BigTV English

BCCI Chief Selector Post : ఛీఫ్ సెలక్టర్ పోస్ట్ ఖాళీ.. బీసీసీఐ ప్రకటన..

BCCI Chief Selector Post : ఛీఫ్ సెలక్టర్ పోస్ట్ ఖాళీ.. బీసీసీఐ ప్రకటన..
BCCI Chief Selector


BCCI Chief Selector Post : గత కొన్నాళ్లుగా బీసీసీఐ టైమ్ అస్సలు బాలేదనే చెప్పాలి. ఏం చేసినా, అది మిస్‌ఫైర్ మాత్రమే అవుతోంది. పైగా టీమ్ పర్ఫార్మెన్స్ విషయంలో కూడా బీసీసీఐ పలు విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ అంతా బీసీసీఐపై ఆగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో స్పాన్సర్‌షిప్ విషయంలో, సెలక్టర్ల విషయంలో బోర్డ్ తీవ్ర ఒత్తిడిని ఎదర్కుంటోంది. తాజాగా బీసీసీకు ఒక కొత్త సెలక్టర్ కావాలనే ప్రకటన బయటికొచ్చింది.

మెన్స్ సెలక్షన్ కమిటీలో ఒక మెంబర్‌కు స్థానం ఖాళీగా ఉందని, దానికోసం రిక్రూట్‌మెంట్ జరుగుతుందని తాజాగా బీసీసీఐ ప్రకటన చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఉద్యోగాన్ని సంపాదించుకున్న వారు ఛీఫ్ సెలక్టర్ ఆఫ్ ది కమిటీ స్థానాన్ని దక్కించుకుంటారని తెలుస్తోంది. ఇదివరకు ఉన్న ఛీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ.. నార్త్ జోన్‌కు చెందినవారు. అయితే ఈ స్థానానికి అప్లై చేయాల్సిన వారికి ఉండాల్సిన కండీషన్స్ గురించి కూడా బీసీసీఐ బయటపెట్టింది.


ఉద్యోగానికి అప్లై చేసే వ్యక్తి కనీసం ఏడు టెస్టులు అయినా ఆడి ఉండాలి లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో పాల్గొని ఉండాలి లేదా 10 ఓడీఐలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి.. ఈ మూడింటిలో ఏదో ఒక క్రైటీరియాను వ్యక్తి క్లియర్ చేయాలి. అంతే కాకుండా అతడు ఆట నుండి రిటైర్ అయ్యి కనీసం అయిదు సంవత్సరాలు అయ్యిండాలి. ఇవన్నీ క్రైటీరియాలో కరెక్ట్‌గా ఉన్న వ్యక్తులు ఈ ఉద్యోగానికి అప్లై చేయవచ్చని బీసీసీఐ తెలిపింది. అంతే కాకుండా అప్లై చేసుకోవడానికి చివరీ తేదీ జూన్ 30 అని కూడా ప్రకటనలో పేర్కొంది.

ఒకప్పుడు ఛీఫ్ సెలక్టర్ స్థానంలో ఉన్నవారికి చాలా బాధ్యలో ఉండేవి. సీనియర్ నేషనల్ టీమ్‌లో ప్లేయర్స్‌కు బెంచ్‌ను క్రియేట్ చేసే బాధ్యత, ప్రతీ ఫార్మాట్‌కు కెప్టెన్‌ను ఫైనల్ చేసే బాధ్యత.. ఛీఫ్ సెలక్టర్‌పైనే ఉండేవి. బీసీసీఐ తరపున మీడియాతో మాట్లాడాల్సిన బాధ్యత కూడా తనపైనే ఉండేది. కానీ చేతన్ శర్మ ఉద్యోగం నుండి తప్పుకున్న తర్వాత నుండి సెలక్టర్స్ ఎవరూ బీసీసీఐ తరపున మీడియాతో ముందుకు రావడానికి ఇష్టపడడం లేదు. దీంతో బీసీసీఐకు, ప్రేక్షకులకు మధ్య దూరం మరింత పెరిగిపోయింది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×