Balakrishna: నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna ) సినీ పరిశ్రమకు అందించిన విశేష సేవకుగాను, ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్’ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇకపోతే బాలయ్యకు ఈ గౌరవం లభించడంతో హిందూపురంలో పౌర సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా ఆయనను సన్మానించారు.నిన్న అనగా మే 4వ తేదీన సాయంత్రం హిందూపురంలో జరిగిన ఈ వేడుకకు పలువురు కార్యకర్తలు, అభిమానులు రాజకీయ నాయకులు హాజరై వేడుకను విజయవంతం చేశారు. సన్మాన కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ తన తండ్రికి ‘భారతరత్న అవార్డు’ ఇచ్చి గౌరవం కాపాడుకోవాలి అని తెలిపారు.
మా నాన్నకు భారతరత్న ఇచ్చి తీరాలి – బాలకృష్ణ..
బాలకృష్ణ మాట్లాడుతూ.. “అందరికీ నేను చెప్పేది ఒకటే. నాకు పద్మభూషణ్ ఇచ్చారు సరే, సంతోషం. ఎన్టీ రామారావు గారికి భారతరత్న ఇచ్చినప్పుడే వాళ్లు వాళ్లకు గౌరవం ఇచ్చుకున్నట్లు అవుతుందని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను” అని బాలకృష్ణ తెలిపారు. “మా నాన్న ఎన్టీ రామారావు గారికి భారతరత్న అవార్డు రావడం అనేది ప్రతి తెలుగు వాడి కోరిక. అతి త్వరలోనే రామారావు గారికి భారతరత్న ఇచ్చి తీరాల్సిందే అన్నది కూడా తెలుగు వాడి కోరిక” అంటూ బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ రాజకీయ నేత, నటులు రామారావు కి భారతరత్న అవార్డు రావాలని తెలియజేశారు.
అందుకే భారతరత్న ఇవ్వాలి..
ఎన్టీ రామారావు విషయానికి వస్తే.. తెలుగు సినిమా నటుడిగా, తెలుగుదేశం పార్టీ స్థాపకుడిగా సినీ పరిశ్రమకు, ఇటు రాజకీయ రంగంలో ఎనలేని సేవలు అందించి, మంచి పేరు సొంతం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఈయనను తెలుగువారు అన్నగారు అని అభిమానంతో పిలుచుకుంటారు.ఇక ఈయన తెలుగు, తమిళ్, హిందీ, గుజరాతి భాషలలో కలిపి మొత్తం 303 చిత్రాలలో నటించారు. పలు చిత్రాలను నిర్మించి మరెన్నో చిత్రాలకు దర్శకత్వం కూడా వహించిన పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో వైవిద్య భరితమైన పాత్రలు ఎన్నో పోషించి మెప్పించారు. రాముడు , కృష్ణుడు వంటి పౌరాణిక పాత్రలతో తెలుగువారి హృదయంలో శాశ్వతంగా ఆరాధ్య దైవంగా కూడా నిలిచిపోయారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో ఒక రాజకీయ పార్టీని స్థాపించి, కేవలం 9 నెలల్లోని ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్సేతర పార్టీతో అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించారు. మూడు దఫాలలో ఏడు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసి అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా అప్పట్లో పేరు సంపాదించుకున్నారు. అందుకే ఆయన సేవలను గుర్తించి భారతరత్న ఇవ్వాలని ఆయన వారసుడు, ప్రముఖ సినీ నటులు బాలకృష్ణ కోరారు.
also read:Nandamuri Balakrishna: సరైన టైంలోనే పద్మభూషణ్.. అలాంటి వ్యక్తి ప్రపంచ సినీ ఇండస్ట్రీలోనే లేరు..!