Meenakshi Chaudhary: మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో వెంకటేష్ (Venkatesh) తో కలిసి ‘సంక్రాంతికి వస్తున్నాం’సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన నటనను నిరూపించుకోవడానికి సిద్ధమైనట్లు సమాచారం. అంతేకాదు దాదాపు కన్ఫామ్ అయిపోయిందని, అనౌన్స్మెంట్ చేయడమే తరువాయి అని వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే.. స్త్రీ, మిమీ వంటి హిట్ చిత్రాలను నిర్మించిన దినేష్ విజన్ (Dinesh vision)రూపొందిస్తున్న ఒక ప్రాజెక్టులో మీనాక్షి ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి..
ఇదే విషయంపై మీనాక్షి సన్నిహిత వర్గాలు కూడా స్పందిస్తూ..” దక్షిణాదిలో జోరు చూపిస్తున్న మీనాక్షి కోసం నిర్మాణ సంస్థ ‘మడాక్ ఫిలిమ్స్’ ప్రత్యేకంగా ఒక కథను సిద్ధం చేస్తోంది. ఈ సినిమాల్లో మీనాక్షి పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది ముఖ్యంగా మీనాక్షి స్క్రీన్ ప్రజెంట్స్,నటన సామర్ధ్యాన్ని దృష్టిలో పెట్టుకొని చిత్ర బృందం తనకు సరిగ్గా సరిపోయే హీరోని వెతికే పనిలో పడింది. మరికొన్ని రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు” అంటూ తెలిపారు. మొత్తానికైతే మీనాక్షి కోసమే ఒక ప్రత్యేకమైన కథను రూపొందించి, ఆమెను హిందీలో పరిచయం చేయబోతున్నారు. మరి అక్కడ మీనాక్షి తన టాలెంట్ ను ఎలా నిరూపించుకుంటుందో చూడాలి.
మీనాక్షి చౌదరి కెరియర్..
మీనాక్షి చౌదరి కెరియర్ విషయానికి వస్తే.. మోడల్గా కెరియర్ మొదలుపెట్టి, హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2018 ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. ఇక 2021 లో విడుదలైన ‘ఇచట వాహనములు నిలపరాదు’ సినిమాతో హీరోయిన్గా ఇండస్ట్రీకి అడుగు పెట్టింది. అయితే ఈ సినిమాలో నటించడానికి ముందే 2019లో ‘అప్ స్టార్ట్ లు’ అనే హిందీ సినిమాలో వీర్ స్నేహితురాలిగా నటించినది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక 2022లో ఖిలాడి, హిట్: ది సెకండ్ కేస్ వంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది. లక్కీ భాస్కర్, గోట్, మట్కా, మెకానిక్ రాఖీ, సంక్రాంతికి వస్తున్నాం వంటి సినిమాలలో నటించి ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు చిరంజీవి (Chiranjeevi ) హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో కూడా అవకాశం అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా జూన్లో విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈమె హిందీ సీరియల్ ‘అవుట్ ఆఫ్ లవ్’ లో కూడా నటించింది. ఇక అంతేకాదు పలు సంగీత ఆల్బమ్స్ లో కూడా పాటిస్పేట్ చేసింది మీనాక్షి. ఇక మొత్తానికైతే ఇప్పుడు హీరోయిన్ గా తొలిసారి హిందీ పరిశ్రమ లోకి అడుగు పెట్టబోతున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలని అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. మరి మునుముందు మీనాక్షి బాలీవుడ్ లో కూడా వరుస విజయాలు అందుకొని బిజీ అవ్వాలని కూడా ఆకాంక్షిస్తూ ఉండడం గమనార్హం.
also read:Balakrishna:భారత రత్న ఇచ్చి గౌరవం కాపాడుకోండి.. ప్రభుత్వానికి బాలయ్య అల్టిమేటం..!