BigTV English

Mohanlal Dance on Zinda Banda Song: షారుఖ్ ఖాన్ సాంగ్‌కు మోహన్‌లాల్ మాస్ స్టెప్స్.. ఫిదా అయిపోయిన బాద్షా..!

Mohanlal Dance on Zinda Banda Song: షారుఖ్ ఖాన్ సాంగ్‌కు మోహన్‌లాల్ మాస్ స్టెప్స్.. ఫిదా అయిపోయిన బాద్షా..!

Malayalam Star Mohanlal Dance on Shah Rukh Zinda Banda Khan’s Song: మలయాళం సూపర్ స్టార్ మోహన్‌ లాలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలో అయిన తన మార్క్ ఉంటుంది. అయితే ఒక్క మలయాళంలోనే కాకుండా ఈ సూపర్ స్టార్‌కి తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన సినిమాలు వస్తున్నాయంటే థియేటర్ల వద్ద హంగామా ఓ రేంజ్‌లో ఉంటుంది.


అంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మరి. ఇటీవలే మలైకోటై వాలిబన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే మంచి అంచనాల నటుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇదిలా ఉంటే మోహన్‌లాల్ తన నటనతో ప్రేక్షకుల్ని అలరించడం ఒకెత్తయితే.. మాస్ ఫైట్స్, చిన్న చిన్న డాన్స్ స్టెప్పులతో సినిమాను మరింత రేంజ్‌కు తీసుకెళ్ళడం మరొక ఎత్తు.

అయితే మోహన్‌లాల్ ఎలాంటి స్టెప్పు వేసినా అది ఓ లెవెల్ ఉంటుంది. కాగా అతడు ఆన్‌స్క్రీన్‌లో డాన్స్ చేయడం అందరూ చూసుంటారు. కానీ ఎప్పుడైనా ఈవెంట్‌లో స్పెషల్ పెర్ఫార్మెన్స్ ఇస్తే ఎలా ఉంటుందో చూసుండరు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. తాజాగా జరిగిన ఓ ఈవెంట్‌లో మోహన్‌లాల్ తన స్పెషల్ పెర్ఫార్మెన్స్‌తో దుమ్ము దులిపేశాడు.


Also Read: ఐమ్యాక్స్ 3డి వెర్షన్‌లో ‘జై హనుమాన్’.. డ్రాగన్స్‌తో హనుమంతుడి ఫైట్.. పోస్టర్ అదుర్స్..!

గతేడాది బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన ‘జవాన్’లోని ‘జిందా బందా’ సాంగ్‌కు మాస్ స్టెప్పులు వేసి మోహన్‌లాల్ అదరగొట్టేశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను ‘షారుఖ్ ఖాన్ యూనివర్స్ ఫ్యాన్ క్లబ్’ ట్విట్టర్ ఎక్స్‌‌లో షేర్ చేసింది. దీంతో మోహన్‌లాల్ డాన్స్‌ చూసి షారుఖ్ ఫిదా అయిపోయాడు.

ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘‘ఈ సాంగ్‌కు స్టెప్పులేసి నాకు ప్రత్యేకంగా నిలిపిన మోహన్ లాల్ సార్‌కు థ్యాంక్యు. మీరు చేసిన ఈ డ్యాన్స్‌లో నేను సగమే చేశాను అని అనుకుంటున్నాను. లవ్ యు సర్.. మీతో కలిసి డిన్నర్ చేసేందుకు వెయిట్ చేస్తున్నాను’’ అంటూ రాసుకొచ్చాడు.

https://twitter.com/SRKUniverse/status/1782466522818150541?

Also Read: Coolie – Rajinikanth: ‘కూలీ’ కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్‌.. మరో ‘బాహుబలి 2’ తీయొచ్చు..!

దీనిపై మోహన్ లాల్ రిప్లై ఇస్తూ.. ‘‘డియర్ షారుఖ్.. మీలా ఎవరూ డ్యాన్స్ చేయలేరు. డ్యాన్స్‌లో మీదొక ప్రత్యేక శైలి. కేవలం డిన్నర్ మాత్రమేనా.. మనమెందుకు కలిసి జిందా బందాకు కలిసి డ్యాన్స్ చేయకూడదు’’ అని రాసుకొచ్చాడు. అయితే దీనిపై తిరిగి షారుఖ్ రిప్లై ఇచ్చాడు.. ‘‘ఓకే సర్.. డాన్స్ మీ ఇంట్లోనా.. లేక మా ఇంట్లోనా’’ అంటూ మరో ట్వీట్ చేశాడు. దీంతో మోహన్ లాల్ – షారుఖ్ ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags

Related News

Divvala Madhuri: ఆ రికార్డింగ్ డ్యాన్స్ వీడియోపై స్పందించిన దివ్వెల మాధురి.. రూ.కోటి మీదే!

Venuswamy : అమ్మ బాబోయ్.. వేణు స్వామి దగ్గరకు అమ్మాయిలు అందుకోసమే వస్తారా..?

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

Big Stories

×