Meenakshi Choudhary:ప్రముఖ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె.. ఈ సంక్రాంతికి ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. జనవరి 14న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో భారీ వసూళ్ళను సొంతం చేసుకుంటోంది. అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించగా.. వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), ఆయన లవర్ పాత్రలో మీనాక్షి చౌదరి నటించి ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఇద్దరూ కూడా ఎవరికి వారు తమ నటనతో ప్రేక్షకులను మెప్పించారు .చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా విపరీతంగా నచ్చింది దీంతో మీనాక్షి చౌదరి గ్రాఫ్ కూడా బాగా పెరిగిపోయింది.
కాబోయే వాడికి అలాంటి లక్షణాలు ఉండాలంటూ మీనాక్షి..
ఇటీవల ఈ సినిమా సక్సెస్ లో భాగంగా చిత్ర బృందం వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి తన పెళ్లి, కాబోయే భర్త ఎలా ఉండాలో చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. మీనాక్షి మాట్లాడుతూ..” నాకు కాబోయే వాడు మంచి హైట్ ఉండడంతో పాటు బాగా తెలివైనవాడు, మంచి మనసున్నోడు అయి ఉండాలి. ఒక మగాడిలో నాకు కావాల్సిన అంశాలు ఇవి.. నాకు నాలాంటి రూపానికి తగిన ఒక అబ్బాయి కావాలి. నాతో సమానంగా మేల్ వెర్షన్ ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి దొరికితే వెంటనే పెళ్లి చేసుకుంటాను అంటూ మీనాక్షి కూడా చెప్పుకొచ్చింది. మరి మీనాక్షి పెళ్లిపై, కాబోయే భర్త పై భారీగానే ఆశలు పెట్టుకుంది. మరి ఇలాంటి లక్షణాలు ఉన్న అబ్బాయి మీనాక్షికి దొరుకుతాడో లేదో చూడాలి.
ఫ్యామిలీతో దుబాయ్ కి ట్రిప్ వెళ్లిన మీనాక్షి..
ప్రస్తుతం మీనాక్షి చౌదరి ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సక్సెస్ సాధించడంతో తన కుటుంబంతో కలిసి దుబాయ్ కి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడే వీధుల్లో తిరుగుతూ.. ఎడారుల్లో సందడి చేస్తూ.. రెస్టారెంట్లలో తనకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ ఎంజాయ్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఏది ఏమైనా మీనాక్షి చౌదరి పెళ్లిపై చేసిన కామెంట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయని చెప్పవచ్చు.
మీనాక్షి చౌదరి కెరియర్..
మీనాక్షి చౌదరి కెరియర్ విషయానికి వస్తే.. మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఈమె, ఆ తర్వాత 2018లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్ గా నిలిచింది. 2021లో వచ్చిన ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది మీనాక్షి . 1996 మార్చి 5న పంచ్ కుల హర్యానాలో జన్మించిన మీనాక్షి చౌదరి.. పంజాబ్ లోని నేషనల్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లో డెంటల్ సర్జరీ కోర్సు పూర్తి చేసింది. 2019లో అప్ స్టార్ట్ లు అని హిందీ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో చేసిన ఈమె ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చిరంజీవి(Chiranjeevi) హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది.