Mollywood.. ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేస్తే చూడముచ్చటగా ఉంటుంది అని పెద్దలు అంటూ ఉంటారు. అందుకే అమ్మాయికి 20 ఏళ్లు.. అబ్బాయికి 22 ఏళ్ళు వచ్చాయంటే చాలు.. అప్పుడే.. ఏంటి ఇంకా పెళ్లి చేసుకోవా? అంటూ అడగడం మొదలు పెడతారు.అయితే ఇది సామాన్య ప్రజలకే కాదు సెలబ్రిటీలకు కూడా తప్పని ప్రశ్న. కానీ కొంతమంది మాత్రం వయస్సు దాటిపోయి..వృద్ధాప్య వయసుకు చేరువవుతున్నా పెళ్లి మాట ఎత్తడం లేదు. ముఖ్యంగా హీరోలను అటుంచితే కొంతమంది హీరోయిన్స్ అయితే ఏకంగా పెళ్లంటే వద్దు బాబోయ్ అంటూ పారిపోతున్నారు. కానీ మరి కొంతమంది హీరోయిన్స్ మాత్రం చక్కగా కరెక్టు సమయంలోనే పెళ్లి చేసుకొని, పిల్లలకు జన్మనిచ్చి, హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. మరి ఇప్పుడు చెప్పబోయే కొంతమంది హీరోయిన్స్ మాత్రం పెళ్లి అంటే వద్దు అంటూ ఆమడ దూరం పరిగెడుతున్నారు. మరి వారెవరో కాదు మాలీవుడ్ హీరోయిన్స్. పేరుకే మలయాళం హీరోయిన్స్ అయినా.. అత్యుత్తమ నటన కనబరుస్తూ.. అంద చందాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ.. తెలుగులో పాగా వేసేశారు. మరి ఆ మాలీవుడ్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
పెళ్లంటే దూరం అంటున్న హీరోయిన్స్..
మాలీవుడ్ హీరోయిన్స్ అనగానే ప్రథమంగా కీర్తి సురేష్ (Keerthi Suresh) పేరు ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ 30 ఏళ్లు క్రాస్ అవ్వడంతో హడావిడిగా వివాహ బంధంలోకి అడుగు పెట్టింది. కానీ మిగతావారు మాత్రం ఏళ్లు దాటినా.. పెళ్ళికి దూరం అంటున్నారు. అలాంటి వారిలో పార్వతి తిరువోతు (Parvathi thiruvothu) ఒకరు. ప్రస్తుతం ఈమె వయసు 35 సంవత్సరాలు. అయినా పెళ్లి మాట ఎత్తడం లేదు. ఈ జాబితాలోకొచ్చే మరొక బ్యూటీ నిత్యామీనన్(Nithya Menon).. తెలుగులో స్టార్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ఈమె.. జీవితంలో అసలు పెళ్ళే చేసుకోనంటోంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఈ జాబితాలోకి మరో స్టార్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి (Aishwarya Lakshmi)కూడా చేరిపోయింది. మొదట ఈమె కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది. పెళ్లి చేసుకోవాలనుకుంది. కానీ తర్వాత ఎదురైన కొన్ని పరిణామాలు.. ఈమె మనసును మరింత కఠినంగా మార్చేశాయి. అందుకే ఈమె కూడా పెళ్లికి దూరం అని చెబుతోంది.
పెళ్లి మాటే ఎత్తని హీరోయిన్స్..
ఇక వీరే కాదు ఇటీవల తన అందచందాలతో భారీ పాపులారిటీ అందుకున్న బాలయ్య (Balakrishna) బ్యూటీ హనీ రోజ్ (Honey Rose) కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. పెళ్లి చేసుకుని హనీమూన్ కి వెళ్లాలనే ఆలోచన ఈ ముద్దుగుమ్మకు లేనట్టు కనిపిస్తోంది. చేతిలో ‘రాచెల్’ సినిమా తప్ప మరో ప్రాజెక్ట్ లేదు. అయినా సరే వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించడం లేదు ఈ ముద్దుగుమ్మ. ఇక మరొక హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika mohanan).. ఈమె వయసు కూడా 30 ఏళ్ల పైమాటే.. కానీ ఈమె కూడా పెళ్లికి సిద్ధంగా లేనట్టు కనిపిస్తోంది.
ఎఫైర్స్ ని కూడా ఫ్రెండ్షిప్ అంటూ కొట్టిపారేస్తున్న హీరోయిన్స్..
వీరే కాకుండా కళ్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan) కూడా ఒంటరి జీవితానికి ఓటేస్తోంది. గతంలో మోహన్ లాల్ (Mohan Lal) కొడుకు ప్రణయ్(Pranay) తో డేటింగ్ అంటూ వార్తలు వచ్చాయి. కానీ అది కేవలం స్నేహం మాత్రమే అంటూ కొట్టి పారేసింది. ఇక ఇలా మాలీవుడ్ హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లికి దూరం అంటూ కెరియర్ పైనే ఫోకస్ పెడుతున్నారు. కానీ తమ అభిమాన హీరోయిన్స్ పెళ్లి చేసుకొని తమకంటూ ఒక జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్న అభిమానులకు మాత్రం నిరాశ మిగులుస్తున్నారు అని చెప్పవచ్చు.