Film Chamber: సినీ ఇండస్ట్రీలో ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటే తెర వెనుక ఎంతోమంది కష్టపడి పని చేస్తేనే మూడు గంటల పాటు ప్రేక్షకులు తెరపై వినోదాన్ని చూడగలరు. ఇలా సినిమా నిర్మాణ విషయంలో ఎంతోమంది కష్టపడగా ఆ సినిమాని థియేటర్లో విడుదల చేయడం కోసం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కూడా అదే స్థాయిలో కష్టపడుతూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో కొంతమంది థియేటర్లలో పెద్ద ఎత్తున మోసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం కాస్త ఫిలిం ఛాంబర్(Film Chamber) దృష్టికి రావడంతో ఫిలిం ఛాంబర్ తమదైన శైలిలోనే వార్నింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా గత కొంతకాలంగా సినిమా టికెట్ల (Movie Tickets)విషయంలో థియేటర్లలో డిస్ట్రిబ్యూటర్లు(Distributers) మోసాలకు పాల్పడుతున్నట్లు ఫిలిం ఛాంబర్ కు ఫిర్యాదు రావడంతో సెప్టెంబర్ 19వ తేదీ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో భాగంగా థియేటర్లలో జరుగుతున్న మోసాలు గురించి చర్చలకు వచ్చాయి. ఈ క్రమంలోనే డిస్ట్రిబ్యూటర్లను హెచ్చరిస్తూ ఫిలిం ఛాంబర్ ఒక లెటర్ విడుదల చేశారు. ఇందులో భాగంగా టికెట్లు తీసుకునే విషయంలో ఎవరైతే మోసాలకు పాల్పడుతున్నారు అలాంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
50% జరిమానా తప్పదు…
ఇక పై థియేటర్లలో మోసం జరుగుతున్నట్టు ఛాంబర్ దృష్టికి వస్తే తప్పనిసరిగా ఆ థియేటర్ పై 50% జరిమానా విధించబడుతుందని తెలిపారు. అలాగే ఇలాంటి మోసాలు జరుగుతున్న సమయంలో అక్కడ ఉన్న వ్యక్తిపై 50% జరిమానా విధించాలని ఫిలిం ఛాంబర్ సూచించింది. ఇలా ఫిలిం ఛాంబర్ సూచనలు మేరకు ఇలాంటి మోసాలకు తెర పడితే మంచిది లేకపోతే పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని తెలుస్తుంది. సినిమాల విషయంలో థియేటర్లో నిర్వహణ విషయంలో ఫిలిం ఛాంబర్ ఎప్పటికప్పుడు పలు సూచనలు చేస్తుంది.
తాజాగా థియేటర్లలో టికెట్ల విషయంలో జరుగుతున్న మోసాల గురించి పలు సందర్భాలలో ఫిర్యాదులు రావడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!