BigTV English

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Jani Master Case : జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్.. మరో ఇద్దరు అరెస్ట్?

Jani Master Case : ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ వివాదాలు చుట్టు ముట్టాయి.. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే మాస్టర్ ఈ నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కేసు విచారణలో పోలీసులు షాక్ అయ్యే విధంగా నమ్మలేని నిజాలు దాగి ఉన్నట్లు తెలుస్తుంది. ఈ కేసు విచారణలో భాగంగా మాస్టర్ ను 14 రోజుల పాటు చంచల్ గూడా జైలులో ఉంచనున్నారు.. ఇక ఇప్పుడు ఈ కేసులో కీలకంగా ఉన్నా ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ ఇద్దరు ఎవరు అనే ప్రశ్నలు జనాలకు మొదలయ్యాయి.


లైంగిక వేధింపులకు గురి చేసి ఆరేళ్లుగా ఆత్యాచారం చేస్తున్న జానీ మాస్టర్ పై లేడి కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో ఈ కేసు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఆయన అలాంటి వాడు కాదని కొందరు మద్దతుగా నిలిస్తే, మరికొందరు మాత్రం ఆయన తప్పు చేసాడేమో అందుకే కేసు పెట్టింది కావచ్చు అని చర్చలు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు కొరియోగ్రాఫర్స్ మీడియా ముందుకు వచ్చి మాస్టర్ కు సపోర్ట్ చేశారు. ఇక తాజాగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుందని తెలుస్తుంది.

Another twist in the Jani Master case.. Two more arrested?
Another twist in the Jani Master case.. Two more arrested?

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేశారని, ఆయన భార్య అయేషా తనపై దాడి చేసిందని బాధితురాలైన జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియో గ్రాఫర్ నార్సింగి పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన భార్య అయేషా తన ఇంటికి వచ్చి దాడి చేసినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ కేసులో ఆమెను నిందితురాలుగా చేర్చాలని పోలీసులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.. ఇక అంతేకాదు మాస్టర్ భార్యతో పాటుగా మరో ఇద్దరినీ నిందితులుగా చేర్చే అవకాశం ఉన్నట్లు సమాచారం..


ఇకపోతే ఉప్పరపల్లి కోర్టులో జానీ మాస్టర్‌ని కస్టడీ కి కోరుతూ నార్సింగి పోలీసులు పిటిషన్ వేయనున్నారు. పది రోజులపాటు కస్టడీకి కోరే అవకాశం ఉంది. పూర్తిస్థాయిలో ఆయన్ను విచారించేందుకు పోలీసులు కోర్టుకు వెళ్లనున్నారు. రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. లేడీ కొరియో గ్రాఫర్ ఇచ్చిన 40పేజీల ఫిర్యాదుపైనా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కస్టడీ కోరనున్నారు. ఈ కేసు ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఇప్పుడు ఆయన భార్యను అరెస్ట్ చెయ్యడం కోసం పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అలాగే ఆయన భార్యపై కూడా ఆరోపణలు రావడంతో అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఆయనకు సహాయం చేసిన మరో ఇద్దరినీ ఈ కేసులో చేర్చారు. మరి ఈ కేసు లో కీలకంగా మారిన ఆ ఇద్దరు ఎవరో తెలియాల్సి ఉంది..

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×