BigTV English

IND vs Aus 3rd Test: ఆసీస్‌ తో జరిగే మరో 3 టెస్టుల టైమింగ్స్‌ మార్పు…ఇండియన్స్‌ చూడలేరు ?

IND vs Aus 3rd Test: ఆసీస్‌ తో జరిగే మరో 3 టెస్టుల టైమింగ్స్‌ మార్పు…ఇండియన్స్‌ చూడలేరు ?

IND vs Aus 3rd Test: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో  ( Border-Gavaskar trophy ) భాగంగా ప్రస్తుతం టీమిండియా ( Team India) వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ లు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్లో ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది టీమిండియా. ఇందులో ఇప్పటికే రెండు మ్యాచ్లు పూర్తి అయ్యాయి. పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై టీమిండియా గ్రాండ్ ఫ్యాక్టరీ కొట్టింది. ఆ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించడం జరిగింది.


Also Read: Sunil Gavaskar: హోటల్‌లో పడుకోవడం మానేయండి…టీమిండియా ప్లేయర్లకు వార్నింగ్‌ !

ఇక రెండవ అడిలైడ్ వేదికగా పింక్ బాలుతో మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పింక్ బాల్ మ్యాచ్ లో పూర్తిగా ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయించింది. దీంతో ఇండియా పైన 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించడం జరిగింది. ఇక ఇప్పుడు మరో టెస్ట్ కు రెడీ అవుతోంది ఆస్ట్రేలియా (Australia )  అలాగే టీమ్ ఇండియా. మూడవ టెస్టు నుంచి ఐదో టెస్టు వరకు… జరిగే మ్యాచ్ ల టైమింగ్స్ పూర్తిగా భిన్నంగా ఉంటాయి.


ఇండియన్స్ నిద్ర లేవక ముందే మ్యాచులు ప్రారంభమవుతాయి. మరి ఒకసారి టీమిండియా ఆడే మరో మూడు టెస్టు మ్యాచ్ ల టైమింగ్స్ ఒకసారి పరిశీలిద్దాం. టీమ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్… డిసెంబర్ 14వ తేదీ నుంచి అంటే శనివారం రోజున ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ బ్రిస్ బెన్ వేదికగా జరగనుంది. డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు ఈ మ్యాచ్ జరుగుతుంది. అయితే ఉదయం ఐదు గంటల 50 నిమిషాలకు… ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

 

భారత కాలమానం ప్రకారం… ఉదయం 5:50 లకు.. బ్యాటింగ్ ఏదో ఒక జట్టు చేస్తుంది. ఇక నాలుగో టెస్ట్ విషయానికి వస్తే… మూడవ టెస్ట్ కంటే ఒక గంట ముందుగానే ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26వ తేదీన ప్రారంభమవుతుంది. డిసెంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మెల్ బోర్న్ వేదికగా ఈ నాలుగో టెస్ట్ జరగనుంది.

భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ఉదయం 5 గంటలకే ప్రారంభమవుతుంది. అటు… చిట్టచివరి ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఐదవ మ్యాచ్ కొత్త సంవత్సరంలో ప్రారంభమవుతుంది. జనవరి 3 నుంచి జనవరి 7వ తేదీ వరకు సిడ్నీ వేదికగా ఈ ఐదవ టెస్టు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ కూడా భారత కాలమానం ప్రకారం ఉదయం 5 గంటల సమయానికి ప్రారంభం కానుంది. ఈ మిగతా టెస్టులు కూడా స్టార్ స్పోర్ట్స్ లేదా హాట్ స్టార్ లో చూడవచ్చు. మరి ఈ మూడు మ్యాచ్ లలో టీమిండియా ఎలా ఆడుతుందో చూడాలి.

Also Read: Mohammed Shami – Rohit Sharma: టీమిండియాలో అంతర్గత గొడవలు..రోహిత్ శర్మ వర్సెస్ షమీ ?

 

Image

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×