E-Paper
Advertisement

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!

Priyamani: ఇప్పటికీ టార్గెట్ చేస్తూ.. నరకం చూపిస్తున్నారు.. హీరోయిన్ ఎమోషనల్..!
Advertisement

Priyamani.. ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా అందరికీ చేరువ అవుతున్న నేపథ్యంలో వారికంటూ స్వేచ్ఛ, స్వతంత్రం లేకుండా పోతున్నాయనే ఒక వాదన తెరపైకి వచ్చింది. ముఖ్యంగా సెలబ్రిటీలు నేరుగా సోషల్ మీడియా ఫ్లాట్ఫారం ద్వారా నెటిజన్స్ తో ముచ్చటిస్తున్న నేపథ్యంలో వారు చేసే వికృతి చేష్టలు వీరిని మరింత ఇబ్బంది పెడుతున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలకు మనశ్శాంతి లేకుండా పోయిందని చెప్పడంలో సందేహం లేదు. సినిమా వేరు.. వ్యక్తిగత జీవితం వేరు.. అయితే ఈ రెండింటిని ముడి పెడుతూ సెలబ్రిటీలను కొంతమంది ఆకతాయిలు ఇబ్బంది పెడుతున్నారు.

ఇప్పటికీ ట్రోలింగ్ తప్పలేదు..

Advertisement

ఇకపోతే ట్రోలింగ్ తోనే కాదు విపరీతంగా విమర్శలు ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నారు కూడా.. తెలుగులో స్టార్ హీరోల దగ్గర నుంచి చిన్న నటుల వరకు ఈ బాధలు తప్పట్లేదు.తాను కూడా చాలా సంవత్సరాలుగా అలాంటి బాధ అనుభవిస్తున్నాను అంటూ ఆ బాధ గురించి బయటపెట్టింది ప్రముఖ హీరోయిన్ ప్రియమణి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి.. తనపై ఎలాంటి ట్రోలింగ్ జరిగింది అనే విషయంపై కామెంట్ చేసింది.

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అర్థం కావడం లేదు…

Advertisement

ప్రియమణి మాట్లాడుతూ.. ముస్తఫా రాజ్ నాకు ఎంతో కాలం నుండి తెలుసు. మా ఇష్టాయిష్టాలు కలవడం వల్లే పెద్దలను ఒప్పించి మేము వివాహం చేసుకున్నాము. అయితే 2016లో మాకు నిశ్చితార్థం జరిగినప్పుడు చాలా మంది మాపై విమర్శలు గుప్పించారు. వేరే మతానికి చెందిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానని ట్రోల్ చేశారు. ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నారు. అయితే కొన్నిసార్లు వాటిని అంతగా పట్టించుకోను. కానీ వాళ్ళ మాటల వల్ల ఒక్కోసారి ఇబ్బంది పడుతూ ఉంటాను.. కుల మతాలకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న స్టార్లు చాలామంది ఉన్నారు కదా.. అయితే ఈ విషయంలో నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు అంటూ ఎమోషనల్ అయింది ప్రియమణి.

ప్రియమణి కెరియర్..

ప్రియమణి విషయానికి వస్తే.. 2003 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమె మధ్యలో కెరియర్ అయిపోయిందని కామెంట్లు చేశారు. అదే సమయంలో ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకొని పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకుంది. ఒకవైపు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తూనే.. మరొకవైపు హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా షారుఖ్ వంటి బాలీవుడ్ హీరోల సినిమాలలో కీలక పాత్రలు పోషిస్తూ.. ఫుల్ బిజీగా మారిన ఈమె ఇంకొక వైపు బుల్లితెర షోలలో జడ్జిగా వ్యవహరిస్తూ అలరిస్తోంది. ఇక తెలుగులో ఎన్టీఆర్ , నాగార్జున వంటి హీరోల సరసన నటించిన ప్రియమణి ఇప్పుడు బుల్లితెర పై పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కెరియర్ సాగిస్తోంది. ఏది ఏమైనా అటు టాలీవుడ్ ఇటు బాలీవుడ్ అంటూ వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ఉన్నత స్థాయికి చేరుకున్న ఈమెకు కూడా ఇలాంటి తిప్పలు తప్ప లేదని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×