E-Paper
Advertisement

Operation Valentine New Release Date: ‘ఆపరేషన్ వాలెంటైన్’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు.. ఈ సారి అయినా హిట్ కొడతాడా..?

Operation Valentine New Release Date: ‘ఆపరేషన్ వాలెంటైన్’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు.. ఈ సారి అయినా హిట్ కొడతాడా..?
Advertisement

Operation Valentine: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కంబ్యాక్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానులను అలరిస్తున్నాడు. వరుణ్ తేజ్‌కు హిట్ పడి చాలా కాలమే అయింది. ఇటీవల ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘గాండీవధారి అర్జున’ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది. ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వరుణ్‌కు నిరాశే మిగిలింది.

దీంతో తన తదుపరి మూవీని ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రేక్షకులకు ఎలాంటి స్టోరీ అయితే కనెక్ట్ అవుతుందో.. అలాంటి కథలనే ఎంచుకుంటున్నాడు. ఇందులో భాగంగా ఇప్పుడు ఓ మూవీ చేస్తున్నాడు. శక్తిప్రతాప్ సింగ్ దర్శకత్వంలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీను దర్శకుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ మూవీ ద్వారా వరుణ్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Advertisement

మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతదేశంలో ఎదుర్కొన్న అతిపెద్ద వైమానిక దాడుల నేపథ్యంలో యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపుదిద్దుకుంటోంది. ఇందులో వరుణ్ తేజ్ ఫైటర్ పైలట్‌గా నటిస్తుండగా.. మానుషి చిల్లర్ రాడార్ ఆఫీసర్‌గా కనిపించనుంది.

ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. వీటికి అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దీంతో ఈసారి అయినా వరుణ్ తేజ్ మంచి హిట్ కొట్టాలని అంతా అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేసినా.. అది వాయిదాలు పడుతూ వచ్చింది.

Advertisement

తాజాగా మరొకసారి కొత్త రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను మార్చి 1న రిలీజ్ చేస్తున్నట్లు తాజాగా తెలిపారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తున్న అభిమానులకు ఇదొక సర్ప్రైజ్ అనే చెప్పాలి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×