E-Paper
Advertisement

Rajinikanth Remuneration: ‘కూలీ’ కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్‌.. మరో ‘బాహుబలి 2’ తీయొచ్చు!

Rajinikanth Remuneration: ‘కూలీ’ కోసం రజినీ భారీ రెమ్యూనరేషన్‌.. మరో ‘బాహుబలి 2’ తీయొచ్చు!
Advertisement

Rajinikanth’s Remuneration for Coolie Movie: బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలతో సమానంగా వరుస సినిమాలు తీస్తూ ప్రేక్షకాభిమానుల్ని విపరీతంగా అలరిస్తున్నాడు. గతేడాది ‘జైలర్’ మూవీతో వచ్చి బాక్సాఫీసు బద్దలు కొట్టాడు. ఈ మూవీకి ముందు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్‌గా మిగిలాయి. అయితే జైలర్‌తో రజినీ, ఆయన ఫ్యాన్స్ ఆకలి తీరింది.

ఇక ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో మరోక సినిమాలో అతిథి పాత్రలో చేసి అలరించాడు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లాల్ సలాం’ మూవీలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మూవీ మంచి అంచనాలతో తెరకెక్కింది. కానీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఇక ఇప్పుడు రజినీ మరొక కొత్త మూవీ చేస్తున్నాడు. ‘విక్రమ్’ మూవీతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు లోకేషన్ కనగరాజ్‌తో ‘తలైవర్ 171’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి ఇటీవలే ‘కూలి’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ మేరకు రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్‌లో రజినీ మాస్ స్టైల్ వేరే లెవెల్లో ఉంది.

Advertisement

అంతేకాకుండా రజినీ ఎంట్రెన్స్‌ అద్భుతంగా ఉంది. అలాగే డైలాగ్స్, యాక్షన్ సీన్స్ గురించి ఇక చెప్పాల్సిన పనేలేదు. ఈ ఒక్క గ్లింప్స్‌తో సినిమా మరో స్థాయికి చేరుకుంది. అయితే ఈ టీజర్‌కు అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా.. మరికొందరి నుంచి మాత్రం నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అంచనాలకు తగ్గట్టుగా ఈ టీజర్ లేదనే కామెంట్లు వినిపించాయి. విక్రమ్, లియో వంటి సినిమాల రేంజ్‌లో ఈ కూలి టైటిల్ టీజర్ లేదని రజినీ, లోకేష్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. ఇకపోతే ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రజినీకాంత్ సరసన శోభన చాలాకాలం తర్వాత నటించబోతున్నట్లు తెలుస్తోంది.

Also Read: తలైవర్ 171 టైటిల్ టీజర్ వచ్చేసింది.. రజినీ మాస్ అవతార్.. కాదు.. కాదు.. ఊర మాస్!!

Advertisement

అంతేకాకుండా ఈ మూవీలో మరికొంత మంది స్టార్ నటీ నటులు భాగం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురు స్టార్ నటి శృతి హాసన్.. రజినీకి కూతురుగా నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించబోతున్నట్లు టాక్ గట్టిగానే నడుస్తుంది. దీనిపై అఫీషియల్ అప్డేట్ రావాల్సి ఉంది.

ఇదంతా ఒకెత్తయితే ఈ మూవీ కోసం రజినీ రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అతడి రెమ్యూనరేషన్ తెలిసి నెటిజన్లు ఖంగుతింటున్నారు. ఒక్క సినిమాకి రజినీకాంత్ ఇంత పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడా అని నోరెళ్ళబెడుతున్నారు. రజినీ ఏకంగా ఈ మూవీ కోసం రూ.260 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. అలాగే దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూ.60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో నిజమెంత ఉందో త్వరలో తెలుస్తుంది.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×