OTT Movie : ఇప్పుడు థియేటర్లకంటే ఓటిటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు ప్రేక్షకులు. థియేటర్లకు వచ్చిన కొద్ది రోజుల్లోనే వీటిలోకి వస్తున్నాయి. అందువల్ల కొంతమంది ఓటీటీ లోనే ఎక్కువగా సినిమాలు చూడటం మొదలు పెడుతున్నారు. అయితే వీటిలో సైకో థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. సస్పెన్స్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేయడంలో ఈ సినిమాలు ముందు వరుసలో ఉంటున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలో, ఒక సైకో వేశ్యలను టార్గెట్ చేస్తుంటాడు. వాళ్ళను భయంకరంగా చంపుతుంటాడు. ఈ మూవీ మొదటి నుంచి చివరి దాకా కుర్చీలకు కట్టిపడేస్తుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘హౌ షి గాట్ ఎ కిల్లర్’ (How She Caught a Killer). 2023 లో వచ్చిన ఈ మూవీకి రాబిన్ హేస్ దర్శకత్వం వహించారు. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ఇందులో హీరోయిన్ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తూ చనిపోతాడు. తన తండ్రి చనిపోవడంతో పోలీస్ జాబ్ ఎలాగైనా కొట్టాలని గట్టిగా ప్రయత్నిస్తుంది హీరోయిన్. ఈ ప్రయత్నంలో హీరోయిన్ కి పోలీస్ జాబ్ కూడా వస్తుంది. తల్లి వద్దన్నా కూడా హీరోయిన్ డ్యూటీలో జాయిన్ అవుతుంది. భర్త డ్యూటీ చేస్తా చనిపోవడంతో, కూతురుకి కూడా ఏదన్నా ప్రమాదం వస్తుందేమోనని తల్లి భయపడుతుంది. ఇక అదే ప్రాంతంలో ఒక సీరియల్ కిల్లర్ వేశ్య లను టార్గెట్ చేస్తూ దారుణంగా చంపుతుంటాడు. చూస్తూ ఉండంగానే ఒకటి తర్వాత ఒకటి మూడు హత్యలు జరుగుతాయి. డ్యూటీ కి కొత్తగా రావడంతో, మొదట్లో హీరోయిన్ కి కేసు ఇన్వెస్టిగేషన్ కి అవకాశం ఇవ్వరు. అయితే కిల్లర్ని పట్టుకోవడానికి ఒక వేశ్య కావాల్సిన రావడంతో, హీరోయిన్ కి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఆమె వేశ్య లా గెటప్ మార్చుకొని కిల్లర్ కోసం వేట ప్రారంభిస్తుంది.
ఇంతలో ఒక వేశ్యా గృహం దగ్గర ఉన్న కొంతమంది అమ్మాయిలతో కలసి, అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఆ సైకో కిల్లర్ గుంపు గా ఉంటే, అమ్మాయిల దగ్గరికి రావడానికి సంకోచిస్తుంటాడు. అది తెలుసుకుని హీరోయిన్ ఒంటరిగా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది. కిల్లర్ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆమెను కారులో కూర్చోమంటాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది. చివరికి హీరోయిన్ సైకో కిల్లర్ని పట్టుకుంటుందా ? ఆ సైకో నుంచి హీరోయిన్ కి ప్రమాదం ఏమైనా వస్తుందా ? వేశ్యలను మాత్రమే ఆ కిల్లర్ ఎందుకు చంపుతున్నాడు? ఈ విషయాలను, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చూసి తెలుసుకోండి.
Read Also : కూతుర్ని కూడా వదలని కామ పిశాచి … అక్కా చెల్లెళ్ల రెవేంజ్ కి షాక్ అయ్యే తల్లి