BigTV English

White Hair and Stress: ఒత్తిడికి గురికావద్దు జుట్టు ముగ్గుబుట్టలా మారిపోద్ది.. తెల్లబడిన జుట్టును ఇలా నల్లగా మార్చుకోండి

White Hair and Stress: ఒత్తిడికి గురికావద్దు జుట్టు ముగ్గుబుట్టలా మారిపోద్ది.. తెల్లబడిన జుట్టును ఇలా నల్లగా మార్చుకోండి

White Hair and Stress: జుట్టు తెల్లబడడం అనేది ఒకప్పుడు ముసలి వారిలోనే కనిపించేది. ఇప్పుడు చిన్న వయసులోనే వెంట్రుకలు తెల్లగా మారిపోతున్నాయి. ఇలా జుట్టు తెల్లబడడానికి అతిగా ఒత్తిడి పడడం కూడా కారణమని తేల్చింది అధ్యయనం. ఒత్తిడి వల్ల జుట్టు త్వరగా తెల్లబడిపోతుందన్నది వందకి వందశాతం నిజమే అంటోంది సైన్స్. ఒత్తిడిని అదుపులో పెట్టుకుంటే మీ జుట్టు కూడా మళ్లీ నల్లగా మారిపోతుందట.


పాపం రాణి.. ఒత్తిడి ఎంత పనిచేసింది

ఒత్తిడికి తెల్ల జుట్టుకు ఎంతో సంబంధం ఉంది. కానీ దీన్ని నమ్మే వారి సంఖ్య చాలా తక్కువ. ఎక్కువగా ఒత్తిడి బారిన పడేవారు త్వరగా వెంట్రుకలు తెల్లబడేలా చేసుకుంటారు. పూర్వం ఫ్రెంచ్ విప్లవానికి ముందు ఫ్రాన్స్ ను మేరీ అంటోనెట్ అనే రాణి పాలించేది. ఆమెకు తన అంతిమ ఘడియలు సమీపించాయని అర్థమైంది.


ఇక తన పాలన సాగదని, విప్లవం చివరి దశకు వచ్చిందని అర్థం చేసుకుంది. ఆ సమయంలో ఆమె తీవ్రంగా కలవరపడింది. దానివల్ల ఆమె జుట్టంతా పండిపోయిందని చెప్పుకుంటారు. ఆ తర్వాతి రోజే ఆమెకు ఉరిశిక్ష వేసినట్టు చరిత్ర చెబుతోంది. దీన్నిబట్టి అతిగా ఒత్తిడికి గురైతే జుట్టు త్వరగా తెల్లబడుతుందని ఎప్పటినుంచో ఆధారాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు.

అధ్యయనాలూ అవే చెబుతున్నాయ్

కొన్ని అధ్యయనాలు కూడా జుట్టు తెల్లబడడానికి, ఒత్తిడికి మధ్య అనుబంధాన్ని నిరూపించాయి. ఏ వ్యక్తి అయితే తీవ్ర ఒత్తిడిలో ఉంటాడో… అతడి వెంట్రుకలు తెల్లబడుతున్నట్టు, ఆ తెల్ల బడిన వెంట్రుకలు ఒత్తిడి పోతే మళ్ళీ నల్లబడుతున్నట్టు కూడా నిరూపించారు. తీవ్ర ఒత్తిడి వల్ల ఒక వ్యక్తి తెల్ల జుట్టు బారిన పడ్డాడు. అతడికి రెండు వారాలు పాటు ఎలాంటి పని ఇవ్వకుండా విహారయాత్రకు పంపించారు.

Also Read: చేపలు తింటే మొటిమలు రావా? ఇదిగో ఇలా చేస్తే.. అందం మీ సొంతం

ఆ విహార యాత్రలో తినడం, తాగడం పడుకోవడం ఈ మూడు పనులే అప్పచెప్పారు. రెండు వారాల తర్వాత అతని వెంట్రుకలు మళ్లీ నల్లగా మారడం గమనించారు. దీన్ని బట్టి తెల్లబడిన జుట్టు ఒత్తిడిని తగ్గించుకుంటే మళ్ళీ నల్లబడుతున్నట్టు గుర్తించారు.

మొదట్లో గుర్తిస్తేనే.. సాధ్యం

అయితే తెల్ల జుట్టుతో ఉన్న వారందరూ ఒత్తిడిని తగ్గించుకుని నల్ల జుట్టును తెచ్చుకుందామంటే కుదరదు. దీర్ఘకాలం పాటు తెల్ల జుట్టు ఉన్నవారికి ఒత్తిడి తగ్గించుకున్నా కూడా జుట్టు నల్లగా మారే అవకాశం చాలా తక్కువ. వయసుతో పాటు తెల్ల జుట్టు వచ్చిన వారికి నల్ల జుట్టు ఇక రాదు. ఇప్పుడిప్పుడే తీవ్ర ఒత్తిడి బారిన పడి… తెల్ల జుట్టు సమస్యను గుర్తిస్తే మీరు వెంటనే ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఇది మీకు తిరిగి మీ అందమైన నల్లటి జుట్టును తిరిగి ఇచ్చేస్తుంది.

ఒత్తిడే కాదు.. వేరే కారణాలూ ఉన్నాయ్

కేవలం ఒత్తిడి వల్లే కాదు, ఎండలో ఎక్కువ సేపు పని చేసే వారిలో కూడా తెల్ల జుట్టు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఎండలో అధిక సమయం పాటు ఉండడం వల్ల మెలనిన్ అనే హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఎప్పుడైతే మెలనిన్ హార్మోన్ తగ్గుతుందో జుట్టు తెల్లబడడం మొదలవుతుంది. జుట్టులో ఉండే ప్రోటీన్లు నాశనం అయిపోతాయి. వెంట్రుకలు నిర్జీవంగా మారి జుట్టు తెల్లబడడం అనేది మొదలవుతుంది.

ఇలా చేస్తే.. జుట్టు తెల్లబడదు

జుట్టును తెల్లబడకుండా కాపాడుకోవాలనుకుంటే ఎండలో ఎక్కువసేపు ఉండకండి. లేదా ఎండలో పని చేయాల్సి వస్తే తలకి జుట్టు మొత్తం కవర్ అయ్యేలా టోపీలను వాడండి. అలాగే ప్రతిరోజు ఉసిరికాయ రసాన్ని తాగేందుకు ప్రయత్నించండి. ఉల్లిపాయల రసాన్ని తీసి వారానికి రెండుసార్లు జుట్టుకు పట్టించండి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తెల్ల జుట్టు సమస్యను తగ్గించుకోవచ్చు.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×