Meenakshi Chaudhary – Naga Chaitanya :టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకుంది మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary). వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన ఈమె.. తాజాగా నాగచైతన్య (Naga Chaitanya) తో జతకట్టడానికి సిద్ధమయ్యింది. ముఖ్యంగా పూజా హెగ్డే (Pooja Hegde) ను టార్గెట్ చేస్తూ రంగంలోకి దిగబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
పూజా హెగ్డే తో కలిసి నాగచైతన్య సరసన నటించనున్న మీనాక్షి..
ప్రముఖ హీరో నాగచైతన్య ‘తండేల్’ సినిమా షూటింగ్తో బిజీగా ఉన్నారు ఈ సినిమా షూటింగ్ ను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు (Karthik Varma dandu) దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. దీనికి తోడు ఇప్పుడు మీనాక్షి చౌదరి కూడా హీరోయిన్గా నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే నాగచైతన్యతో మీనాక్షి చౌదరి మొదటిసారి నటిస్తోంది. ఈ కాంబో ఫ్రెష్ గా ఉంటుందని చిత్ర బృందం కూడా భావిస్తోందట. ఇకపోతే ఇందులో పూజా హెగ్డే కూడా నటిస్తూ ఉండడంతో ఈమె సీనియర్ హీరోయిన్ ని డామినేట్ చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మీనాక్షి..
ఇకపోతే మీనాక్షి చౌదరి ఈ ఏడాదంతా కూడా చాలా బిజీ బిజీగా గడుపుతోంది. సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో మొదలైన ఈమె జర్నీ, ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్రలో నటించింది. మహేష్ బాబు(Mahesh Babu)కి మరదలుగా నటించి సర్దుకుపోయింది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. అలాగే మొన్న వరుణ్ తేజ్(Varun Tej) ‘మట్కా’ సినిమాతో వచ్చింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. దీనికి తోడు 2025 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇలా వరుస సినిమాలతో బిజీగా మారిన ఈమె టాలీవుడ్ లో మోస్ట్ బిజియెస్ట్ హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ఇప్పుడు ఈమె ఖాతాలోకి నాగచైతన్య సినిమా కూడా చేరిపోయిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాలు తెలియాలి అంటే చిత్ర బృందం నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే.
నాగచైతన్య కెరియర్..
నాగచైతన్య విషయానికి వస్తే.. సమంత నుంచి విడిపోయిన మరుసటి ఏడాది ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ (Shobhita dhulipala) తో ప్రేమలో పడ్డారు. దాదాపు రెండు మూడేళ్లుగా డేటింగ్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాది ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకొని, అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక ఇప్పుడు ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతుంది. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేసి వీరి వివాహం జరిపించడానికి నాగార్జున సిద్ధమైనట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. నాగచైతన్య శోభిత నిశ్చితార్థం జరిగిన తర్వాత వీరిద్దరికీ పెళ్లి జరిగితే , మళ్లీ విడాకులు ఖాయమని వేణుస్వామి (Venuswamy) చెప్పిన విషయం తెలిసిందే. దీనికి తోడు ఇటీవల పెళ్లి ముహూర్తాలు చూసే సమయంలో ఒక పండితుడు కూడా ఇదే విషయాన్ని చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలకు చెక్ పెడుతూ వీరి పెళ్లి కార్డు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇక అన్ని నిజాలు తెలియాలి అంటే అక్కినేని కుటుంబం వీటిపై స్పందించాల్సిందే.