BigTV English
Advertisement

Posani Krishna Murali: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు, అమ్మాయిలు ఒప్పుకోరు.. పోసాని కృష్ణ‌ముర‌ళి కామెంట్స్

Posani Krishna Murali: ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లేదు, అమ్మాయిలు ఒప్పుకోరు.. పోసాని కృష్ణ‌ముర‌ళి కామెంట్స్

Posani Krishna Murali: సినీ పరిశ్రమలో తమకు నచ్చింది చేస్తూ, అన్నింటి గురించి ధైర్యంగా మాట్లాడే వ్యక్తులు కొందరే ఉంటారు. అందులో పోసాని కృష్ణమురళి కూడా ఒకరు. పోసాని మాట్లాడే మాటలకు ఫిల్టర్స్ ఉండవు. అందుకే ఇప్పటికే ఆయన స్టేట్‌మెంట్స్ వల్ల ఎన్నో కాంట్రవర్సీలు క్రియేట్ అయ్యాయి. తాజాగా బిగ్ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పోసాని కృష్ణ‌ముర‌ళి. అందులో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టారు. అసలు సినీ పరిశ్రమ అంటే క్యాస్టింగ్ కౌచ్ అనేది తప్పకుండా ఉంటుందని, దాని వల్ల ఆడవారు ఇబ్బంది పడతారని అందరూ అనుకుంటూ ఉండగా పోసాని మాత్రం వాటికి భిన్నంగా సమాధానమిచ్చారు.


అలా ఒప్పుకోరు

సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అని అడగగా.. క్యాస్టింగ్ కౌచ్ అంటే క్యాస్ట్ ఫీలింగా? లేదా అమ్మాయిల గొడవ? అని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారు పోసాని కృష్ణ‌ముర‌ళి. ‘‘క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అని అడిగితే లేదు అంటాను ఎందుకంటే నేను తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్.. ఇలా అన్నీ చేశాను. అలాగే పెద్ద పెద్ద హీరోలు వస్తారు, ప్రొడ్యూసర్లు వస్తారు, డైరెక్టర్లు వస్తారు. అలాగే అమ్మాయిలు కూడా వస్తారు. నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్లి నాతో గడిపితే నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను అంటే తను ఒప్పుకుంటుందా? చదువుకున్నవారు ఎవరైనా దీనికి సమాధానం చెప్పండి’’ అంటూ చాలా ప్రాక్టికల్‌గా మాట్లాడారు పోసాని కృష్ణ‌ముర‌ళి.


Also Read: ‘గేమ్ ఛేంజర్’ స్కామ్ లో మెహబూబ్… ఎంతకు తెగించార్రా!?

అదంతా ఫ్రెండ్‌షిప్

‘‘ఆడదానికి ఆకర్షించే గుణం ఉంటుంది. మగవాడికి చలించే గుణం ఉంటుంది. అది ప్రకృతి ధర్మం. ఒక అమ్మాయి ఆకర్షించింది, ఒక అమ్మాయి చలించాడు అంటే అక్కడే మ్యాటర్ ముగిసినట్టే. అలాంటిది నీకు అవకాశం ఇస్తాను నాకు కమిట్మెంట్ ఇస్తావా అని అడిగితే ఆ అమ్మాయి ఎలాంటిది అయితే ఒప్పుకుంటుంది? అసలు ఎందుకు ఒప్పుకుంటుంది? సినిమా కోసం ఆడపిల్లలు ఇలాంటివి ఒప్పుకుంటారా? వాళ్లకు ఇష్టమయితే, ఇద్దరికీ ఫ్రెండ్‌షిప్ ఉంటే.. ఆ ఫ్రెండ్‌షిప్‌లో అలా జరిగిపోతుంది’’ అంటూ అసలు క్యాస్టింగ్ కౌచ్ అనేది బలవంతంగా ఎందుకు జరగాలి అన్నట్టుగా కౌంటర్ ఇచ్చారు పోసాని కృష్ణ‌ముర‌ళి.

గుడ్డిగా నమ్మరు

‘‘ఒక అమ్మాయి అంత గుడ్డిగా ఒకరిని ఎలా నమ్ముతుంది? నేను ఈరోజు ఉంటాను, రేపు ఫెయిల్ అయిపోతాను. అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఒక అబ్బాయి నన్ను తన దగ్గర పడుకోమన్నాడు. పడుకుంటే హీరోయిన్ చేస్తా అన్నాడు అని ఒక అమ్మాయి చెప్తుంది. ఒకవేళ అతడు తీసిన సినిమా పోతే.. ఆ అమ్మాయి ఇంకొక చోటికి వెళ్లాలా? అలాంటివి ఏమీ ఉండవు’’ అంటూ వివరించారు పోసాని కృష్ణ‌ముర‌ళి. అంటే ఒక అమ్మాయి.. తన ఇష్టప్రకారమే ఈ మార్గాన్ని ఎంచుకుంటుందని, అంతే కానీ ఎవరూ బలవంతం చేయరని పోసానీ చెప్పకనే చెప్పారు. ఒకవేళ బలవంతం చేసినా ఆ అమ్మాయికి ఒప్పుకోవాల్సిన అవసరం లేదనే అన్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×