BigTV English

Pushpa 2 Movie Release : మెగా సస్పెన్స్… ఈ మెగా మేనల్లుడి ట్విట్టర్‌పై వేయి కళ్లు..

Pushpa 2 Movie Release : మెగా సస్పెన్స్… ఈ మెగా మేనల్లుడి ట్విట్టర్‌పై వేయి కళ్లు..

Allu Arjun – Sai Dharam Tej : టాలీవుడ్ క్రేజీ హీరో అల్లు అర్జున్ – సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ పుష్ప 2.. ఈ సినిమాకు రోజు రోజుకు క్రేజ్ పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రీలీజ్ ఈవెంట్ తో సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 5 న గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమాను థియేటర్లలో చూడాలని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కు థ్యాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ అయ్యింది. ఇక సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ మాత్రం స్పందించలేదు. దీనిపై సస్పెన్స్ నెలకొంది..


పుష్ప 2 పై స్పందించని సాయి ధరమ్ తేజ్.. 

ప్రస్తుతం ఏ ఎక్కడ చూసినా పుష్ప 2 హవానే కనిపిస్తోంది. ప్రతి ఒక్కరు మొన్న రిలీజ్ అయిన ట్రైలర్, నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించే మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప 2: ది రూల్‌’ ట్రైలర్‌ వాటిని అందుకొని మంచి వ్యూస్‌తో రికార్డులు బద్దలు కొడుతోంది. ఒకవైపు ఈ సినిమా ట్రైలర్‌పై సినీ ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘ఇది నిజంగానే వైల్డ్‌ ఫైర్‌’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇక నిన్న జరిగిన ఈవెంట్ కు ఒక్క హీరో కూడా రాక పోవడం పై మెగా హీరోల పై అనేక వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మెగా హీరోలు మౌనంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. అదేంటంటే ఇండస్ట్రీలో రిలీజ్ అయిన ప్రతి సినిమా కు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ చెబుతూ ట్వీట్ చేస్తాడు. మరి పుష్ప 2 మూవీకి చేస్తాడా? చేస్తే ఏమని చేస్తాడు..? గత ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ ను ట్విట్టర్ లో అన్ ఫాలో చేసాడు. ఇప్పటికి ఫాలో అవ్వలేదు. మరి సినిమా రిలీజ్ టైంలో ఫాలో చేసి విష్ చేస్తాడా..? లేదా అన్నది సస్పెన్స్ గా మారింది. ఈ సస్పెన్స్ కు బ్రేక్ పడాలంటే రెండు రోజులు వెయిట్ చెయ్యక తప్పదు.. చూద్దాం ఏం జరుగుతుందో..


పుష్ప 2 మూవీ టిక్కెట్ ధర పెంపు..

ప్రస్తుతం పుష్ప 2 మేనియా కొనసాగుతుంది.. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి రాబోతోంది. మూడేళ్ల తర్వాత అల్లు అర్జున్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. మూవీపై ప్రేక్షకుల్లో అమితాసక్తి నెలకొంది. దాంతో సినిమా టికెట్ల ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి.. ఆరు భాషల్లో.. వరల్డ్‌వైడ్ సుమారు 12,000 స్క్రీన్‌లలో పుష్ప 2ని రిలీజ్ చేయబోతున్నారు. వేరే పెద్ద సినిమా ప్రస్తుతం ఏదీ థియేటర్లలో లేకపోవడంతో.. తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని థియేటర్లలోనూ పుష్ప 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.. ఇక ఈ మూవీ టికెట్ ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. పుష్ప 2 మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మించి ఉండటంతో.. టికెట్ ధరలు పెంచాల్సి వచ్చిందని మూవీ ప్రొడ్యూసర్స్ తరఫు న్యాయవాది హైకోర్టులో చెప్పుకొచ్చారు.. మరి దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×