Javeria Abbasi: లోకం తీరు రోజు రోజుకు మారుతూ ఉంది. వావివరసలు లేకుండా ఎవరిని పడితే వాళ్లను పెళ్లాడి.. బంధాలకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు. ఒక హీరోయిన్ తన సొంత అన్ననే పెళ్ళాడింది. అంతేనా అతనితో ఒక బిడ్డకు జన్మనిచ్చింది కూడా. వింటేనే జుగుప్సాగా ఉంది కదా. ఆ హీరోయిన్ ఎవరు..? ఎందుకు అలా చేసింది తెలుసుకుందాం.
జవేరియా అబ్బాసీ.. ఒక పాకిస్థానీ నటి. ఆమె ఎన్నో సినిమాల్లో నటించి ఒక మంచి గుర్తింపును తెచ్చుకుని. అంతేకంటే ఎక్కువ విమర్శలను కూడా అందుకుంది. 17 ఏళ్ల వయస్సులో జవేరియా తన సవతి అన్నను వివాహమాడింది. పాకిస్థాన్ అయినా.. అన్నాచెల్లెళ్లు పెళ్లిని వ్యతిరేకించారు. అయినా ఆ విమర్శలను పట్టించుకోకుండా వారు పెళ్లి చేసుకోవడం, ఒక బిడ్డకు జన్మను కూడా ఇచ్చింది.
ఇక ఆమె వివాహం జరిగి చాలా ఏళ్ళు అయ్యింది. అయినా ఇప్పుడెందుకు మరోసారి జవేరియా పేరు వైరల్ గా మారింది అంటే.. సొంత అన్నను పెళ్ళాడి.. అతనికి విడాకులిచ్చి ఈ మధ్యనే ఆమె రెండో పెళ్లి చేసుకుంది. అందుకే జవేరియా పేరు మరోసారి మారుమ్రోగిపోతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో జవేరియా తన అన్నతో పెళ్లి గురించి మాట్లాడింది.
” 17 ఏళ్ల వయస్సులో నాకు నా అన్నతో వివాహం జరిగింది. అది ఎన్ని విమర్శలకు దారితీసింది అనేది అందరికి తెలుసు. నిత్యం ఆ విమర్శలను నేను ఎదుర్కుంటూ వచ్చాను. ఛీఛీ ఏంటి ఈ అమ్మాయి సొంత అన్ననే వివాహం చేసుకుంది అని సూటిపోటి మాటలు అనేవారు. కొందరు సొంత రక్తం కాదు కాబట్టి పర్లేదు అని చెప్పేవారు. ఇక నా తల్లే నన్ను అత్తగారిలా కాల్చుకు తింది.కానీ, ఒక కోడలిగా అవన్నీ సర్దుకుంటూ వచ్చాను. కానీ, సమాజం నన్ను మాములు మనిషిగా ఉండనివ్వలేదు. ఆ మాటలు తట్టుకోలేకపోయాను. డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. ఆ తరువాత నా భర్తకు విడాకులు ఇచ్చాను. అప్పటికే నాకు కూతురు ఉంది. ఆమెను నేను సింగిల్ తల్లిగా పెంచాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు కూడా అలానే పెంచుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇక భర్త , అన్న అయిన షమూన్ కి విడాకులు ఇచ్చాకా ఈ మధ్యనే జవేరియా.. రెండో పెళ్లి చేసుకుంది. 51 ఏళ్ళ వయస్సులో ఒక బిజినెస్ మ్యాన్ ను వివమాడింది. అది కూడా కూతురు ప్రోత్సాహంతో రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆమె తెలిపింది. ఏదిఏమైనా ఈమె కథ విన్నాకా అందరూ ఛీఛీ ఇదెక్కడి దరిద్రం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.