BigTV English

Megastar New Movie Update : ‘2018’ చిత్ర దర్శకుడితో మెగాస్టార్ సినిమా..

Megastar New Movie Update : ‘2018’ చిత్ర దర్శకుడితో మెగాస్టార్ సినిమా..
Megastar


Megastar New Movie Update : తెలుగు హీరోలంటే తెలుగు దర్శకులతో మాత్రమే సినిమాలు తీయాలి అని రూల్స్ ఏమీ పెట్టుకోవడం లేదు. వేరే భాషా దర్శకులు తీసిన సినిమాలు నచ్చితే.. వారికి పిలిచి మరీ అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. అలాగే ఇతర భాషా దర్శకులు కూడా తెలుగులో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక మలయాళ దర్శకుడికి పిలిచి మరీ అవకాశం ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

కొన్నేళ్ల క్రితం వరకు రీజియనల్ సినిమాలను చిన్నచూపు చూసేవారు. కానీ మెల్లగా కంటెంట్‌లో క్వాలిటీని పెంచుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందిస్తూ.. సౌత్ సినిమాలు ఎవరూ ఊహించని, అందుకోలేని స్థాయికి ఎదిగాయి. ఇప్పుడు టాలీవుడ్‌లాగానే మలయాళ సినీ పరిశ్రమ మాలీవుడ్‌కు కూడా విపరీతమైన క్రేజ్ పెరిగిపోయింది. వారి కంటెంట్‌ను ప్రశంసించని వారంటూ లేరు. తాజాగా ‘2018’ లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాన్ని తెరకెక్కించి మాలీవుడ్ మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించుకుంది.


2018లో కేరళలో సంభవించిన వరదలు.. ఒక్కసారిగా చాలామంది జీవితాన్ని అతలాకుతలం చేసేశాయి. అంతే కాకుండా ఈ వరదల్లో ఎన్నో వేలమంది ప్రాణాలు కోల్పోగా.. ఎన్నో వందల కుటుంబాలు నిరాశ్రయులు అయ్యారు. ఇలాంటి ఒక సంఘటన మీద సినిమా తీయాలనే ఆలోచన జూడ్ ఆంథనీ జోసెఫ్‌కు ఎలా వచ్చిందో తెలియదు కానీ.. ఈ సినిమా చూసిన ప్రేక్షకులను మాత్రం కంటతడి పెట్టేలా చేశాడు. మలయాళంలో ఇండస్ట్రీ హిట్ కావడంతో తెలుగులో కూడా ఈ చిత్రం డబ్ అయ్యి సూపర్ హిట్‌ను అందుకుంది.

కేరళలో జరిగినట్టుగానే విశాఖపట్నంలో కూడా హుదుద్ తుఫాన్ అనేది అక్కడి ప్రజలకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఆ ఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించడం కోసం 2018 డైరెక్టర్ ఆంథనీ జోసెఫ్‌తో మెగాస్టార్ చిరంజీవి చేయి కలపనున్నారని సమాచారం. 2018 చిత్రాన్ని నేచురల్‌గా తెరకెక్కించిన ఆంథనీ.. ఈ చిత్రాన్ని కూడా నేచురల్‌గా తెరకెక్కించగలరని చిరు నమ్ముతున్నారట. ఒకవేళ ఈ రూమర్స్ నిజమయితే.. ఆంథనీకి ఇదే బెస్ట్ తెలుగు డెబ్యూ అవుతుందని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×