Mega Brothers: మెగా కుటుంబం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులక్రితం ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మం గురించి మాట్లాడిన విషయం తెల్సిందే. అయితే అప్పుడు చాలామంది పవన్ ను ట్రోల్ చేశారు. హైప్ తీచ్చుకోవడానికి, అటెన్షన్ గ్రాబ్ చేయడానికి మాత్రమే మాట్లాడుతున్నారని కామెంట్స్ చేశారు. ఆ సమయంలో మెగా హీరోలు పవన్ కు మద్దతుగా నిలిచారు.
పవన్ కళ్యాణ్ కు చిన్నతనం నుంచి దీక్షలు తీసుకో అలవాటు ఉందని, మెగా ఫ్యామీలీలో పవనే ఎక్కువసార్లు దీక్షలు తీసుకున్న వ్యక్తి అని, ఆ తరువాత చరణ్ అని చెప్పుకొచ్చారు. ప్రతి ఏడాది చరణ్ అయ్యప్ప దీక్షను స్వీకరిస్తాడు. ఇప్పుడు కూడా చరణ్ అయ్యప్ప మాలను ధరించే ఉన్నాడు. ఇక అన్న బాటలోనే తమ్ముడు వరుణ్ తేజ్ కూడా నడవడం మొదలుపెట్టాడు.
Pushpa 2: సుకుమార్ కు ఏమైంది.. భయమా.. భారమా.. ?
తాజాగా వరుణ్ తేజ్.. హనుమాన్ దీక్షను స్వీకరించాడు. నేడు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి అక్కడే దీక్షను చేపట్టాడు. స్వామివారి ఆశీస్సులు అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వరుణ్ తేజ్ కెరీర్ విషయానికొస్తే.. ఏమంత బాలేదనే చెప్పాలి. నాగబాబు కుమారుడుగా ముకుంద అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమయ్యాడు వరుణ్.
మొదటి సినిమాతోనే మెగా ప్రిన్స్ గా అభిమానుల మనస్సులో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వరుణ్.. ఆ తరువాత వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, విజయాలను మాత్రం చాలా తక్కువ అందుకున్నాడు. 2019 లో గద్దలకొండ గణేష్ సినిమాతో విజయాన్ని అందుకున్న వరుణ్.. మళ్ళీ ఇప్పటివరకు మంచి విజయాన్ని అందుకోలేకపోయారు. కథలను విభిన్నంగా ఎంచుకుంటున్నా కూడా ఈ హీరోకు మాత్రం విజయాలు దక్కడం లేదు. ఈ ఏడాది మట్కా అంటూ వచ్చినా.. అది కూడా ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది.
Sankranthiki Vasthunam: గోదారి గట్టు సాంగ్.. రమణ గోగుల వాయిస్ అదిరిపోయిందబ్బా
ఇక గతేడాదినే వరుణ్ ఒక ఇంటివాడు అయ్యాడు. ప్రేమించిన అమ్మాయి, హీరోయిన్ లావణ్యను వివాహమాడాడు. పెళ్లి తరువాత కూడా వరుణ్ కు కలిసిరాలేదు. మొన్నటివరకు వెకేషన్ మోడ్ ఎంజాయ్ చేసిన వరుణ్.. ఇండియాకు తిరిగిరాగానే భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు.
తన కెరీర్ మళ్లీ గాడిన పడాలని ఈ దీక్ష చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వరుణ్ తేజ్ మంచి కథలను వింటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మరో కొత్త కథతో మెగా ప్రిన్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాతోనైనా మెగా హీరో హిట్ కొడతాడేమో చూడాలి.