Trivikram Srinivas: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న క్రేజీ కాంబినేషన్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ కూడా ఒకటి. అయితే త్రివిక్రమ్ దర్శకుడుగా వెంకటేష్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. కానీ రైటర్ గా కెరియర్ మొదలు పెట్టిన త్రివిక్రమ్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా అంటే నువ్వు నాకు నచ్చావ్. ఇదే విషయాన్ని ఒక సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా నేను మొదటి పనిచేసిన స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ గారు అని చెప్పుకొచ్చారు. ఆ సినిమా ఇప్పటికీ కూడా త్రివిక్రమ్ అంత బాగా ఎలా రాయగలిగాడు అనిపించేలా ఉంటుంది. ఆ సినిమా తర్వాత వీరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా మల్లీశ్వరి. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. అయితే త్రివిక్రమ్ దర్శకుడు అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ సినిమా చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు. కానీ ఈ ప్రాజెక్టు సెట్ అవలేదు.
వెంకటేష్ తో మల్టీ స్టారర్
త్రివిక్రమ్ శ్రీనివాస్ వెంకటేష్ తో సినిమా చేస్తారని పలు సందర్భాల్లో వార్తలు వచ్చాయి. ఒక సందర్భంలో వెంకటేష్ నాని కలిసి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమాను చేయబోతున్నట్లు వార్తల గట్టిగా వినిపించాయి. అయితే ఎందుకో ఈ ప్రాజెక్టు పట్టా లెక్కలేదు. ఒకవైపు దర్శకుడుగా త్రివిక్రమ్ మరోవైపు నటుడిగా విక్టరీ వెంకటేష్ ఫుల్ బిజీ అయిపోయారు. ఇకపోతే అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కానీ ఈ సినిమాకి ఇంకా టైం పెట్టే అవకాశాలు ఉండడంతో అట్లీతో సినిమా చేసే పనిలో పడిపోయాడు అల్లు అర్జున్. ఇక ప్రస్తుతం వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా చేస్తున్నట్లు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది.
రిలీజ్ అయ్యేది అప్పుడే
త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్ గురించి ఒక ఎంటర్టైన్మెంట్ స్క్రిప్టును రెడీ చేశారట. ఈ స్క్రిప్ట్ విపరీతంగా విక్టరీ వెంకటేష్ కు నచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జూన్ లో మొదలు పెట్టబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల సమాచారం. అలాగే ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్ అంతా థియేటర్ కొచ్చి సినిమా చూడటం అలవాటుగా మారిపోయింది. విక్టరీ వెంకటేష్ కు ఫ్యామిలీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా కొంచెం వర్క్ అవుట్ అయినా కూడా అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. ఈ సినిమా మీద చాలామందికి విపరీతమైన నమ్మకాలు కూడా ఉన్నాయి. దీని గురించి అధికార ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Meenakshi Choudhary: బాలీవుడ్లో లక్కీ ఛాన్స్ కొట్టేసిన మీనాక్షి.. త్వరలో అనౌన్స్మెంట్..!