E-Paper
Advertisement

Jai Hanuman in 3D Version: ఐమ్యాక్స్ 3డి వెర్షన్‌లో ‘జై హనుమాన్’.. డ్రాగన్స్‌తో హనుమంతుడి ఫైట్.. పోస్టర్ అదుర్స్!

Jai Hanuman in 3D Version: ఐమ్యాక్స్ 3డి వెర్షన్‌లో ‘జై హనుమాన్’.. డ్రాగన్స్‌తో హనుమంతుడి ఫైట్.. పోస్టర్ అదుర్స్!
Advertisement

Jai Hanuman Releasing in 3D Version: క్రియేటివ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ కథానాయకుడిగా వచ్చిన ‘హనుమాన్’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక చిన్న మూవీగా సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా ఎవరూ ఊహించని బ్లాక్ బస్టర్ హిట్ ‌ని అందుకుంది. ఈ ఏడాది జనవరి 12న రిలీజ్ అయి సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది.

అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద కూడా తన హవా ఏంటో చూపించింది. ఏకంగా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లను నమోదు చేసి అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే ఈ మూవీ ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని ఎవరూ అనుకోలేదు. ఈ మూవీ కూడా మరో ఆదిపురుష్ అవుతుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు.

Advertisement

ఫస్ట్ షో నుండే పాజిటివ్ రెస్పాన్స్‌తో దుమ్ముదులిపేసి.. విమర్శకుల నుండి ప్రశంసలను అందుకుంది. దీంతో దర్శకుడు ప్రశాంత్ ఈ చిత్రానికి సీక్వెల్ ప్రకటించాడు. ఈ సీక్వెల్ చిత్రానికి గానూ ‘జై హనుమాన్’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఇక ఈ సీక్వెల్ మూవీ ప్రకటించినప్పటి నుంచి మంచి హైప్ ఏర్పడింది.

Also Read: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘జై హనుమాన్’ కొత్త పోస్టర్..

Advertisement

అంతేకాకుండా ఈ మూవీ మొత్తం ఆంజనేయుడి నేపథ్యంలో ఉంటుందని దర్శకుడు చెప్పాడు. అయితే ఇందులో రాముడిగా మహేష్ బాబు, ఆంజనేయుడిగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తే బాగుంటుందని తాను అనుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీంతో మరింత హైప్ నెలకొంది.

అంతేకాకుండా అప్పుడప్పుడు ఈ మూవీ గురించి అప్డేట్లు ఇస్తూ ప్రేక్షకాభిమానుల్ని ఖుషీ చేస్తుంటాడు. ఇటీవలే ఓ చిన్న వీడియోను సోషల్ మీడియాలో వదులుతూ అభిమానుల్లో ఎనర్జీ లెవెల్ పెంచేశాడు. ఆ తర్వాత శ్రీరామనవమి రోజున ఓ అద్భుతమైన పోస్టర్‌ను రిలీజ్ చేసి అందరిలో ఆసక్తి రేకెత్తించాడు.

Also Read: Fahadh Faasil: సినిమాలు చూడండి అని వారికి మనమెందుకు చెప్పాలి..

అంతేకాకుండా ‘హనుమాన్ జయంతి’ రోజున మరొక పోస్టర్ రిలీజ్ చేసి సర్ప్రైజ్ అందించాడు. ఈ మేరకు రిలీజ్ అయిన కొత్త పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. డ్రాగన్స్‌తో హనుమంతుడికి గట్టి ఫైట్లను పెట్టినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా మేకర్స్ ఈ కొత్త పోస్టర్‌తో పాటు మరొక అప్డేట్‌ను కూడా అందించారు. జై హనుమాన్ మూవీని ఐమ్యాక్స్ 3డి వెర్షన్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ ద్వారా తెలిపారు. పోస్టర్ బట్టి చూస్తే ప్రశాంత్ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Related News

కరువు పరిస్థితులపై సినీ ఇండస్ట్రీ సహకారం కోరిన సీఎం రేవంత్.. వెంటనే స్పందించిన నాగ్!

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

వికెట్ పడిన ఆనందంలో జుట్టు పట్టుకున్నా, కానీ ఆ బౌలర్ విగ్గే ఊడిపోయింది

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Big Stories

Advertisement
×