BigTV English

Mohanbabu: ఆ సినిమా కోసం నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టా.. కానీ – మోహన్ బాబు..!

Mohanbabu: ఆ సినిమా కోసం నా ఆస్తులన్నీ తాకట్టు పెట్టా.. కానీ – మోహన్ బాబు..!

Mohanbabu:విలక్షణ నటుడిగా, డైలాగ్ కింగ్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న మోహన్ బాబు (Mohanbabu) తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని, తన కెరియర్ గురించి అలాగే బాల్యం గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా తాను ఈ స్థాయికి రావడానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, ముఖ్యంగా ట్రోల్స్ చేసే వారిని తాను ఏమాత్రం పట్టించుకోనని కూడా తెలిపారు మోహన్ బాబు. ప్రస్తుతం మోహన్ బాబు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


ఆ సినిమా కోసం ఆస్తులన్నీ తాకట్టు పెట్టాను- మోహన్ బాబు

ఆ ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ.. “నేను చూసిన మొదటి సినిమా ‘రాజ మకుటం’. ఎవరికి చెప్పకుండా నాలుగు కిలోమీటర్లు నేను ఒక్కడినే నడుచుకుంటూ వెళ్లి ఆ సినిమా చూశాను. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అవకాశాల కోసం ఎదురుచూసినప్పుడు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao) నాకు అవకాశం ఇచ్చారు. 1975లో వచ్చిన స్వర్గం నరకం అనే సినిమాతో నేను తొలిసారి విలన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను. అప్పట్నుంచి ఇప్పటివరకు నటుడిగానే కొనసాగుతున్నాను. ఒకవైపు నటుడిగా నటిస్తూనే.. మరొకవైపు ‘ప్రతిజ్ఞ’ అనే సినిమాతో నిర్మాతగా కూడా మారాను.. ఇక నా నిర్మాణ సంస్థను ప్రారంభించింది కూడా సీనియర్ ఎన్టీఆర్ (Sr.NTR). ఇక బ్యానర్ ప్రారంభోత్సవానికి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వచ్చి క్లాప్ కొట్టారు. ఇక అదే బ్యానర్ పై సీనియర్ ఎన్టీఆర్ హీరోగా ‘మేజర్ చంద్రకాంత్’ సినిమాను తీశాను. దానికోసం నా ఆస్తులన్నీ కూడా తాకట్టు పెట్టాను. అయితే ఆ సమయంలో అన్నగారు వద్దు అని వారించినా.. మొండిగా సినిమా తీశాను కానీ ఆ సినిమా సక్సెస్ అయ్యింది.. అంతేకాదు ఆ సినిమాతోనే సీనియర్ ఎన్టీఆర్ తొలిసారి కోటి రూపాయల పారితోషకం తీసుకున్నారు” అంటూ నాటి విషయాలను పంచుకున్నారు మోహన్ బాబు..


కన్నప్ప ట్రోలింగ్ పై మోహన్ బాబు కామెంట్స్..

ఇక అలాగే రాజకీయాల గురించి మాట్లాడుతూ.. నాకు పెద్దగా రాజకీయాలు సెట్ అవ్వవు. నేను కోరుకున్నవి అన్నీ జరిగాయి. ఇక దేవుడి ఆశీస్సులతో ఇకపై మంచి సినిమా పాత్రలు వస్తే నటిస్తూ.. పిల్లలతో సరదాగా గడపాలని అనుకుంటున్నాను. సినిమా ఫెయిల్ అవ్వడం వేరు.. నటుడిగా ఫెయిల్ అవ్వడం వేరు.. నేను నటుడిగా ఎప్పుడూ కూడా ఓడిపోలేదు. దాదాపు 560 సినిమాలలో నటించాను
ఇప్పుడు నా పిల్లలు కూడా నటిస్తున్నారు. ఇకపోతే ఒక్కొక్కరికి ఒక్కో విధమైన కోపం ఉంటుంది.. నాకు ఆవేశం ఎక్కువ . గతాన్ని నేను తవ్వుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ఎప్పుడు ఇతరులకు అపకారం చేయాలనే ఆలోచన నాకు ఉండదు. కానీ నన్ను ఎంతోమంది మోసం చేశారు. అప్పటినుంచే నా ఆవేశం పెరిగింది. తద్వారా నాకు కష్టాన్ని , నష్టాన్ని కూడా మిగిల్చింది “అంటూ తెలిపారు మోహన్ బాబు. అంతేకాదు ‘కన్నప్ప’ సినిమాపై ట్రోలింగ్ చేసే వాళ్లకి కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. “ట్రోలింగ్ చేయడం వల్ల ఏ ఆనందం వస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ కన్నప్ప సినిమాపై చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ నేను వాటిని పట్టించుకోను. నా దృష్టిలో ప్రజలే ప్రత్యక్ష దేవుళ్ళు.. వారి నిర్ణయమే అంతిమ నిర్ణయం” అంటూ తెలిపారు

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×