Mohanakrishna Indraganti : రీసెంట్ గా ‘కోర్టు’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న వెర్సటైల్ స్టార్ ప్రియదర్శి (Priyadarshi). ఆయన హీరోగా నటిస్తున్న మరో మూవీ ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam) ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం తాజాగా మీడియా సమావేశాన్ని నిర్వహించింది. అందులో భాగంగా డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ ప్రముఖ నటుడు అవసరాల శ్రీనివాస్ (Avasarala Srinivas) వేసిన ఓ అడల్ట్ జోక్ ను స్టేజ్ పైనే రివీల్ చేశారు.
డైరెక్టర్ తో నటుడి అ*డల్ట్ జోకులు
డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సారంగపాణి జాతకం’ మూవీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ‘శ్రీనివాస్ అవసరాల ఎప్పుడూ నాతో అ*డల్ట్ జోక్ వేసేవాడు. అది స్టేజ్ పై చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. సార్ మీతో నాకు సె*క్స్ చేయాలని ఉంది అనేవాడు. కానీ ఆయన నాతో సెట్ లో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారు అన్న విషయం తర్వాత అర్థమైంది. ఈ రీజన్ వల్లే నేను ఆయనతో కలిసి వర్క్ చేయడాన్ని ఎంజాయ్ చేయగలిగాను. ఇక దీంతో కావలసిన థంబ్ నెయిల్ కూడా వచ్చేసింది అనుకుంటున్నా” అని నవ్వేశారు. ఇక అవసరాల శ్రీనివాస్ ఆయన కామెంట్స్ కి నవ్వుతూనే, ఇబ్బందికరంగా ఫేస్ పెట్టడం కనిపించింది.
ప్రెస్ మీట్ లో డైరెక్టర్ మాట్లాడుతూ “మన చేతుల్లోని రేఖల్ని కాదు, రీతులను బట్టి కూడా జీవితం ఉంటుందని ఈ మూవీ ద్వారా చెప్పాము. ఎవరి మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదు మాకు. ఓ ఇంగ్లీషు స్టోరీ ప్రేరణతో పాతకాలన్ని మించిపోయే మూఢనమ్మకాలు, మరోవైపు చంద్రుడిని చేరుకునేంత సైన్స్… రెండింటి మధ్య ఉన్న వైరుధ్యాన్ని సారంగపాణి జాతకం ద్వారా తెరపై చూపించే ప్రయత్నం చేసాము” అని అన్నారు.
నెరవేరిన ప్రియదర్శి పదేళ్ళ కల
ఈ సందర్భంగా హీరో ప్రియదర్శి మాట్లాడుతూ “ఇంద్రగంటి గారితో సినిమా చేయాలన్నది నా పదేళ్ల కల. ఈ సినిమాను నిర్మాత ఎంతగా నమ్ముతున్నాడో ఆయనకంటే ఎక్కువగా నేను నమ్ముతున్నాను. కోర్టు మూవీ కంటే ముందే సారంగపాణి సినిమాకు కమిట్ అయ్యాను. ఈ సినిమా స్టోరీ నేరేషన్ సెషన్లో పార్టిసిపేట్ చేశాక ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. ఇంద్రగంటి పై మరింత గౌరవం పెరగగా, ఇకపై నా సినిమాలన్నింటికీ స్టోరీ నరేషన్ సెషన్ ను సజెస్ట్ చేయాలని డిసైడ్ అయ్యాను. ‘కోర్ట్’ మూవీని చూసి మెగాస్టార్ చిరంజీవి మా టీమ్ ని ప్రత్యేకంగా అభినందించారు. అలాగే సారంగపాణి చూశాక మళ్లీ మెగాస్టార్ నుంచి మా టీంకి పిలుపు వస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను” అని అన్నారు.
ఇదిలా ఉండగా ‘సారంగపాణి జాతకం’ మూవీకి ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన రూప కుడువాయుర్ హీరోయిన్ గా నటిస్తోంది. అవసరాల శ్రీనివాస్, అశోక్ కుమార్, సమీరా భరద్వాజ ఇందులో కీలకపాత్రలు పోషించారు.