BigTV English

Youtube Tv: యూట్యూబ్ టీవీలో కొత్త ఫీచర్.. ఓటీటీలకు పోటీగా..

Youtube Tv: యూట్యూబ్ టీవీలో కొత్త ఫీచర్.. ఓటీటీలకు పోటీగా..

Youtube Tv: ఈరోజుల్లో యూజర్లను ఎంటర్‌టైన్ చేసే వీడియో కంటెంట్‌ను ప్రతీ సోషల్ మీడియా యాప్ అందిస్తోంది. అందుకే సోషల్ మీడియా యాప్స్ మధ్య పోటీ పెరిగిపోతోంది. రీల్స్, ట్విటర్ వీడియోస్ అంటూ రోజుకొక కొత్త వీడియో ఫీచర్.. సోషల్ మీడియా యాప్స్ యూజర్లను పలకరిస్తోంది. కానీ ఎంత పోటీ పెరిగినా కూడా యూట్యూబ్ పాపులారిటీ మాత్రం చెక్కుచెదరకుండా ఉంది. అయినా కూడా యూట్యూబ్‌లో మొదలైన భయం.. కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టేలా చేస్తోంది.


ఒకప్పుడు యూట్యూబ్ అనేది కేవలం ఫోన్ల వరకే పరిమితం అయ్యేది. కానీ టెక్నాలజీ మారిన తర్వాత చాలామంది ఇంట్లో స్మార్ట్ టీవీలు వచ్చేశాయి. ఇందులో చాలామంది యూజర్లు.. యూట్యూబ్ చూడడం అలవాటు పడ్డారు. అయితే వారికి మరింత సౌకర్యాన్ని అందించాలని యూట్యూబ్ టీవీ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది యాజమాన్యం. ప్రత్యేకంగా స్మార్ట్ టీవీల్లో ఈ యూట్యూబ్ టీవీ అనే యాప్ అందుబాటులో ఉండేలా అప్డేట్‌ను తీసుకొచ్చింది.

యూట్యూబ్ టీవీ అనేది కొన్నిరోజులుగా యూజర్లను ఎంటర్‌టైన్ చేస్తూ వస్తోంది. అయితే వారికి మరింత ఎంటర్‌టైన్మెంట్ అందించడం కోసమే ఒకేసారి వేర్వేరు ప్రాంతాల్లో ఉండే పలువురు కలిసి ఛానెళ్లను వీక్షించే అవకాశం అందిస్తుందట ఈ యూట్యూబ్ టీవీ. ఈ విషయాన్ని యాజమాన్యం స్వయంగా ప్రకటించింది. ఇప్పటికే పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ ఈ మల్టిపుల్ స్ట్రీమింగ్ అవకాశాన్ని యూజర్లకు అందిస్తున్నాయి. దీంతో యూట్యూబ్‌పై కూడా ఇలాంటి ఒక ఫీచర్‌ను తీసుకురావాలంటూ ఒత్తిడి మొదలయ్యింది.


యూజర్ల కోరిక మేరకు యూట్యూబ్ టీవీ కూడా ఇప్పుడు మల్టిపుల్ స్ట్రీమింగ్ ఆప్షన్‌ను వారికి అందిస్తోంది. ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్సీఏఏ మెన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్ సమయంలో ఈ ఫీచర్‌ను టెస్టింగ్ కూడా చేశారు. అతి త్వరలోనే మల్టీ వ్యూ ఫీచర్ అనేది యూజర్లకు అందుబాటులోకి రానుందని ప్రకటించింది యూట్యూబ్ టీవీ. స్పోర్ట్స్, న్యూస్, వాతావరణం.. ఇలాంటి పలు కేటగిరిలకు ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఫీచర్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దాని ఫీడ్‌బ్యాక్‌ను బట్టి ఇందులో తగిన మార్పులు చేసి యూజర్లకు మెరుగైన ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తామని యాజమాన్యం అంటోంది.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×