్నింగ్ రన్స్ కొట్టడంతో మైదానం విజిల్స్, కేరింతలు, చప్పట్లతో దద్దరిల్లింది. అయితే ఆ సమయంలో జరిగిన ఓ సంఘటనని తాజాగా బయటపెట్టారు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల. తన యూట్యూబ్ షో “టిఆర్ఎస్” లో రన్వీర్ అల్లా బాడియాతో మాట్లాడుతూ.. తాను అప్పుడు భారత జట్టు మేనేజర్ గా ఉన్నానని తెలిపాడు. ఆ సమయంలో తాము ఓడిపోబోతున్నామని అనుకొని తన బీపీని కంట్రోల్ చేసుకునేందుకు మాత్ర వేసుకున్నానని అన్నాడు.

కానీ యువరాజ్ సింగ్, మహమ్మద్ కైఫ్ హీరోచిత ఇన్నింగ్స్ తో భారత్ విజయానికి చేరుగలో ఉండగా.. కెప్టెన్ గంగూలి జట్టు మొత్తం షర్టులు విప్పి సంబరాలు చేసుకోవాలని చెప్పాడని శుక్లా గుర్తు చేసుకున్నారు. అయితే గంగూలీ షర్టులు విప్పి సంబరాలు జరుపుకోవాలని కోరడాన్ని సచిన్ టెండూల్కర్ వ్యతిరేకించాడని తెలిపారు. క్రికెట్ జెంటిల్మెన్ గేమ్ అని సచిన్ అన్నాడని తెలిపారు రాజీవ్ శుక్ల. అయితే మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఒక్కడే తన షర్ట్ విప్పి గాల్లోకి తిప్పుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.

Also Read: Yuvraj Singh: అదిరిపోయే శుభవార్త చెప్పిన యూవీ..రీ-ఎంట్రీపై ప్రకటన!

అయితే గంగూలి ఇలా చేయడం వెనుక కూడా కారణం లేకపోలేదు. అదే 2002 సంవత్సరంలో ముంబై వాంఖడే వేదికగా భారత్ తో జరిగిన 6వ వన్డే మ్యాచ్ లో టీమిండియా పై ఐదు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఆండ్రూ ఫ్లింటాప్ తన అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే అప్పుడు మ్యాచ్ గెలిచిన సమయంలో ఫ్లింటాప్ తన షర్ట్ విప్పి సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇది మన బెంగాల్ టైగర్ కి నచ్చలేదు. ఇక దీనికి కౌంటర్ ఇవ్వాలని ఆరోజే ఫిక్స్ అయిన దాదా.. వారి సొంత గడ్డపైనే వారికి అదిరిపోయేలా సమాధానం చెప్పాడు. ఈ విషయాన్ని గంగూలి కూడా చాలాసార్లు స్వయంగా వెల్లడించాడు.

Related News

T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ షెడ్యూల్‌, వేదిక‌లు ఖ‌రారు..ఇండియాకు రాబోమంటున్న‌ పాకిస్తాన్ ?

Quinton de Kock : రిటైర్మెంట్ వెన‌క్కి తీసుకుని, రీ-ఎంట్రీ ఇచ్చాడు…సెంచ‌రీతో పాకిస్తాన్ ను చిత్తు చేశాడు

Hong Kong Sixes 2025: నేడు టీమిండియా వ‌ర్సెస్ పాకిస్తాన్ మ‌ధ్య 6 ఓవ‌ర్ల మ్యాచ్‌…షెడ్యూల్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Anushka-Kohli: కోహ్లీ – అనుష్క శర్మ విడాకులు ?సోష‌ల్ మీడియాలో దారుణంగా పోస్టులు

WPL Retention 2026 : రిటైన్ లిస్టు ఇదే..WPL 2026 టోర్న‌మెంట్ షెడ్యూల్ ఇదే..!

IND VS AUS 4th T20I : వాషి యో వాషి..3 వికెట్లు తీసిన వాషింగ్ట‌న్‌, కంగారుల‌పై టీమిండియా విజ‌యం

Kajal Aggarwal: టీమిండియా మ్యాచ్ కు కాజ‌ల్‌..భ‌ర్త‌ను హ‌గ్ చేసుకుని మ‌రీ, ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే

Tata Motors: వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన టీమిండియా ప్లేయ‌ర్ల‌కు టాటా బంప‌ర్ ఆఫ‌ర్‌

Big Stories

×