BigTV English

Mathu Vadalara 2 : ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా..?

Mathu Vadalara 2 : ఇప్పటి వరకు ఎన్ని కోట్ల లాభం వచ్చిందో తెలుసా..?

Mathu Vadalara 2.. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చిరంజీవి పెదమల్లు , హేమలత పెదమల్లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం మత్తు వదలరా 2. మత్తు వదలరా సినిమా సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాకి రితేష్ రానా దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ చిత్రంలో శ్రీ సింహ కోడూరి, సత్య, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా కీలకపాత్రలు పోషించారు. ఇక సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సత్య సగం సినిమాని నడిపించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి ఆయువు పట్టు సత్య నే అని, సత్య వల్లే సినిమా ఆల్మోస్ట్ హిట్ అయిందని, ఆయన కామెడీ బాగా వర్కౌట్ అయిందని కూడా అభిమానులు కామెంట్లు చేశారు. ఇలా భారీగా విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా లాభాల బాట పట్టిందని చెప్పవచ్చు.


11 రోజుల్లోనే భారీ లాభం..

ఇక 11 రోజులు అయినా కూడా బాక్సాఫీస్ వద్ద ఇంకా అదే కలెక్షన్లతో దూసుకుపోతోంది. మరి ఈ సినిమాకు వచ్చిన లాభం ఎంతో ఇప్పుడు చూద్దాం. శ్రీ సింహ కోడూరి నటించిన మత్తు వదలరా 2 సినిమా మధ్యలో కాస్త వెనుకడుగు వేసినప్పటికీ రెండవ వారంలో మళ్లీ పుంజుకుంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా కేవలం రూ .26 లక్షల షేర్ మాత్రమే వసూలు చేసింది. ఇకపోతే పూర్తి కామెడీ స్టోరీ తో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అదిరిపోయే రెస్పాన్స్ లభించడంతో , 11 రోజుల్లో నైజాం ఏరియాలో రూ .5.26 కోట్లు వసూల్ చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా రూ.4.5 కోట్లు రాబట్టి మొత్తం 11 రోజుల్లోనే రూ.9.76 కోట్ల షేర్ , రూ.17.90 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది ఈ సినిమా.


ఎన్ని కోట్ల లాభం అంటే..

Mathu Vadalara 2 : Do you know how many crores of profit has been made so far..?
Mathu Vadalara 2 : Do you know how many crores of profit has been made so far..?

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.1.19 కోట్లు, ఓవర్సీస్ లో రూ .4.08 కోట్లు ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.15.3 కోట్ల షేర్ తో పాటు రూ.30.65 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది ఈ చిత్రం. ఫైనల్ గా ఇప్పటివరకు ఎంత లాభం వచ్చిందనే విషయానికి వస్తే.. ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలను కలిపి రూ .8 కోట్లు బిజినెస్ జరుపుకున్నట్లు ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. అంటే రూ .8.5 కోట్లు షేర్ వస్తేనే ఈ సినిమా హిట్ అయినట్టు. అలాంటిది 11 రోజుల్లోనే రూ.15.03 కోట్ల షేర్ వసూలు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా రూ .6.53 కోట్లు సాధించి లాభాలలో రికార్డు కొట్టింది. మొత్తానికైతే శ్రీ సింహ కోడూరి, సత్య ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా లాభాల బాట పట్టి వారికి మంచి ఇమేజ్ అందించిందని చెప్పవచ్చు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×