BigTV English

Mathu Vadalara 2 OTT : ‘మత్తు వదలరా 2’ ఓటీటీ అప్డేట్… మరో వారం లేట్..!

Mathu Vadalara 2 OTT : ‘మత్తు వదలరా 2’ ఓటీటీ అప్డేట్… మరో వారం లేట్..!

Mathu Vadalara 2 OTT :  ఇటీవల థియేటర్లలోకి వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్న సినిమా ‘ మత్తు వదలరా 2’.. శ్రీ సింహా, సత్య, ఫరియా అబ్దుల్లా ముఖ్య పాత్రల్లో రితేష్ రానా దర్శకత్వంలో రూపొందిన ‘మత్తు వదలరా 2’ సినిమా భారీ విజయం దిశగా దూసుకు పోతుంది. రూ.8 కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో బాక్సాఫీస్‌ వద్దకు వచ్చిన ఈ సినిమా మొదటి నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఇప్పటికే దాదాపు రూ.14 కోట్ల షేర్ ను సాధించింది. బాక్సాఫీస్ వద్ద  పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో దేవర సినిమా వచ్చే వరకు మత్తు వదలరా 2.. ఈ సినిమా కలెక్షన్స్ ఇప్పటికి దూసుకుపోతున్నాయి.. అందుకే ఓటీటీ స్ట్రీమింగ్ ను ఆలస్యంగా చెయ్యనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


గతంలో వచ్చిన మత్తు వదలరా సినిమాకు ఇది సీక్వెల్ గా వచ్చింది. ఈనెల 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీ సింహా సినిమాకు మొదటి రోజునే పాజిటీవ్ టాక్ రావడంతో సినిమాకు ప్లస్ అయ్యింది. నాలుగు రోజుల్లోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌ కలెక్షన్స్ నమోదు అయ్యాయి. మెగాస్టార్‌ చిరంజీవి ఈ సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించారు.ఈ సినిమాకు సత్య కామెడీ హైలెట్ గా నిలిచింది. ఈ సినిమాను చూసిన సినీ స్టార్స్ సినిమా పై ముఖ్యంగా శ్రీ సత్య పై ప్రశంసలు కురిపించారు.

'Mathu Vadalara 2' OTT update... another week late..!
‘Mathu Vadalara 2’ OTT update… another week late..!

ఒక్క మాటలో చెప్పాలంటే బాక్సాఫీస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది.. ఇక ఈ సినిమాకు పోటీగా కొత్త సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. దాంతో ముందుగా అనుకున్న డేట్ కన్నా ఆలస్యంగానే ఓటీటీలోకి రాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. మధ్య కాలంలో థియేటర్ రిలీజ్ తర్వాత నాలుగు వారాలకే ఓటీటీలోకి వస్తున్నాయి. థియేటర్‌ లో చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ నెల 13 న విడుదలైన ఈ మూవీ అక్టోబర్‌ రెండో వారానికి నాలుగు వారాలు పూర్తి చేసుకుంటుంది. కనుక అక్టోబర్‌ 11న ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీ ఓటీటీ హక్కులను భారీ ధరకు ప్రముఖ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఇప్పటివరకు భారీ వసూళ్లను రాబడుతూ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.. ఈ మూవీని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఆకట్టుకుందో చూడాలి.. శ్రీ సింహా ఖాతాలో రెండు హిట్ సినిమాలు పడ్డాయి. ఇక మత్తు వదలరా 3 కూడా ఉందనే టాక్ వినిపిస్తుంది.. ఇక ఇతను తన తర్వాత సినిమాను స్టార్ డైరెక్టర్స్ తో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×