BigTV English

Pushpa2 : ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్? ఆడికి.. ఆడి కొడుక్కి.. ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్, ఎవరికి ఈ కౌంటర్?

Pushpa2 : ఎవడ్రా బాస్ ఎవడికి రా బాస్? ఆడికి.. ఆడి కొడుక్కి.. ఆడి తమ్ముడికి కూడా నేనె బాస్, ఎవరికి ఈ కౌంటర్?

Pushpa2 : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 పేరే వినిపిస్తుంది. గత మూడేండ్లుగా ఊరిస్తున్న పుష్ప-2 ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చింది. ఎన్నో అంచనాల నడుమ, ఎన్నో అడ్డంకులను దాటుకుని పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా పుష్ప పార్ట్ 1కు సీక్వెల్ గా వచ్చింది. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్-రష్మిక హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ తో నిర్మించింది. మొదటి పార్ట్ భారీ హిట్ కావడంతో ఈ సినిమాపై కూడా విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.. ఈ సినిమాకు ప్రస్తుతానికి అయితే మంచి టాక్ వినిపిస్తుంది. కొన్ని మైనస్ లు ఉన్నా కొన్ని చోట్ల కవర్ చేసారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ మూవీలోని కొన్ని డైలాగులు చర్చనీయంశంగా మారాయి. అంతే కాదు మెగా ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారని తెలుస్తుంది. ఆ డైలాగులు ఏంటో ఓ లుక్ వేద్దాం పదండీ..


ఈ మూవీలో బన్నీ మరోసారి నట విశ్వరూపం రూపం చూపించాడు. పవర్ ఫుల్ డైలాగులతో సినిమా మొత్తం వన్ మ్యాన్ షోగా మార్చేసాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో ఓ సందర్బంలో ఓ సందర్భంలో ‘ఎవడ్రా బాస్, ఎవడికి రా బాస్.. ఆడికి, ఆడి కొడుక్కి, ఆడి తమ్ముడికి కూడా నేనే బాస్..’ అనే డైలాగు చెప్తాడు. ఇది అందరికి తెలిసిన విషయమే.. బాస్ కొడుకు ఎవరు, బాస్ తమ్ముడు ఎవరో కూడా టాలీవుడ్ జనాలకు తెలుసు.. అంతేకాదు ‘పావలా పర్సెంట్ వాటా గాడివి ఏంటి రా నీ మాట వినేది’, ‘పావలా లేకున్నా పౌరుషం ఎక్కువ వెధవకి..’ వంటి డైలాగ్స్‌పైన కూడా ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ని కొందరు యాంటీ ఫ్యాన్స్‌ ఈ విధంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఈ డైలాగులు సుకుమార్ చేత అల్లు అర్జున్ కావాలనే పెట్టించాడనే సినిమా చూసిన జనాలు అనుకుంటున్నారు.

అలాగే ‘రేయ్ నువ్వు ఇట్టాగే వాగినవో అనంతపురం తీసుకుండపోయి గుండు గీకిస్తా’ అనే డైలాగ్ కూడా మెగా ఫ్యాన్స్‌కి కోపం తెప్పిస్తోంది. కొన్నేళ్ల క్రితం పరిటాల శ్రీరామ్, పవన్ కళ్యాణ్‌ మధ్య జరిగిన ఓ ఘటన గురించి ఇప్పటికీ రకరకాల కథనాలు వినిపిస్తాయి.. అసలు సందర్బంకు తగ్గట్లు పెట్టారా? లేక టార్గెట్ చేస్తున్నారా? అనేది పక్కనబెడితే ఈ డైలాగ్ మాత్రం ఆ ఘటనను గుర్తు చేసేందుకే పెట్టినట్టుగా ఉందని మెగా ఫ్యాన్స్ చెబుతున్నారు.. పుష్ప 2 డైలాగుల పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ కామెంట్స్ చెయ్యడం గమనార్హం.. మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్ మధ్య గొడవలు… నిజమే అయినా వాళ్లు కలిసిపోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ డైలాగులతో బన్నీ మీద పగబట్టేశారు.. ఇదే ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఇక డైలాగ్స్‌పై మెగా ఫ్యామిలీ స్పందించదు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం తీవ్రంగా తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ‘పుష్ప 2’ మూవీని తొక్కడానికి మరిన్ని ప్రయత్నాలు చేయడం ఖాయం. ఇప్పటికే కొంతమంది మెగా ఫ్యాన్స్, ‘పుష్ప 2’ మూవీని సోషల్ మీడియాలో లైవ్ పెట్టేశారని తెలుస్తుంది. ఎంత మంది ఏదైనా పుష్ప గాడి రికార్డులు అయితే ఆపలేవని తెలుస్తుంది. మొదటి రోజే 260 కోట్ల కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. చూడాలి మరి 1000 కోట్లా క్రాస్ ను బీట్ చేస్తుందేమో..


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×