Game Changer : ట్రిపుల్ ఆర్ వంటి పాన్ మూవీతో రామ్ చరణ్ రేంజ్ పెరిగింది. స్టార్ హీరో నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఆయన నుంచి వచ్చే సినిమాలు అంతే రేంజులో ఉంటాయని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు. ఆ మూవీ తర్వాత రెండేళ్ల తర్వాత సోలో హీరోగా శంకర్ దర్శకత్వంలో చేసిన ‘గేమ్ చేంజర్’ మూవీ చేసాడు. మరి ఈ రోజు విడుదలైన ఈ సినిమాతో రామ్ చరణ్ రంగస్థలం తర్వాత సోలో హీరోగా సక్సెస్ అందుకున్నాడా..? లేదా? ఈ మూవీకి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? మైనస్ పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
గేమ్ ఛేంజర్ మూవీ పబ్లిక్ టాక్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన రెండో సినిమా ఇది.. కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కింది. సంక్రాంతి కానుకగా జనవరి 10 న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ థియేటర్లలోకి వచ్చిన మూవీ యావరేజ్ టాక్ ను అందుకుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ పై పబ్లిక్ రెస్పాన్స్ మిశ్రమంగా ఉంది. ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ లో కొంచెం ల్యాగ్ ఉందనే టాక్.. అలాగే అక్కడక్కడా సీన్స్ జనాల అంచనాలను మించిపోయాయి. సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ హైలెట్ గా నిలిచాయి.. ఇక రామ్ చరణ్ వన్ మ్యాన్ షో గా శంకర్ చూపించారని టాక్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒకవైపు యావరేజ్ టాక్ వినిపిస్తుంది. మరోవైపు మెగా ఫ్యాన్స్ పాజిటివ్ గా రెస్పాన్స్ ఇస్తున్నారు. ఇక సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..
గేమ్ ఛేంజర్ మైనస్ పాయింట్స్..
గేమ్ చేంజర్ మూవీ 500 కోట్లకు పైగా బడ్జెట్ ఈ మూవీని తెరకేక్కించారు. సినిమా అనుకున్న దానికంటే భారీ అంచనాలతో ఇవాళ థియేటర్లలో వచ్చింది. అయితే మొదటి షోతో యావరేజ్ టాక్ ను అందుకుంది. ఈ మూవీలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ ఒక్కటే హైలెట్ అయ్యింది. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే.. శంకర్ మూవీలకు ఉన్న బజ్ ఈ మూవీకి లేదని స్పష్టంగా కనిపిస్తుంది. శంకర్ క్లైమాక్స్ భారీ స్థాయిలో ఉంటాయి. ఇప్పుడు గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ కూడా భారీ స్థాయిలోనే ఉంది. అయితే.. సెకండాఫ్ లో కనిపించిన ల్యాగ్ అనేది.. క్లైమాక్స్ లో కూడా కనిపించింది. ఓ టైంలో హీరో – విలన్ ఇంకా ఎంత సేపు కొట్టుకుంటార్రా… బాబు అని అనిపించేలా ఉంది. ఫస్టాఫ్ వరకు ఒకే కానీ, సెకండాఫ్‌లో కథనానికి శంకర్ మరింత పని చెప్పాల్సింది.. అలాగే శంకర్ సినిమా అంటే మరో వ్యక్తి గుర్తు వస్తారు. ఆయనే ఏఆర్ రెహమాన్. శంకర్ సినిమాలో సాంగ్స్ అండ్ మ్యూజిక్ క్లాసిక్‌గా ఉంటాయి. కనెక్ట్ అవుతాయి. కానీ, అది ఇప్పుడు గేమ్ ఛేంజర్‌లో కనిపించలేదు. దీన్ని కవర్ చేయడానికి సాంగ్స్‌కు భారీ బడ్జెట్ పెట్టారు. అయినా పెద్దగా వర్క్ అవుట్ అవ్వలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వలేదు.. సీన్స్ ల్యాగ్ అయ్యాయని టాక్.. మొత్తానికి ఈ మూవీ యావరేజ్ టాక్ అందుకుంది. మరి కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలి..