BigTV English

Game Changer: రెహమాన్.. శంకర్ తో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందా..?

Game Changer: రెహమాన్.. శంకర్ తో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందా..?

Game Changer:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ (Ram Charan), రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు.ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య గేమ్ ఛేంజర్ (Game Changer) అనే సినిమాను విడుదల చేశారు. నిన్నే యూఎస్ఏ లో ప్రీమియర్ షోలు పడగా.. ఈరోజు ఇండియాలో తెల్లవారుజామున షోలు వేశారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇందులో ప్లస్, మైనస్ రెండూ ఉండడం వల్లే ఒక వర్గం ప్రేక్షకులను మెప్పించలేదనే వార్త వినిపిస్తోంది. వాస్తవానికి ఈ సినిమాలో రామ్ చరణ్ తన అద్భుతమైన నటనతో సూపర్ గా ప్రేక్షకులను మెప్పించారు. అటు ఎస్. జె. సూర్య (SJ Surya), అంజలి (Anjali) ఇలా ఎవరికి వారు తమ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించారు. కానీ సినిమాలో కొన్ని అంశాలు మిస్ అవ్వడం వల్లే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో మాస్ ఎలివేషన్ లేకపోవడం, రొటీన్ స్టోరీ, కామెడీ పెద్దగా వర్క్ అవుట్ కాకపోవడం, రొమాంటిక్ సన్నివేశాలు లేకపోవడం వంటివి అభిమానులను కాస్త నిరాశకు గురి చేస్తున్నాయి.


ఏఆర్ రెహమాన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది..

సాధారణంగా శంకర్ (Shankar) సినిమాలు అంటే ఒక రేంజ్ లో అభిమానులు ఊహించుకుంటారు. కానీ ఈ సినిమా శంకర్ మార్క్ కి తగ్గట్టుగా అనిపించడం లేదు. శంకర్ సినిమాలో సాంగ్స్ అండ్ మ్యూజిక్ చాలా క్లాసిక్ గా ఉంటాయి. అందరికీ కనెక్ట్ అవుతాయి. కానీ అది ఇప్పుడు గేమ్ ఛేంజర్ లో కనిపించడం లేదు.. దీన్ని కవర్ చేయడానికి పాటలు కోసం భారీ బడ్జెట్ కేటాయించారు కానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎక్కడా కనెక్ట్ అయినట్లు కనిపించడం లేదు. దీంతో రెహమాన్(AR Rahman) లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు శంకర్ దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు ,ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించేవారు. కానీ ఈ సినిమాకి ఏ ఆర్ రెహమాన్ కి బదులు తమన్ (Thaman) ను తీసుకున్నారు. దీంతో ఏఆర్ రెహమాన్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ ఈ సినిమాలోని పాటలకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించి ఉండి ఉంటే, బిజిఎం పరంగా అయినా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని ఒక వర్గం ప్రేక్షకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.


అసలు ఏమై ఉంటుంది అంటున్న ఆడియన్స్..

ఎప్పుడు శంకర్ సినిమాలకు సంగీతాన్ని అందించే ఏఆర్ రెహమాన్ గేమ్ ఛేంజర్ విషయంలో ఎందుకు సైలెంట్ అయ్యారు ? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి శంకర్ ఆయనను సంప్రదించలేదా? లేక మరేదైనా కారణం వల్ల తమన్ ను ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా ఏం జరిగినా ప్రభావం మాత్రం సినిమా ఫలితం పై భారీగా పడిందనే వార్తలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి తోడు ఈ సినిమా నుంచి “నానా హైరానా” అనే పాటను కూడా తొలగించినట్లు చిత్ర బృందం ప్రకటించింది. కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్లే సినిమాలోని పాటను తొలగించినట్లు సమాచారం.. ఇక జనవరి 14వ తేదీ నుంచి ఈ పాటను కూడా జోడిస్తామని వెల్లడించారు. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రస్తుతానికి పర్వాలేదు అనిపించుకుంటోంది.

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

×