Mahesh Babu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు. కేవలం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే మాత్రం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎస్.ఎస్ రాజమౌళికి ఫ్యాన్స్ ఉన్నారని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకున్నాడు రాజమౌళి. తెలుగు సినిమా సత్తా కూడా చాలామందికి అదే సినిమాతో తెలిసి వచ్చింది. ప్రస్తుతం రాజమౌళి నుంచి ఒక సినిమా వస్తుంది అని అంటే ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు అనడంలో అతిశయోక్తి లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు ఎస్ఎస్ రాజమౌళి. ఆ సినిమా తర్వాత మరికొన్ని సినిమాలు చేస్తూ దర్శకుడిగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నిలబడ్డాడు. తాను నిలబడటమే కాకుండా తెలుగు సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకొచ్చి పెట్టాడు. రాజమౌళి చాలామందిని స్టార్ హీరోలను చేశాడు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు రాజమౌళితో కలిసి పనిచేశారు. వీరందరికి మంచి స్టార్ట్ డం అందించాడు ఎస్ఎస్ రాజమౌళి.
మొదటిసారి మహేష్ బాబు తో
ఆల్రెడీ స్టార్డం ఉన్న హీరోతో మాత్రం రాజమౌళి ఇప్పటివరకు పనిచేయలేదు. రాజమౌళి వలన స్టార్డం వచ్చిన హీరోలతో సినిమాలు చేసి మళ్లీ హిట్స్ కొట్టాడు. ఇక మొదటిసారి ఎస్.ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమాను చేస్తున్నాడు. మహేష్ బాబు కెరియర్ లో వస్తున్న 29వ సినిమా ఇది. అయితే రాజమౌళి స్కూల్ ఎంత స్ట్రిట్ గా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో మొబైల్ ఫోన్స్ కూడా షూటింగ్లోకి అనుమతించారు. అనుకున్నది అనుకున్నట్లు వచ్చేంతవరకు ఆ హీరోలను నటింపజేస్తూనే ఉంటారు రాజమౌళి. ఒక సీన్ ను అద్భుతంగా చెక్కుతాడు కాబట్టే రాజీవ్ కనకాల రాజమౌళికి జక్కన్న అనే పేరును పెట్టారు. ఇప్పటికి చాలామంది రాజమౌళిని జక్కన్న అంటారు. అయితే మహేష్ బాబు తో సినిమా చేస్తున్న తరుణంలో మహేష్ బాబు పాస్పోర్ట్ తీసుకొని సింహాన్ని బోనులో బంధించినట్లు ఒక వీడియో రిలీజ్ చేశాడు ఎస్.ఎస్ రాజమౌళి. ఈ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది. మరోసారి ఈ వీడియో ప్రస్తావన లోకి వచ్చింది.
ఒకసారి కమిట్ అయితే అంతే
మహేష్ బాబు తన పాస్పోర్ట్ తిరిగి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతుంది. అప్పుడే రాజమౌళి వీడియోని ఇప్పుడు మహేష్ బాబు వీడియోని కలిపి వైరల్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు అయితే ప్రత్యేకించి పాస్పోర్టును చూపిస్తున్నాడు. ఈ వీడియోని చూస్తున్న కొంతమంది పోకిరి సినిమాలోని ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే డైలాగ్ను కామెంట్స్ రూపంలో పెడుతున్నారు. మరి కొంతమంది బోను నుంచి సింహం విడుదలైంది, జక్కన్నకే మస్కా కొట్టిన బాబు అంటూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. తెలుగు సినిమా స్థాయిని మరింత రేంజ్ కు తీసుకెళ్లే సినిమా అవుతుంది అని చాలామందికి నమ్మకం.
Also Read : Prithviraj Sukumaran : లూసిఫర్ 2 ఎఫెక్ట్… పృథ్విరాజ్‌కు ఐటీ నోటీసులు..?