Mega VS Nandamuri: సోషల్ మీడియా వచ్చాక.. సెలెబ్రిటీల పరువు ఎంత పోవాలో అంతా పోతుంది. స్టేజిమీద నోరు తెరిచి ప్రశాంతంగా మాట్లాడలేకపోతున్నారు. ఇక ఇంకోపక్క ఎప్పుడో జరిగిన, జరిగిపోయినా విషయాలను కూడా తీసుకొచ్చి ట్రోలింగ్ చేయడం ట్రోలర్స్ కు ఒక పెద్ద పని అయిపోయింది. ఆ హీరో ఇలా చేశాడు.. ఈ హీరో అలా మాట్లాడాడు.. వాళ్ళని ఇలా అవమానించారు.. ఇవే చర్చలు రోజు.. సోషల్ మీడియాలో జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా సోషల్ మీడియాలో ఒక గమ్మత్తైన చర్చ జరుగుతుంది. అదే కారణజన్ముడు ఎవరు.. ? అనేది. అసలు దీనికి ఆజ్యం పోసింది ఎవరు.. ? ఎందుకు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అనేది ఎవరికి తెలియదు. సాధరణంగా సోషల్ మీడియాలో అభిమానులు.. తమ హీరో గొప్ప.. తమ హీరో గొప్ప అంటూ యుద్దాలు చేస్తూ ఉంటారు. దానికోసం తమ హీరోకు సంబంధించి వేరే హీరో మాట్లాడిన వీడియోలను షేర్ చేసేటో.. మా హీరో గొప్ప మనసు ఇది అంటూ చెప్పుకొస్తారు.
ఇక అలానే ఒకసారి నటకిరీటి రాజేంద్రప్రసాద్ ఒక పాత ఇంటర్వ్యూలో.. సీనియర్ ఎన్టీఆర్ ఫుడ్ హ్యాబిట్స్ గురించి మాట్లాడాడు. అందులో ఎన్టీఆర్.. సెట్ లో మిరపకాయ బజ్జీలు తినేవాడని, అందరిలా ఒకటి రెండు ప్లేట్ లో పెట్టుకోకుండా.. ఒక బుట్టలో దాదాపు 40, 50 బజ్జీలు పెట్టుకొని పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని లాగించేసేవాడు. ఆయన మాములు మనిషికాదు.. కారణ జన్ముడు అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోను నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఎప్పుడైతే ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో అప్పటినుంచి మొదలయ్యింది ఈ రచ్చ. ఇక ఎన్టీఆర్ తిండి విషయంలో రాజేంద్రప్రసాద్ మాత్రమే కాకుండా టాలీవుడ్ నిర్మాతతో పాటు పాత సీనియర్ ఆర్టిస్టులు మాట్లాడిన అన్ని వీడియోలను తీసుకొచ్చి.. కారణ జన్ముడు అనే ట్యాగ్ క్రియేట్ చేసి రచ్చ చేయడం మొదలుపెట్టారు. సరే నందమూరి ఫ్యాన్స్ ఆ రేంజ్ తమ హీరోను పొగిడితే మేము ఎందుకు ఊరికే ఉండాలి అనుకోని.. మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు.
40 బజ్జీలు ఒక్కడే ఎలా తిన్నారు బ్రో.. 40 బజ్జీలు తింటే కారణ జన్ముడు అయిపోతారా … ? అంటూ ట్రోల్స్ మొదలుపెట్టారు. అంతేనా బజ్జీల ఛాలెంజ్ కూడా పెట్టుకొని ఆ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. మా హీరోనే అంటారా.. ? అంటూ నందమూరి ఫ్యాన్స్.. మెగా ఫ్యాన్స్ కి సెటైర్లు వేయడం స్టార్ట్ చేశారు. చిరంజీవికి జిలేబీలు ఇష్టం అని.. జిలేబీలు తింటావేంట్రా అంటూ ఆయన గతంలో ట్రోల్ చేయబడిన వీడియోలను తీసుకొచ్చి యుద్ధం ప్రకటించారు.
ఇలా బజ్జీలు వర్సెస్ జిలేబీలు అంటూ ట్రెండ్ మొదలయ్యింది. ఫ్యాన్స్ మరీ మితిమీరి హీరోల పర్సనల్ విషయాలను కూడా తీసుకొచ్చి ట్రోల్ చేస్తున్నారు. దీనివలన హీరోల పరువు సోషల్ మీడియాలో దిగజారిపోతోంది. తిండి అనేది వారి పర్సనల్ విషయం. దాన్ని పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ ఖ్యాతి గురించి ఇప్పటి జనరేషన్ వారికి తెలియక.. ఇప్పుడు ఏదో ట్రెండ్ అని ఆయన పేరును ఇలా చెడగొడుతున్నారని సీనియర్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. ఇలా చేయడం వలన హీరోల పరువు పోతుందని, అభిమానుల మధ్య ఈ గొడవలు ఎక్కడివరకు దారితీస్తాయో అని కొందరు భయపడుతున్నారు.
ఇలాంటి వివాదాలు ముదరకుండా రాజకీయ నాయకులు కానీ, హీరోలు కానీ వీటికి ఫుల్ స్టాప్ పెడితే బావుంటుందని, సోషల్ మీడియాలో ట్రోల్స్ అనేవి సరదాగా ఉన్నంతవరకు బాగానే ఉంటాయి కానీ, ఇలా సీరియస్ అయ్యి.. చనిపోయిన హీరో గురించి ఇంత చీప్ గా మాట్లాడడం పద్దతి కాదని చెప్పుకొస్తున్నారు. మరి ఈ బజ్జీలు గొడవ ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.