Intinti Ramayanam TRP Rating : ఒకప్పుడు సినిమాలు జనాలని బాగా ఎంటర్టైన్ చేసేవి. కానీ ఇటీవల కాలంలో సీరియల్స్ జనాలకి మంచి వినోదాన్ని అందిస్తున్నాయి. ప్రతి సీరియల్ కూడా పోటీపడి మరియు డిఫరెంట్ స్టోరీ తో రావడంతో ఎక్కువ మంది వీటిని చూసి ఎందుకు బాగా ఇంట్రెస్ట్ కనబరుస్తున్నారు. ప్రతిరోజు చూసి సీరియల్స్ కోసం జనాలు క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రసాదం అవుతున్న సీరియల్స్ మంచి టిఆర్పి రేటింగ్ ని కూడా సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి సీరియల్స్లలో ఇంటింటి రామాయణం సీరియల్ కూడా ఒకటి. స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ అక్టోబర్ నెలలోని టిఆర్పి రేటింగ్ అలాగే హైలెట్ ఎపిసోడ్స్ గురించి ఒకసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఇంటింటి రామాయణం సీరియల్ ఒకప్పుడు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సీరియల్ టిఆర్పి రేటింగ్ కాస్త డౌన్ అవ్వడంతో ఎక్కువ మంది సీరియల్ చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీరియల్ అక్టోబర్ నెల హైలెట్ ఎపిసోడ్ విషయానికి వస్తే పల్లవి పిల్లల్ని కిడ్నాప్ చేయించడంతోపాటుగా అనేక నేరాలు చేసింది అని అవని తెలుసుకుంటుంది. అంతేకాదు తన బాగోతని బయట పెట్టాలి అని అనుకుంటుంది మొత్తానికి పల్లవి చేసిన ప్లాన్ లని బయట పెట్టడంతో పల్లవిని కమల్ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాడు. అయితే పల్లవి మాత్రం ఆ ఇంటి మీద అవని మీద కక్ష కట్టి ఏదో ఒకటి చేయాలి అని ఉంటుంది. అయితే మరోసారి అవ్వనీ కూతురు ఆరాధ్యని కిడ్నాప్ చేయాలని అనుకుంటుంది. అయితే అవనికి టెన్షన్ పెట్టడానికి పల్లవి అలా చేస్తుంది. ఇక శ్రీకర్ మంజుల విషయంలో మోసపోయి అందరి చేత తిట్లు తింటాడు. మొత్తానికి పల్లవి అవని పై గెలవడానికి అవని మీద పోలీస్ కేసు కూడా పెడుతుంది. అవని నీ పోలీసులు కొట్టడంతో అందరూ చాలా సీరియస్ అవుతారు కానీ చివరికి మీనాక్షి వల్ల పల్లవి తీసుకుంటుంది.. ఇక మొత్తానికి పల్లవి చేసిన ప్లాన్లు సక్సెస్ అవుతాయి కానీ అవని పల్లవి వల్ల ఇంట్లో వాళ్లకు ఎటువంటి ప్రమాదం రాకుండా చూసుకుంటుంది అక్టోబర్ లోని హైలెట్ ఎపిసోడ్స్ ఇవే.. టిఆర్పి రేటింగ్ కూడా పర్వాలేదు అని అనిపించింది..
ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికి వస్తే.. కమల్ పల్లవి బాగోతాలన్నీ తెలియడంతో తనని నా ఇంటికి ఇంకెప్పుడు తీసుకురాను నా జీవితంలోకి కూడా రానివ్వను అని తనకు విడాకులు ఇవ్వాలి అని అనుకుంటాడు. అయితే విడాకులు నోటీసు పంపిస్తాడు అది చూసి నా పల్లవి అంతా అవని వల్లే జరిగింది అని ఇంటికి వచ్చి నానా రచ్చ చేస్తుంది. అయితే అటు కమల్ జీవితంలోకి మరో కొత్త అమ్మాయి వచ్చేలా కనిపిస్తుంది. ఇక పార్వతీ మాత్రం పల్లవి చెప్పినట్లుగా అవనికి ఏమైనా జరుగుతుందేమో.. అవనీని ఇంకేమైనా చేస్తుందేమో అని కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి ఇకముందు ఎపిసోడ్లలో పల్లవి అవని నేను చంపుతుందా లేదా అన్నది చూడాలి..