BigTV English
Advertisement

Kidney Racket Case: కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఆరునెలల్లోనే వంద కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు

Kidney Racket Case: కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఆరునెలల్లోనే వంద కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు

Kidney Racket Case: హైదరాబాద్ సరూర్ నగర్ లోని అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ గుట్టు బట్టబయలైంది. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై రేవంత్ సర్కార్ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో నిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇటీవల కమిటీని నియమించింది. ఉస్మానియా హాస్పిటల్ మాజీ సూపరింటెండెంట్ నాగేందర్ నేతృత్వంలో నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్ లతో పాటు ఈ కమిటీని నియమించారు ఆరోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ. ఈ క్రమంలో కిడ్నీ రాకెట్ వ్యవహారంపై అలకనంద ఆస్పత్రికి కమిటీ వెళ్లింది. కానీ హాస్పిటల్ సీజ్ చేసి ఉండడంతో కమిటీ సభ్యులు గాంధీ ఆస్పత్రికి బయలుదేరి వెళ్లారు.


సామాన్య కష్టాలను క్యాష్ చేసుకుంటూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న కిడ్నీ గ్యాంగ్ గుట్టురట్టు అవుతోంది. దర్యాప్తు చేసే కొద్ది సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అడ్డగోలుగా ఆస్పత్రిలో నిర్వహిస్తూ.. ఇష్టానుసారంగా కిడ్నీమార్పిడి చేసినట్లు తేలడం ప్రకంపనలు రేపుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ సరూర్ నగర్ అలకనంద ఆస్పత్రిలో.. తీగ లాగుతూ కీలక విషయాలు రాబడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే సుమంత్, ఇవినాష్‌తో పాటు పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.

తాజాగా సరూర్‌నగర్‌ అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్‌ కేసులో.. దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ రాజశేఖర్‌ను రాచకొండ పోలీసులు చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు. విశాఖపట్నంకు చెందిన రాజశేఖర్‌ను చెన్నై నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ కేసులో 9మందిని పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నీ మార్పిడి రాకెట్‌ తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో ముడిపడి ఉండటంతో కేసు కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో కిడ్నీలు దానం చేసిన ఇద్దరు, గ్రహీతలు ఇద్దరు గాంధీ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.


సంచలనంగా మారిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 10 ఏళ్ల నుంచి 150 వరకూ కిడ్నీ సర్జరీలను డాక్టర్ రాజశేఖర్ పెరుమాళ్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఆరునెలల్లో వంద కిడ్నీ మార్పిడీలు చేసినట్లు గుర్తించారు. గతంలో వైజాగ్‌కు చెందిన డాక్టర్‌ రాజశేఖర్‌ ను అరెస్ట్ చేశారు. కిడ్నీ ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌లో 3 ఆసుపత్రులు నిర్వహించారు. సైదాబాద్‌లోని జనని ఆసుపత్రిలో 60 కిడ్నీ సర్జరీలు, అరుణ ఆసుపత్రిలో 6, నెలరోజుల్లో అలకనంద ఆసుపత్రిలో 20 కిడ్నీ మార్పిడి సర్జరీలు జరిగినట్లు గుర్తించారు. ఆపరేషన్ చేస్తున్న సమయంలో ముగ్గురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

Also Read: మీర్‌పేట్ హత్య కేసులో అసలు నిజం.. దిండుపెట్టి అదిమి చంపేశాడు… ముగిసిన పోలీసు దర్యాప్తు..

దాత, గ్రహీత, వైద్యుడు.. ఎవరికెవరూ తెలియదని.. అక్రమ దందా వ్యవహారాలన్నీ వాట్సాప్ ద్వారానే జరిగినట్లు తెలుస్తోంది. కేసులో కీలక సూత్రధారిగా ఉన్న పవన్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ రాకెట్ ద్వారా 50 కోట్లకు పైగా నిందితులు కొల్లగొట్టినట్లు తెలుస్తోంది. అలకనంద ఆసుపత్రిలో ఒక్కో కిడ్నీ మార్పిడి కోసం..సుమంత్.. లక్షన్నర కమిషన్ తీసుకున్నట్లు విచారణలో తేలింది. మరోవైపు…గ్రహీతల నుంచి 50 నుంచి 60 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

Related News

HYDRAA: ఇది కదా హైడ్రా అంటే.. రూ.వేల కోట్ల విలువైన భూముల గుర్తింపు.. భాగ్యనగర వాసులు హర్షం వ్యక్తం

Mahesh Kumar Goud: బీజేపీ ఎక్కడ పోటీ చేసినా.. అక్కడ ఓట్ చోరీ పక్కా..

Bandi Sanjay: ఆలయాలు కూల్చేస్తారా? 48 గంటలు టైం ఇస్తున్నా.. బండి సంజయ్ సంచలనం

Revanth Reddy Birthday: అభిమాని బర్త్ డే గిఫ్ట్.. ట్యాంక్ బండ్ పై సీఎం రేవంత్ సైకత శిల్పం

Komatireddy Venkat Reddy: హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 8 లైన్లకు విస్తరణ: మంత్రి కోమటిరెడ్డి

Hyderabad: శంషాబాద్‌‌లో విమానాల రాకపోకలు ఆలస్యం.. 200 మంది ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు

Flying Squad Raids: కాంగ్రెస్ నేత ఇంట్లో భారీగా నగదు..? జూబ్లీ హిల్స్‌లో ఈసీ రైడ్స్

CM Revanth Reddy: సీఎం రేవంత్ పుట్టినరోజు.. PM నుండి CM వరకు శుభాకాంక్షలు

Big Stories

×