Pushpa 2 in Prasads IMAX : ప్రస్తుతం పుష్ప 2 మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. డిసెంబర్ 4న బెన్ ఫిట్ షో అంటూ 1239 రూపాయలకు ఒక్క టికెట్ అని చెప్పినా.. టికెట్లు ఫాస్ట్ గా అమ్ముడుపోతున్నాయి. టికెట్ ప్రైజ్ ఇంత ఎక్కువ పెట్టడంతో నిర్మాతలపై దారుణమైన కామెంట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. సాధారణ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సినిమాకు దూరమవుతున్నారు అంటూ నిర్మాతలను బహిరంగానే విమర్శిస్తున్నారు. ఇదే టైంలో డిస్ట్రిబ్యూటర్స్ పై కూడా విమర్శలు వస్తున్నాయి. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీ పుష్ప 2 అనే ఒకే మాట రావడానికి మైత్రి మూవీ మేకర్స్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ చేయరాని పనులు అన్నీ చేస్తున్నారు. అందుకే ఈ విమర్శలు. నిర్మాతల గురించి అందరికీ తెలిసిందే. మరీ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చేస్తున్నారంటే…
పుష్ప 2 మూవీ… సినిమా ప్రమోషన్స్‌లో నిర్మాతలు, హీరో చెబుతున్న మాట ఏంటంటే… ఓ బాహుబలి, ఓ ఆర్ఆర్ఆర్, ఓ పుష్ప 2. అంటే… పుష్ప 2 మూవీకి కూడా ఆ రేంజ్‌లో కలెక్షన్లు రాబోతున్నాయని వాళ్లు అంచనా వేస్తున్నారు. అలాంటి కలెక్షన్లు రావాలంటి… అలాంటి టాక్ కూడా రావాలి. అంతే కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ టాక్ గురించి పక్కన పెట్టి, టికెట్ల రేట్లు దారుణంగా పెంచడం, పర్సంటేజ్‌లను అడ్డగోలుగా పెంచడం చేస్తున్నారు. దీని వల్ల అయినా.. బాహుబలి, ఆర్ఆర్ఆర్ అంతటి కలెక్షన్లు వస్తాయని అనుకుంటున్నారా ఏంటి అని ట్రోల్స్ వస్తున్నాయి… సినిమాలో పుష్ప రాజ్ చెప్పినట్టు ఇక్కడ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ అసలు తగ్గడం లేదు.
నార్మల్ కంటే భారీగా పర్సంటేజ్…?
ఈ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన పర్సంటేజ్‌కి దాదాపు అన్ని థియేటర్స్ ఒప్పుకున్నాయి. పుష్ప 2 మూవీని ప్రదర్శించడానికి డీల్ మాట్లాడుకున్నాయి. కానీ, ప్రసాద్స్ మాత్రం అసలు తగ్గేదే లేదు అంటూ పుష్ప 2 మూవీని తీసుకోవడం లేదు. నార్మల్ కంటే ఎక్కువగా పర్సంటేజ్ అడుగుతున్నారని, అందుకే పుష్ప 2 మూవీని తమ స్క్రీన్ లో ప్రదర్శించడం లేదు అనే వాదన వినిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన పర్సంటేజ్‌కి ఒప్పుకుంటే, థియేటర్స్ నష్టాలు వస్తాయని ట్రెండ్ పండితులు కూడా అంటున్నారు.
ప్రసాద్స్‌లో పుష్ప 2 లేకపోతే…
ప్రసాద్స్ లో సినిమా చూడాలి అనేది చాలా మంది సినీ లవర్స్ కోరిక. ఎన్నో ఏళ్లుగా ప్రసాద్స్ లో సినిమాలు చూసే వాళ్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ప్రసాద్స్ PCX స్క్రీన్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ఈ PCX స్క్రీన్‌లో పుష్ప లాంటి సినిమా చూడాలి అని అనుకునే వాళ్లు ఉన్నారు. కానీ, పర్సంటేజ్ విషయంలో అటు డిస్ట్రిబ్యూటర్స్, ఇటు ప్రసాద్స్ ఎక్కడా తగ్గడం లేదు. దీంతో PCX స్క్రీన్ అందుబాటులో ఉన్న ప్రసాద్స్‌లో పుష్ప 2 మూవీ ఉండదా..? అనే ప్రశ్నలు ఇప్పుడు మూవీ లవర్స్ కలవరపెడుతున్నాయి.