E-Paper
Advertisement

Mechanic Rocky : విశ్వక్ ను వీడని పోస్ట్ పోన్ గండం… ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ వాయిదా ?

Mechanic Rocky : విశ్వక్ ను వీడని పోస్ట్ పోన్ గండం… ‘మెకానిక్ రాకీ’ రిలీజ్ వాయిదా ?
Advertisement

Mechanic Rocky : టాలీవుడ్ యంగ్ స్టార్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘మెకానిక్ రాకీ’ పోస్ట్ పోన్ కాబోతుందనే వార్త తాజాగా వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ నిజంగానే పోస్ట్ పోన్ అవుతోందా? ఎందుకు సినిమా వాయిదా పడబోతోంది? కొత్త రిలీజ్ డేట్ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

‘మెకానిక్ రాకీ’ రిలీజ్ వాయిదా ?

Advertisement

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘మెకానిక్ రాకీ’. రవితేజ ముళ్ళపూడి ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్లోకి అడుగు పెట్టబోతున్నారు. విశ్వక్ సేన్ కెరీర్ లో పదవ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. హర్షవర్ధన్, వైవా హర్ష, నరేష్ ఇందులో కీలకపాత్రలో పోషిస్తున్నారు. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీని దీపావళి కానుకగా అక్టోబర్ 31న పెద్ద ఎత్తున రిలీజ్ చేయబోతున్నట్టుగా ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పోస్ట్ పోన్ కాబోతోందని తెలుస్తోంది. మేకర్స్ స్వయంగా తాజా పోస్టర్లలో రిలీజ్ డేట్ ను తీసేసి పోస్ట్ పోన్ కాబోతుందని హింట్ ఇచ్చారు. త్వరలోనే ‘మెకానిక్ రాకీ’ మూవీ పోస్ట్ పోన్ అయ్యిందనే విషయాన్ని ప్రకటిస్తూ కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారని టాక్ నడుస్తోంది.

కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు?

Advertisement

‘మెకానిక్ రాకీ’ మూవీని దీపావళికి కానుకగా రిలీజ్ చేయబోతున్నాం అంటూ ఇప్పటికే ప్రమోషన్స్ షురూ చేశారు. అందులో భాగంగా ఈ సినిమా నుంచి ‘గుల్లెడు గుల్లెడు’ అనే పాటను రిలీజ్ చేయగా,  దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ‘మెకానిక్ రాకీ’ మూవీని నవంబర్ 7న రిలీజ్ చేయబోతున్నాం అంటూ త్వరలోనే కొత్త పోస్టర్ ద్వారా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా ఆగాల్సిందే.

మూవీ ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందంటే…

అదే రోజున దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న ‘లక్కీ భాస్కర్’ మూవీ కూడా రిలీజ్ కానుంది. దీంతో రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడింది. అయితే దుల్కర్ సల్మాన్ కు ప్రస్తుతం ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని, సోలాగో వస్తేనే సో బెటర్ అని భావించిన ‘మెకానిక్ రాకీ’ మేకర్స్ మూవీ రిలీజ్ డేట్ వాయిదా వేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.

విశ్వక్ సేన్ కు వాయిదాల గండం…

విశ్వక్ సేన్ హీరోగా నటించిన చాలా సినిమాలు వాయిదా పడుతూ వస్తుండడం గమనార్హం. ఆయన గత సినిమాలు గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు కూడా వాయిదాలు పడ్డాకే రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ‘మెకానిక్ రాకి’ వాయిదా పడబోతోంది అంటూ వస్తున్న వార్తలు ఆయనకు వాయిదాల గండం ఉంది అనే టాక్ ను నిజం చేస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×