HBD Prashanth Neel: సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి టాలెంట్ కలిగి అతి తక్కువ సమయంలోనే పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందిన వారిలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఒకరు. ఉగ్రం అనే కన్నడ సినిమా ద్వారా వెళ్లితెరకు పరిచయమైన ప్రశాంత్ అనంతరం కన్నడ సినీ నటుడు యశ్ (Yash)హీరోగా కేజిఎఫ్(KGF) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రశాంత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుది.
పుట్టినరోజు శుభాకాంక్షలు…
ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇప్పటికే కేజిఎఫ్ 2, సలార్ 1 సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను సొంతం చేసుకున్న ప్రశాంత్ ప్రస్తుతం ఎన్టీఆర్(NTR) తో డ్రాగన్ అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇకపోతే నేడు ప్రశాంత్ పుట్టినరోజు (Birthday)వేడుకలను జరుపుకుంటున్న నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఈయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ఈయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.
సొంత గ్రామంలో వ్యవసాయ భూములు..
డైరెక్టర్ ప్రశాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలు, ఆస్తుల వివరాలు, సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ వంటి విషయాల గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రశాంత్ నీల్ ఉమ్మడి అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గం నీలకంఠాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. చిన్నతనం నుంచి ప్రశాంత్ తల్లిదండ్రులు బెంగళూరుకు వెళ్లడంతో అక్కడే స్థిరపడ్డారు. ఇప్పటికీ నీలకంఠాపురంలో వీరికి సంబంధించిన పొలాలు ఆస్తులన్నీ కూడా ఉన్నాయి. తరచూ ఈయన నీలకంఠాపురం వస్తూ వెళ్తుంటారు. ఇక బెంగళూరులో కోట్ల విలువచేసే ఖరీదైన ఇంటితో పాటు ఈయన గ్యారేజ్ లో ఖరీదైన కార్లు ఉన్నాయి.
ప్రశాంత్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు ఈయన సుమారు 100 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. పలు నివేదికల ప్రకారం ప్రశాంత్ నీల్ 2023 లోనే 40 కోట్ల రూపాయల నికర ఆస్తులను కలిగి ఉన్నారని తెలుస్తుంది. అయితే ఇప్పటికీ ఈ ఆస్తులు మరింత రెట్టింపు అయ్యి ఉంటాయని చెప్పాలి. ఇక ఈయనకు భార్య లిఖితారెడ్డి ఒక కుమార్తె, కుమారుడు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఈయన కెరియర్ విషయానికి వస్తే… ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న ప్రశాంత్ ఈ సినిమాలు పూర్తి కాగానే సలార్ 2, కే జి ఎఫ్ 3 వంటి పనులలో బిజీగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా కూడా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.