Meenakshi Choudhary:మీనాక్షి చౌదరి (Meenakshi Chaudary) ప్రస్తుతం సౌత్లో మోస్ట్ సెన్సేషనల్ బ్యూటీ అయిపోయింది. ఎప్పుడైతే లక్కీ భాస్కర్ (Lucky Bhaskar), సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) వంటి రెండు సినిమాలతో హిట్ కొట్టిందో.. అప్పటి నుండి ఈ హీరోయిన్ పేరు టాలీవుడ్ లో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. ఏ కొత్త సినిమాకి అయినా ముందుగా మీనాక్షి చౌదరినే తీసుకుందాం అనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారంటే.. మీనాక్షి చౌదరి క్రేజ్ సౌత్ లో ఏ విధంగా ఉందో చెప్పుకోనక్కర్లేదు. అయితే అలాంటి మీనాక్షి చౌదరి ఈ ఏడాది మొదట్లోనే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో 3,4 సినిమాలు ఉన్నాయి. అయితే అలాంటి ఈ హీరోయిన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. “ఆఫర్ల కోసం అలాంటి పని చేయకండి” అంటూ మీనాక్షి చౌదరి మాట్లాడిన మాటలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. మరి ఇంతకీ మీనాక్షి చౌదరి ఏం మాట్లాడింది? అనేది ఇప్పుడు చూద్దాం..
అలా చేస్తే జీవితంపై దెబ్బ పడుతుంది..
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా రాణించాలని ఎంతోమంది యువతులు కలలు కంటూ ఉంటారు. కానీ అలా ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లు ఇండస్ట్రీలో కొంతమంది కోరిక తీర్చలేక, ఆశలను వదులుకొని ఇండస్ట్రీ నుండి వెళ్ళిపోతారు. మరి కొంత మంది ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించాలని వారికి లొంగిపోతారు. కానీ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చి అలా లొంగిపోయే వారికి మీనాక్షి చౌదరి కొన్ని సలహాలు ఇచ్చింది. అవేంటంటే..”ఇండస్ట్రీకి వచ్చిన ఎవరైనా సరే.. ఆఫర్ల కోసం ఎవరి దగ్గర లొంగిపోకండి. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎన్నో మార్పులు జరిగాయి. గతంలో ఉన్న పరిస్థితులు లేవు.అలాగే ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలనుకునేవాళ్లు మీ వ్యక్తిత్వాన్ని అలాగే ఉండనివ్వండి. ఆఫర్ల కోసం ఎక్కడా లొంగిపోకండి. మీ ఒరిజినాలిటీని కాపాడుకోండి. ఇండస్ట్రీలో ఎలాగైనా ఎదగాలని మీ మానవత్వాన్ని కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఉండండి.. అవకాశాల కోసం పరిస్థితులకు అనుగుణంగా మీ వ్యక్తిత్వాన్ని మార్చుకుంటే కొద్దిరోజులయ్యాక మీ వ్యక్తిత్వం పై దెబ్బ పడుతుంది”.
వ్యక్తిత్వాన్ని కోల్పోకండి..
“ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగాలంటే.. మీ వ్యక్తిత్వాన్ని చంపుకోకుండా టాలెంట్ తో ముందుకు వెళ్ళండి. ఇక ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే హీరోయిన్లు అనగానే వారిపై ఎన్నో రకాల అభిప్రాయాలు ఉంటాయి. వారి అభిప్రాయాలకు, అంచనాలకు తగ్గట్టుగా మన వ్యక్తిత్వం ఉండాలి. మనం దేనికోసమైతే ఇండస్ట్రీకి వచ్చామో దాన్నే బలంగా నమ్మాలి. మన లక్ష్యాన్ని వదిలి పెట్టుకోకూడదు. అందుకే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా రావాలనుకునే యువతులు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సౌత్ ఇండస్ట్రీలోకి హీరోయిన్స్ గా వచ్చేవాళ్లు లావుగా ఉంటారనే అపోహ చాలా మందిలో ఉంది. కానీ ఆ అపోహను పోగొట్టి వారి అభిప్రాయాలు మార్చేయాలి. ఇక గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా వెళ్లాలంటే కొన్ని కండిషన్లు ఉండేవి. కానీ ఇప్పుడు అలాంటివేవీ లేవు” అంటూ ఇండస్ట్రీ లోకి వచ్చే యువతలకు ఎంతో మంచి సలహాలు ఇచ్చింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చెప్పిన మాటలు చాలామందికి ఇన్స్పైరింగ్ గా ఉన్నాయి.