Mohan Lal Look Released from Manchu Vishnu’s Kannappa: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా కన్నప్ప తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్ బాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులకు భారీ హైప్ తీసుకొచ్చేలా చేశాయి. టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక స్టార్ క్యాస్టింగ్ ఉన్న సినిమాగా కన్నప్ప రిలీజ్ కానుంది.
టాలీవుడ్ నుంచి ప్రభాస్, కోలీవుడ్ నుంచి శరత్ కుమార్, బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్.. మాలీవుడ్ నుంచి మోహన్ లాల్.. శాండిల్ వుడ్ నుంచి శివరాజ్ కుమార్.. ఇక అంతేనా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో పాటు ఇంకా స్టార్లు చాలామంది ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఒక్కో స్టార్ సెట్ లో అడుగుపెట్టినప్పుడు మేకర్స్ అధికారికంగా వారికి వెల్ కమ్ చెప్తూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు.
ఇప్పటికే ప్రభాస్, అక్షయ్ కుమార్ సెట్ లో అడుగుపెట్టారు. తాజాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా సెట్ లో అడుగుపెట్టినట్లు తెలుస్తోంది. నేడు ఆయన పుట్టినరోజు కావడంతో కన్నప్ప టీమ్.. ఒక పోస్టర్ తో మోహన్ లాల్ కు బర్త్ డే విషెస్ తెలిపింది. “ఇండస్ట్రీలోనే గొప్ప నటులలో ఒకరైన మోహన్ లా కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. రీల్ లోనైనా రియల్ లోనైనా నా ఫేవరేట్ హీరో మీరే ” అంతో మంచు విష్ణు చెప్పుకొచ్చాడు.
Also Read: Allu Arjun: చిన్న ధాబాలో భార్యతో కలిసి బన్నీ ఏం చేస్తున్నాడో చూడండి.. ?
ఇక పోస్టర్ లో మోహన్ లాల్ ఫోటో ఉండగా.. బ్యాక్ గ్రౌండ్ లో కన్నప్ప సినిమాలోని క్యారెక్టర్ షాడో పోస్టర్ కనిపిస్తుంది. ఈ సినిమాలో ఆయన ఏ పాత్రలో కనిపిస్తున్నాడు అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో మంచు విష్ణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Many Happy Returns of the day to one of the greatest actors. @Mohanlal ❤️, and one of my fav hero, in Reel and Real life. 🥰❤️ pic.twitter.com/d1ANtWdYbl
— Vishnu Manchu (@iVishnuManchu) May 21, 2024