E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ప్లాన్ సక్సెస్.. పార్వతికి టెన్షన్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ప్లాన్ సక్సెస్.. పార్వతికి టెన్షన్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode October 29th: ఇక కొత్తగా ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది.. కాకపోతే ఆ ప్లేస్లో బస్సులు రాలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక క్యాబ్ బుక్ చేసుకుంటాను అని చూస్తూ ఉండగా ఆమె తాగుబోతు అన్నయ్య ఏంటి ఎవరితోనో చాట్ చేస్తున్నావా బాయ్ ఫ్రెండ్ ఏమైనా ఉన్నాడా అంటూ అనుమానంగా మాట్లాడతాడు. కానీ దానికి ఆమె మాటకు మాట సమాధానం చెబుతుంది. అయితే అప్పుడే అక్కడికి ఓ ఇద్దరూ కుర్రాళ్ళు వచ్చి ఆమెను అల్లరి చేస్తూ ఉంటాడు. అయితే అక్కడి నుంచి పారిపోయి తనని తాను కాపాడుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తుందో చివరికి కమల్ దగ్గరికి వచ్చి చేరుతుంది.. కమల్ ఆమెను కాపాడి ప్రతిసారి ఇలా ఎవరూ రారు మీకు మీరే కాపాడుకునేలా ఉండాలి అని ఇస్తాడు అంతే ఆ సీను ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.

పార్వతికి టెన్షన్..

పార్వతి అవని అక్కడికి వెళ్ళింది కదా ఏం చేస్తుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ అవని అక్కడికి ఎందుకు వెళ్ళింది అలా వెళ్లకుండా ఉంటే బాగుండేది అని మాట్లాడుతుంది.. అక్షయ కూడా అవని నిజంగానే వెళ్లి తప్పు చేసిందా లేదా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు అవని ఎప్పుడూ ఎవరితో ఎలా మాట్లాడాలో తనకి బాగా తెలుసు అలాంటి అవినీతి ఎందుకు తప్పు చేస్తుంది అని పార్వతి అంటుంది అప్పుడే వచ్చిన శ్రేయ కూడా అవని అక్క ఏ తప్పు చేయదు కానీ ఆ పల్లవి గురించి మనకు తెలుసు కదా మళ్లీ అక్క ఎందుకు అక్కడికి వెళ్ళింది అని అంటుంది. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన అవని ఆ పల్లవికి వార్నింగ్ ఇచ్చి వచ్చాను అని చెప్తుంది. భరత్ మాత్రం కమల్ ని ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటాడు కానీ భానుమతి ఏం చేస్తావు నా మనవడిని చంపేస్తావా అని అంటుంది..

శ్రీకర్ ప్లాన్ సక్సెస్..

Advertisement

శ్రీకర్ మంజుల కోసం వేసిన ప్లాను సక్సెస్ అవుతుంది. అవని చెప్పినట్టుగా తను ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పడంతో అవని ప్లాన్ బాగానే అమలు అవుతుంది. ఆ మంజుల తన మనుషులను పంపించి శ్రీకర్ దగ్గర అడిగిస్తుంది. అయితే నిజంగానే ఇన్సూరెన్స్ ఏజెంటు అనే శ్రీకరుడు నమ్మేలా చెప్పడంతో నిజమే అనుకొని ఎలాగైనా సరే అతనికి ఫోన్ చేసి ఆ రెండు కోట్లు తీసుకోవాలి అని అనుకుంటుంది. ఇక శ్రీకరు తెలివిగా ప్లాన్ చేసి తన పాత నెంబర్ కాకుండా కొత్త నెంబర్ ఇస్తాడు.అదేవిధంగా మంజుల కూడా కొత్త నెంబర్తో ఫోన్ చేస్తుంది. మంజుల గొంతుని గుర్తుపట్టిన శ్రీకర్ తన గొంతు మార్చి మంజులకు అనుమానం రాకుండా ఎలాగైనా రప్పించాలి అని అనుకుంటాడు. మొత్తానికి మంజుల నేను వస్తాను మాట్లాడతాను అని అనడంతో శ్రీకర్ చాలా సంతోషంగా ఉంటాడు.

చక్రధర్ పల్లవికి ఛాన్స్..

చక్రధర్ తన కూతురు ఎంతగా చేసినా కూడా అసలు మారలేదు అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఒకవైపు పల్లవి జీవితం నాశనం అయిపోతుంది అని బాధపడుతూనే మరోవైపు అవని చెప్పిన మాటలు తలుచుకుని ఇంకాస్త బాధ పడిపోతూ ఉంటాడు.. అవని పల్లవికి ఎటువంటి సపోర్టు చేయను అని చెప్పిన విషయం గుర్తు చేసుకుని మందు తాగుతూ ఉంటాడు. అయితే అప్పుడు అక్కడికి వచ్చిన మీనాక్షి ఏంటండి మన పిల్లల పరిస్థితి ఎలా పోతుంది అర్థం కావడం లేదు అని అంటుంది. అయితే పల్లవి మారుతుంది అని నేను నా అనుకోవడం లేదు అని చక్రధారి ఎంతగా అంటున్న సరే మీనాక్షి మాత్రం పల్లవిని మార్చి చూపిస్తాను అని అంటుంది. పల్లవి నేను కాపురానికైతే పంపిస్తావు కానీ తనని మార్చడం నీవల్ల కాదు అని చక్రధర్ అంటాడు అయినా కూడా మీనాక్షి నేను మార్చి చూపిస్తానని అంటుంది.

పార్వతి టెన్షన్..

Advertisement

ఆరాధ్య ఆమ్లెట్ అడిగింది అని అవని తనకి ఆమ్లెట్ వేసిస్తూ తనతో సరదాగా మాట్లాడుతూ ఉంటుంది అయితే అప్పుడే అక్కడికి వచ్చిన పార్వతి ఆరాధ్యును బాబు దగ్గరికి వెళ్ళమని పంపించి అవనితో మాట్లాడుతుంది. ఆ పల్లవి ఎవరెన్ని చెప్పినా కూడా అసలు వినకుండా తన పని ఇంట తను చేసుకొని పోతుంది. తనతో మాట్లాడడం కూడా వేస్తే అని చెబుతుంది పార్వతి. తను మా ఇంటికి వచ్చినప్పుడు ఎంత రచ్చ చేసిందో చూశాం కదా నేను చంపేస్తాను అని అంది అదే నాకు భయంగా ఉంది అని పార్వతి భయపడిపోతూ ఉంటుంది. కానీ అవని మాత్రం పల్లవి అన్నవన్ని చెయ్యదు కదా అత్తయ్య నువ్వేమి కంగారు పడకు అని అంటుంది. కానీ మీ మామయ్య విషయంలో ఇలా చేసిన తర్వాత నాకు ఏది నమ్మాలో కూడా అర్థం కావడం లేదు అని అనగానే.. అక్కడ ఉన్న కమల్ ఆ మాటలు విన్నడేమో అని కంగారు పడిపోతుంది పార్వతి.. కానీ కమల్ చార్జింగ్ అయిపోవడం వల్ల ఏమీ వినిపించలేదు అని అంటాడు దాంతో వాళ్ళు వినలేదు అని అనుకుంటారు.

శ్రీకర్ కు అవని సలహా..

ఈరోజు శ్రేయ శ్రీకర్ ఫోన్ చేయడంతో మాట్లాడుతూ ఉంటుంది.. మంజుల మన ప్లాన్ ప్రకారం దొరికింది కాబట్టి తనని ఎలాగైనా సరే పట్టుకోవాలి ఆ డాక్యుమెంట్స్ ని తీసుకొని వచ్చి తన మరిదికి ఇవ్వాలి అని శ్రీకర్ మాట్లాడుతూ ఉండగా నువ్వు మంచిగానే ప్లాన్ చేశావు నిజంగానే మంజుల దొరుకుతుంది లే అని శ్రీ అంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన అవని శ్రీకర్ కి జాగ్రత్తలు చెప్తుంది. నువ్వు చాలా జాగ్రత్తగా ఆ మంజులని పట్టుకోవాలి అని ప్లాన్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :దేత్తడి హారిక నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

Related News

Brahmamudi Serial Today Episode October 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తీసుకెళ్లిన చలపతి – రెచ్చిపోయిన రేఖ

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు ఇంట బతుకమ్మ సంబరాలు.. వల్లి కన్నీళ్లు.. భద్ర మాస్టర్ ప్లాన్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Podarillu Chakri : అయ్యో పాపం.. చక్రీ ఎంత కష్టపడుతున్నాడో..?

Thursday TV Movies : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

గాజులు గలగల పాట కోసం రాధమ్మ కూతురు ఎంత తీసుకుందో తెలుసా?

హిందూ దేవుళ్ళపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్!

Big Stories

Advertisement
×