Apprentice Jobs: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 800 అప్రెంటీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అప్లికేషన్ ప్రక్రియ షురూ అయ్యింది.
ఐటీఐ, గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. ఐటీఐ, డిగ్రీ పూర్తి చేసి ఇంటి దగ్గరే ఖాళీగా ఉన్నగా అభ్యర్థులకు ఇంది మంచి అవకాశం. వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులు ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవదు. సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్‌లో అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అప్లికేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఫిబ్రవరి 10 లోగా దరఖాస్తుకు గడువు ముగియనుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 800
దరఖాస్తు చేసుకునేందుకు ప్రారంభ తేది: 2025 జనవరి 27
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 10
వయస్సు: అప్రెంటీస్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు 18 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. ఇది ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఉద్యోగాన్ని బట్టి ఐటీఐ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
ఇందులో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
మైనింగ్ ఇంజినీరింగ్ ఇన్ గ్రాడ్యుయేట, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స్ గ్రాడ్యుయేట్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, బ్యాచులర్ ఆఫ్ కామర్స్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్, మైనింగ్ ఇంజినీరింగ్, మైనింగ్ సేయింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ ఇంజినీర్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజినీర్ టెక్నీషియన్, సివిల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు వారీగా ఖాళీలు:
మైనింగ్ ఇంజినీర్ ఇన్ గ్రాడ్యుయేట్- 50
అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స గ్రాడ్యుయేట్- 30
బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్- 300
బ్యాచులర్ ఆఫ్ కామర్స్- 110
బ్యాచులర్ ఆఫ్ సైన్స్-100
మైనింగ్ సేయింగ్ టెక్నీషియన్ -20
ఎలక్ట్రికల్ ఇంజినీర్ టెక్నీషియన్ – 20
మెకానికల్ ఇంజినీర్ టెక్నీషియన్ – 20
సివిల్ ఇంజినీరింగ్ టెక్నీషియన్- 20
పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://secl-cil.in/index.php
ముఖ్యమైనవి:
మొత్తం అప్రెంటీస్ పోస్టుల సంఖ్య: 800
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జనవరి 27
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 10
కనిష్ట వయస్సు: 18 ఏళ్లు
గరిష్ట వయస్సు: 27 ఏళ్లు
Also Read: Agniveer Vayu Jobs: అగ్నివీర్ వాయు ఉద్యోగాలు.. ట్రైనింగ్‌లోని రూ.40,000 జీతం.. రేపే లాస్ట్ డేట్
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఐటీఐ, గుర్తింపు పొందిన యూనిర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినవారికి ఇది మంచి అవకాశం. ఇలాంటి అవకాశం మళ్లీ మళ్లీరాదు. అప్రెంటీస్ పోస్టులు కూడా భారీ సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థి సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లోని పోస్టులకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 10తో అప్రెంటిస్ ఉద్యోగాని గడువు ముగియనుంది.