BigTV English

Washing Machine Offers : వాషింగ్​ మెషీన్ కొనే ప్లాన్​లో ఉన్నారా? – అమెజాన్​లో ఈ మెషీన్లు ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Washing Machine Offers : వాషింగ్​ మెషీన్ కొనే ప్లాన్​లో ఉన్నారా? – అమెజాన్​లో ఈ మెషీన్లు ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ!

Washing Machine Offers : వాషింగ్‌ మెషిన్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుత కాలంలో ప్రతి ఫ్యామిలీకి ఈ వాషింగ్ మెషీన్ అత్యవసరంగా మారింది. ముఖ్యంగా వాషింగ్ మెషిన్స్ తో మహిళలకు కాస్త పని భారం తగ్గిందనే చెప్పాలి. పైగా నేటి తరంలో మగ వారితో పాటు ఆడవారు కూడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ కుటుంబానికి అండగా నిలుస్తున్నాయి. దీంతో వారికి గతంలో లాగా దుస్తులను చేతితో ఉతికడానికి సమయం లేక వాషింగ్ మెషీన్ వినియోగానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో మగవారు కూడా వాషింగ్​ మెషీన్​లలో దుస్తులు ఉతుకుతూ పనిని పంచుకుంటున్నారు. దీంతో వాషింగ్ మెషీన్ల వినియోగం బాగా పెరిగిపోయింది.


పెరిగిపోతున్న వినియోగాన్నా దృష్టిలో పెట్టుకొని సరికొత్త ఫీచర్లతో టాప్ కంపెనీలు వాషింగ్​ మెషీన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రముఖ కంపెనీల వాషింగ్ మెషీన్లు భారీ డిస్కౌంట్లతో విక్రయానికి వచ్చాయి. ముఖ్యంగా ఫ్రంట్ లోడ్ 7 కేజీల మెషీన్లపై అయితే దాదాపు 32 శాతం వరకూ తగ్గింపును ఇస్తున్నాయి. ఇంకా పలు బ్యాంకు కార్డులతో లావాదేవీలు చేస్తే దాదాపు పది శాతం ఇన్​స్టంట్ తగ్గింపు కూడా దొరుకుతుంది. మరి ప్రస్తుతం అమెజాన్ సేల్​లో అందుబాటులో ఉన్న వాషింగ్ మెషీన్ల, వారి ధర, ప్రత్యేకతలు ఏంటో చూసేయండి.

Samsung 7Kg 5 Star Washing Mechine – ఈ వాషింగ్ మెషీన్​లో 1200 RPM స్పిన్ స్పీడ్ ఫీచర్ ఉంది. దీంతో ఈ మెషీన్ దుస్తులను చాలా వేగంగా ఉతుకుతుంది. డైమండ్ డ్రమ్, ఇన్ బిల్ట్ హీటర్ సహా పలు ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. దుస్తులను శుభ్రంగా ఉతకడానికి, వేగంగా ఆరపెట్టడానికి ఇవి ఉపయోగపడతాయి. ఇందులో దాదాపు 20 రకాల వాష్ ప్రోగ్రామ్​లు ఉన్నాయి. ఈ ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ 30% డిస్కౌంట్​పై దొరుకుతోంది. తద్వారా రూ.33,990కు అందుబాటులో లభిస్తోంది.


Lg 7Kg 5 Star Washing Mechine – ఈ వాషింగ్​ మెషీన్​లో 1200 RPM మోటారు ఉంటుంది. దీని వల్ల మెషీన్ పనితీరు వేగంగా ఉంటుంది. స్టీమ్ వాష్, డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ, మోషన్ డీడీ వాష్, బేబీ కేర్ మెకానిజం వంటి ప్రత్యేకతలు ఇందులో ఉన్నాయి. మెషీన్ ఎటువంటి శబ్దం చేయకుండా, నిశ్శబ్దంగా పని చేస్తుంది. ఇందులో వివిధ రకాల దుస్తులను ఉతకొచ్చు. ఈ ఫ్రండ్ లోడ్ వాషింగ్ మెషీన్​లో పది వాష్ ప్రోగ్రామ్​లు ఉంటాయి. ఈ ఫుల్లీ ఆటోమెటిక్ ఫ్రంట్ డోర్ వాషింగ్ మెషీన్ ధర రూ.29,990గా ఉంది.

ALSO READ : సూపర్ డీల్ బాస్.. ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడూ కొనలేరు.. స్మార్ట్ వాచెస్ పై అదిరిపోయే ఆఫర్స్!

IMF B 7Kg Washing Mechine – ఈ వాషింగ్ మెషీన్​లో ఏడు రకాల వాష్ ప్రోగ్రామ్​లు ఉంటాయి. 2 డీ వాష్, పవర్ స్టీమ్ సైకిల్ ఉండటం వల్ల ఈ మెషీన్​ పనితీరు వేగంగా ఉండడంతో పాటు దుస్తుల నుంచి బ్యాక్టీరియాను పూర్తిగా తొలగిస్తుంది. ఇది ఏఐ పవర్డ్ వాషింగ్ మెషీన్​. ఇది 1000 ఆర్పీఎంతో చాలా వేగంగా పని చేస్తుంది. ఈ వాషింగ్ మెషీన్​పై 22 శాతం తగ్గింపు ఉంది. దీనిని రూ.35,999కి కొనుగోలు చేయొచ్చు.

LG 7Kg Star Washing Mechine – ఈ వాషింగ్ మెషీన్​లో పది రకాల ప్రోగ్రామ్​లు ఉన్నాయి. ఇందులో ఉన్న 6 మోషన్ డీడీ వాష్ ఫీచర్​తో స్క్రబ్బింగ్, టంబ్లింగ్, రోలింగ్ సహా పలు కఠినమైన మరకలను పూర్తిగా తొలిగిస్తుంది. ఇందులో 1200 ఆర్పీఎం మోటారు ఉండటం వల్ల వేగంగా పనిచేస్తుంది. స్టెయిన్ లెస్ స్టీల్​లో తయారు చేసిన డ్రమ్ ఉంటుంది. ఈ ఫుల్లీ ఆటోమెటిక్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ 31 శాతం తగ్గింపుపై అందుబాటులో ఉంది. దీని ధర ప్రస్తుతం రూ.26,990గా ఉంది.

Whirlpool 7Kg 5Star Washing Mechine – దుస్తులపై ఉన్న కఠినమైన మరకలను వంద శాతం శుభ్రం చేయగలడం దీని ప్రత్యేకత. ఇందులో సెన్స్ మూవ్ టెక్నాలజీ ఉంది. 15 వాష్ ప్రోగ్రామ్​లు కూడా ఉన్నాయి. వీటి వల్ల మెషీన్​ పనితీరు వేగంగా, మెరుగ్గా ఉంటుంది. చిన్న, మధ్య తరహా కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్​. ఈ ఇన్వర్టర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రస్తుతం రూ.26,990కు అందుబాటులో ఉంది.

Related News

Vivo T4R 5G vs iQOO Z10R 5G vs OnePlus Nord CE: 5 ఢీ అంటే ఢీ.. ఈ మూడు ఫోన్లలో ఏది బెస్ట్ తెలుసా?

Galaxy A55 vs Xiaomi 14 CIVI vs OnePlus Nord 5: మూడు ఫోన్లలో ఏది బెటర్.. విన్నర్ ఎవరెంటే?

iQOO Z10 Turbo+ 5G: iQOO Z10 టర్బో+ 5G లాంచ్.. ప్రీమియం ఫోన్లకు పోటీనిచ్చే మిడ్ రేంజ్ సూపర్ ఫోన్

Instagram New Feature: అయిపాయే.. ఇన్‌స్టాలో లైక్స్ చేస్తే వాళ్లు కూడా చూసేస్తారా!

Block Spam Calls: స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్‌తో ఈజీగా బ్లాక్ చేయండి

AI Bike Garuda: ముగ్గురు విద్యార్థుల సృష్టి.. దేశంలో ఫస్ట్ ఏఐ బైక్, ఖర్చు ఎంతో తెలుసా?

Big Stories

×